breaking news
summer special
-
ఫ్యామిలీ రెస్టారెంట్లో హోంవర్క్ మెనూ కార్డ్
స్కూల్ మొదలైంది. టీచర్లు కొత్త ఉత్సాహంతో హోమ్‌వర్క్ అసైన్ చేస్తారు. ఇక ఇళ్లల్లో టెన్షన్. సాయంత్రం ఆరు కాగానే ‘హోంవర్క్ చేశావా?’ అమ్మ అరుపు.‘ఇంకా టైం ఉంది’ పిల్లాడి టీవీ చూపు. రాత్రి తొమ్మిదికి ‘అవలేదు... రేపే సబ్మిట్ చేయాలి’ పిల్లాడి మాటకు నాన్న బీపీ చెక్ చేసుకుంటాడు. హోంవర్క్ ‘పనిష్మెంట్’ కాదు. దాని ఉద్దేశం క్లాస్‌లో విన్నది ఇంటిదగ్గర ‘రీప్లే’ చేసి మెదడులో ‘సేవ్’ చేసుకోవడం. మరి హోంవర్క్‌ను హ్యాపీవర్క్గా ఎలా చేయాలి?స్కూళ్లు తెరిచాక పిల్లలకే కాదు, పేరెంట్స్‌కి కూడా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది దాకా ‘హోంవర్క్ అవర్స్’ అంటే హారర్ మూవీ. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన నాన్నకి లెక్కలు చెప్పాల్సిన టెన్షన్, వంటింట్లోంచి బయటకొచ్చిన అమ్మకి స్పెల్లింగ్స్ దిద్దాల్సిన టెన్షన్. చివరికి ‘చదువు నీ కోసమా, మా కోసమా’ అనే దగ్గరికి వస్తుంది. నిజానికి హోంవర్క్ పిల్లల బాధ్యత. దాన్ని ‘ఫ్యామిలీ ప్రాజెక్ట్’ చేయకుండా, ‘సెల్ఫ్ ప్రాజెక్ట్’గా మార్చి, పిల్లలే ఇష్టపడి చేసేలా మలచాలి. 25 నిమిషాల రూల్సైకాలజీ లెక్క ప్రకారం పిల్లాడి వయసు X 2 నిమిషాలు = అటెన్షన్ స్పాన్. అంటే 7 ఏళ్ల పిల్లాడికి 14 నిమిషాలు. అంతే. ఆ తర్వాత బుర్ర ‘రిఫ్రెష్’ అవాలి. అందుకే రెండు గంటల పాటు హోంవర్క్ అంటే బిక్కమొహం పెడతారు. దీనికి 25 నిమిషాల రూల్ ఉంది.అదేంటంటే 25 నిమిషాలు ఫుల్ ఫోకస్‌తో హోంవర్క్ చేయాలి. మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లిష్ నోట్స్ రాయడం కావచ్చు. టైం అయ్యాక ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. ఆ ఐదు నిమిషాల్లో వాటర్ తాగడం, చిరుతిండి, బాల్కనీలోకి వెళ్లి రావడం. మళ్లీ 25 నిమిషాలు హోంవర్క్ చేయాలి. ఇలా 4 రౌండ్లు చేస్తే 100 నిమిషాల హోంవర్క్ అయిపోతుంది. పిల్లలకు ‘2 గంటలు’ అనే భయం ఉండదు. ‘జస్ట్ 25 నిమిషాలు’ అనిపిస్తుంది. ఫోన్ లో అలారం పెట్టి 25 నిమిషాలకు ‘టింగ్’ అనగానే పెన్సిల్ పడేయాలి. ఇది గేమ్‌లా మారితే పిల్లలు ఎగబడి చేస్తారు.హోంవర్క్ మెనూపిల్లలకు ‘ఇవాళ మొత్తం చెయ్యాలి’ అంటేనే సగం ఎనర్జీ పోతుంది. అందుకే హోంవర్క్‌ని ‘మెనూ కార్డ్’లా మార్చండి. ఒక మెనూ పిల్లాడి ఎదురుగా పెట్టండిస్టార్టర్: ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్స్ – 5 నిమిషాలు మెయిన్ కోర్స్: మ్యాథ్స్ సమ్స్ – 15 నిమిషాలు డెజర్ట్: తెలుగు పోయెమ్ కంఠస్థం – 10 నిమిషాలు ‘ముందు ఏది తింటావ్?’ అని పిల్లల్ని అడగండి. ‘ఛాయిస్’ ఇచ్చినట్టు ఉంటుంది. కష్టమైన మ్యాథ్స్‌ని ‘మెయిన్ కోర్స్’ అన్నాం కాబట్టి ముందు ఈజీ ఉన్న ‘స్టార్టర్’ కంప్లీట్ చేస్తారు. కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకో ఐటమ్ అయ్యాక టిక్ పెట్టండి. ‘మెనూ కంప్లీట్’ అని స్టిక్కర్ ఇవ్వండి. హోంవర్క్ అయిపోయిన ఫీలింగ్ కాకుండా ‘రెస్టారెంట్లో ఫుల్ మీల్స్ తిన్నాం’ అనే ఫీలింగ్ వస్తుంది.పిల్లాడే టీచర్హోంవర్క్ బోర్ ఎందుకంటే పిల్లాడు ఎప్పుడూ ‘స్టూడెంట్’. అప్పుడప్పుడు వాడిని ‘టీచర్’ని చేయండి. మ్యాథ్స్ హోంవర్క్ చేసిన తర్వాత వాడు టీచర్లా మారి బోర్డు లేదా పేపర్ మీద ఆ సమ్ ఎలా చేశాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కావాలని ఒకచోట తప్పు అడగండి. వాడు మిమ్మల్ని కరెక్ట్ చేయాలి. ‘ఎదుటివారికి చెప్పడం’ అనేది నేర్చుకోవడంలో అత్యంత బలమైన పద్ధతి. దీన్ని ‘ఫెయిన్ మన్ టెక్నిక్’ (నోబెల్ లారియేట్, భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫెయిన్ మన్ సూచించిన పద్ధతి) అంటారు. పిల్లవాడు టీచర్ అవ్వగానే వాడికి సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆ కిక్ వాడిని మరుసటి రోజు హోంవర్క్ వైపు లాగుతుంది.పేరెంట్స్‌కి హెచ్చరికమీరే చేయకండి: హెల్ప్ చేయండి, కానీ ఆన్సర్ మీరు రాయకండి. ‘మూడ్’ చూడండి: హోంవర్క్ చేస్తూ పిల్లవాడు నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా? నవ్వుతూ చేస్తే 5 మార్కులైనా చాలు. ఏడుస్తూ 10 మార్కులు వచ్చినా వేస్ట్. టీవీ, ఫోన్ బంద్: ‘నువ్వు చదువు, నేను రీల్స్ చూస్తా’ అంటే పిల్లాడికి కడుపు మండుతుంది. హోంవర్క్ టైమ్‌లో మీరు పేపర్ చదవండి, పుస్తకం చదవండి.మార్కుల పంటహోంవర్క్ శిక్ష కాదు. ‘స్కూల్‌కి ఇంటికి మధ్య వేసే చిన్న వంతెన’. ఆ వంతెన మీద పిల్లలు నవ్వుతూ నడవాలి, ఏడుస్తూ కాదు. టీచర్ క్లాస్‌లో విత్తనం వేస్తే, హోంవర్క్ అనే నీళ్లు ఇంటిదగ్గర పోయాలి. అప్పుడే మార్కులు అనే పంట పండుతుంది.– కె. -
ఇక్కడి నుంచే సొసైటీ ఈక్వాలిటీ!
స్కూల్ గ్రౌండ్లో క్రికెట్.. అబ్బాయిలు బ్యాట్ పట్టుకున్నారు. ఒక అమ్మాయి ‘నేను కూడా ఆడతా’ అంది. జవాబు ‘బాల్ అందించు చాలు’. క్లాస్ లీడర్ ఎలక్షన్.. ‘అబ్బాయిలు ఎవరైనా నిలబడండి’ అంది టీచర్. ‘మేడమ్ నేను’ అన్న అమ్మాయికి నవ్వులు. ఇది 2026. అమ్మాయిలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. కానీ కొందరి ఆలోచనలు పాతగానే ఉన్నాయి. బడిలోనే ‘తేడా’ మొదలైతే రేపు సమాజంలో అది ‘వివక్ష’ అవుతుంది. సమభావనే సిసలైన చదువు.కేస్ స్టడీ 1: కెప్టెన్ కావ్యకావ్యకి కబడ్డీ పిచ్చి. కానీ పీఈటీ సార్ ‘అమ్మాయిలు కబడ్డీ ఆడకూడదు, దెబ్బలు తగులుతాయి’ అని తేల్చేశాడు. కావ్య ఊరుకోలేదు. ప్రిన్సిపాల్‌కి లెటర్ రాసింది... ‘సార్, దెబ్బ తగిలితే డెటాల్ రాసుకుంటాను. కానీ ఆడకుండా ఆపితే అసలైన గాయం అవుతుంది’. ప్రిన్సిపాల్ దిగొచ్చాడు. స్కూల్లో మొదటిసారి ‘గర్ల్స్ కబడ్డీ టీం’ పుట్టింది. కావ్య కెప్టెన్ . ఆ టీం జిల్లా లెవెల్లో కప్ కొట్టింది. ఒక్క అమ్మాయి ‘ఎందుకు కాదు?’ అని అడిగితే, వందమంది అమ్మాయిలకు ‘ఆడొచ్చు’ అనే దారి దొరికింది.కేస్ స్టడీ 2: వంటగది వరుణ్వరుణ్ వాళ్లమ్మ జాబ్ చేస్తుంది. ఒకరోజు అమ్మకి జ్వరం. 9వ తరగతి వరుణ్ స్టవ్ వెలిగించి చపాతీ చేశాడు. స్కూల్‌కి క్యారేజ్‌లో అదే తెచ్చాడు. ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు... ‘ఏందిరా ఆడపిల్లలా వంట చేశావా?’. వరుణ్ తల దించుకోలేదు. ‘మా అమ్మ రోజూ నాకు అన్నం పెడుతున్నప్పుడు, నేను ఒక్కరోజు మా అమ్మకి ఎందుకు పెట్టకూడదు?’ అన్నాడు. క్లాస్ టీచర్ అది విని మరుసటి రోజు ‘లైఫ్ స్కిల్’ పీరియడ్ పెట్టింది. అబ్బాయిలతో ఉ΄్మా చేయించింది, అమ్మాయిలతో సైకిల్ టైర్‌కి పంక్చర్ వేయించింది. ఆ రోజు నుంచి ఆ క్లాస్‌లో ‘ఆడపని, మగపని’ అనే బోర్డ్ పీకేసి, ‘నా పని’ అనే బోర్డ్ పెట్టారు.పిల్లలకు పెద్ద మాటలు కూడా అర్థమవుతాయి. క్లాస్‌లో సబ్జెక్ట్ చెబుతూనే మధ్యలో ‘జెండర్ సెన్సిటివిటీ’ అంటే ఏంటి? అని అడగండి. వాళ్లు ‘అంటే ఏంటో చెప్పండి టీచర్’ అంటారు. అప్పుడు ఇలా చెప్పాలి:‘జెండర్ సెన్సిటివిటీ’ అంటే అబ్బాయిలూ అమ్మాయిలూ సమానమని గుండె లోతుల్లో నమ్మడం. అబ్బాయిలకు కొమ్ములు, అమ్మాయిలకు రెక్కలు విడిగా మొలవవని తెలుసుకోవడం. ఇద్దరికీ మెదడు ఒకటే, గుండె ఒకటే, కలలు కనే హక్కు ఒకటే అనే అవగాహన కలిగి ఉండటం. స్కూల్, ఇల్లు ఏం చేయాలి? EQUAL రూల్ పాటించాలి→E- EXAMPLESమార్చండిపుస్తకాల్లో ఇప్పటికీ ‘అమ్మ వంట చేస్తుంది, నాన్న ఆఫీస్‌కి వెళ్తాడు’ అని ఉంటుంది. దాన్ని చెరిపేయండి. ‘అమ్మ ఇస్రోలో సైంటిస్ట్... నాన్న పిల్లలకు క్యారేజ్ కడతాడు’ అని చెప్పండి. గోడ మీద ‘గుడ్ హ్యాబిట్స్’ చార్ట్‌లో అబ్బాయి మొక్కలకు నీళ్లు పోస్తున్నట్టు, అమ్మాయి డ్రిల్ మెషీన్ పట్టుకున్నట్టు బొమ్మలు పెట్టండి. పిల్లలు చూసేదే నమ్ముతారు.Q- QUASTIONS అడగనివ్వండి‘మేడమ్, అబ్బాయిలు బ్రైట్ కలర్స్ వేసుకోకూడదా? అమ్మాయిలు షార్ట్ హెయిర్ ఉంచుకోకూడదా?’ అని పిల్లలు అడిగితే ‘సిల్లీ క్వశ్చన్ ’ అని నోరు మూయించకండి. ‘నీ ఇష్టం. ఛాయిస్ నీది. సమాజం కోసం నటించక్కర్లేదు’ అని గుండెల మీద చెయ్యి వేసి చెప్పండి. పిల్లల డౌట్ తీరితేనే రేపటి డిస్క్రిమినేషన్ పోతుంది. ప్రశ్నని చంపితే, ఆలోచనని చంపినట్టే.U-UNIFORM పనిక్లాస్ లీడర్, డస్టర్ దులిపే డ్యూటీ, రంగు కాగితాలు అంటించడం, అసెంబ్లీలో మాట్లాడటం – అన్నీ లిస్ట్ రాసి చీటీలు తీయించండి. పనులు అబ్బాయిలకు వచ్చినా అమ్మాయిలకు వచ్చినా చేయాలి. అమ్మాయి లీడర్ అయితే క్లాస్ ఇంకా సైలెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ‘నేను తగ్గేదేలే’ అని ప్రూవ్ చేసుకోవాలనే కసి వాళ్లలో ఎక్కువ. ఆ కసే రేపు దేశాన్ని నడిపిస్తుంది.A-ABUSEకి జీరో టాలరెన్స్‘ఆడపిల్లలా ఏడుస్తావా?’, ‘అమ్మాయిగా ఉంటూ రౌడీ వేషమా?’ – ఈ మాటలు మీ నోటి నుంచి రాకుండా స్కూల్ గేట్ దగ్గరే చెక్ చేసుకోండి. టీచర్ అయినా, ఫ్రెండ్ అయినా, పేరెంట్ అయినా ఇలాంటి మాటలు అంటే స్టాఫ్ రూంలో వార్నింగ్, మళ్లీ అంటే ఫైన్ .L-LEARN FORM KIDSపిల్లలకి పుట్టుకతో బయాస్ ఉండదు. ఒకటవ క్లాస్ పాపకి పక్కన కేవలం అమ్మాయిలతో ఆడుకోవాలా లేదంటే అబ్బాయిలతో ఆడుకోవాలా అనేది ఉండదు. మనమే బుర్రలో పురుగు పెడతాం. పిల్లల్ని చూసి మనం ‘అన్ లెర్న్’ అవ్వాలి. వాళ్ల ప్రపంచంలో ‘మంచి మనిషి’, ‘చెడ్డ మనిషి’ తప్ప ‘ఆడ మనిషి’, ‘మగ మనిషి’ అనే తేడా లేదు. ఆ స్వచ్ఛతని మనం పాడుచేయకూడదు.→ పేరెంట్స్‌కి స్పెషల్ నోట్కొడుకు దెబ్బ తగిలి ఏడిస్తే ‘గట్టిగా ఉండరా, మగాడివి కదా’ అని కన్నీళ్లు ఆపకండి. ఏడవనివ్వండి. ఫీలింగ్స్‌కి జెండర్ అంటించకండి. కూతురికి సైకిల్ కొనిస్తే ‘వేగంగా తొక్కకు, పడిపోతావ్’ అని కాళ్లకి సంకెళ్లు వేయకండి. ‘హెల్మెట్ పెట్టుకో, నువ్వు గెలవగలవు’ అని రెక్కలు కట్టండి. కొడుకుకి బ్యాంక్ అకౌంట్‌తో పాటు పొయ్యి వెలిగించడం, కూతురికి వంటతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం నేర్పండి.→ చివరిగా...బడి అంటే ‘మార్కుల ఫ్యాక్టరీ’ కాదు, ‘వ్యక్తిత్వాలు తయారయ్యే ఒడి’. ‘ఎవరు ఏమవ్వాలి’ అని మనం శాసనాలు రాయకూడదు, ‘ఏమైనా అవ్వగలరు’ అని శ్వాస ఇవ్వాలి. బడిగంట మోగింది. ఇక వివక్షకి చెల్లు. సమానత్వానికి స్వాగతం.– కె. -
బెరుకులేని చదువే... బెంచ్..మార్క్!
ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ దాకా నవ్వులు కనిపిస్తున్నాయి. కానీ ఆ నవ్వుల మధ్యలో కొన్ని మొహాలు డల్‌గా ఉన్నాయి. ఒకడు ఒంటరిగా లంచ్ చేస్తున్నాడు. ఒక గర్ల్ స్టూడెంట్ బాత్రూమ్కి వెళ్లాలన్నా భయపడుతోంది. వెనక బెంచీలో ముగ్గురు ముందు బెంచీ వాడిని చూస్తే బెదిరిపోతున్నారు. టీచర్లకు చెప్పాల్సిన సిలబస్ మాత్రమే కనిపిస్తుంది. కానీ బెంచీల మధ్య జరిగే ‘సైలెంట్ వార్’ కనిపిస్తోందా? క్లాస్‌లో మనసులన్నీ సేఫ్‌గా ఉన్నాయా? బుల్లీయింగ్ జరుగుతున్నదేమో చూశారా?స్కూళ్లు తెరుస్తారు. పాఠాలు మొదలవుతాయి. పిరియడ్కూ పిరియడ్కూ మధ్య టంగు టంగుమంటూ గంట ఉంటుంది. కానీ పిల్లల ప్రపంచంలో అసలు పాఠం బ్రేక్ టైమ్‌లో మొదలవుతుంది. ఎవరో ఎవరితోనో ‘ఇక్కణ్ణుంచి లే’ అంటారు. ఎవరి వాటర్ బాటిల్నో ఎవరో విసిరేస్తారు. ఎవరి పేరునో మరొకరు ఫన్నీగా పిలిచి ఏడిపిస్తారు. బుల్లీయింగ్.. గ్రూపిజం... నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. ‘వాడు మనోడు కాదు’...‘వాడి షూస్ బ్రాండెడ్ కాదు’... ‘నీకు ఇంగ్లీష్ రాదు’.. ‘నీ ర్యాంక్ తక్కువ’... పిల్లల మధ్య మాటలు ఎక్స్ఛేంజ్ అవుతుంటాయి. పేరెంట్స్‌కి ఇవి తెలీవు. ప్రిన్సిపాల్ దగ్గరికి కంప్లైంట్ వెళ్లదు. ఎందుకంటే బాధ పడే పిల్లాడు భయంతో చెప్పడు. మరి ఎవరు కనిపెట్టాలి? క్లాస్‌లో 40 నిమిషాలపాటు వాళ్లతో ఉండే టీచరే. పిల్లాడి మనసులో గాయాల్ని చూసే ఫస్ట్ కౌన్సెలర్ టీచరే.→ చివరి బెంచీ పిల్లాడు సైలెంట్ ఎందుకు?ఆ చివరి బెంచీ పిల్లాడు ఏది అడిగినా జవాబు చెప్పడు. మౌనంగా ఉంటాడు. వాడొక ‘మొద్దు’ అని మీరు అనుకోవచ్చు. కానీ నిజం వేరే ఉండొచ్చు. వాడి డ్రెస్ చిరిగిపోయిందని ముందు బెంచీ వాళ్లు నవ్వారేమో. నత్తిగా మాట్లాడతాడని వెనక నుంచి ‘సౌండ్’ చేస్తున్నారేమో. లంచ్‌టైమ్‌లో వాడి బాక్స్ లాగేసి పరిగెత్తారేమో. వాడి సైలెన్స్ కు కారణం చదువురాక కాదు, భయం. ఇలా బాధ పడుతున్న పిల్లలను ఎలా కనిపెట్టాలి? క్లాస్‌లో గ్రూప్ యాక్టివిటీ ఇవ్వండి. ‘ఇష్టమైన వాళ్లతో గ్రూప్ చేసుకోండి’ అనండి. మీరే లెక్కపెట్టి గ్రూప్స్ విడదీయండి. అప్పుడు ఒకరిద్దరు మిగులుతారు. అంటే వారిని అందరూ కలిసి సైడ్ చేశారన్నమాట. అలాంటి పిల్లలతో విడిగా మాట్లాడండి. ‘నీకు ఏమైనా ప్రాబ్లమా?’ అని డైరెక్ట్‌గా అడగొద్దు. ‘నీకు ఏ గేమ్ ఇష్టం?’ అని స్టార్ట్ చేయండి. నమ్మకం వస్తే నిజం చెప్తాడు. చివరి బెంచీ సైలెన్స్ ని మీరు బ్రేక్ చేస్తే, వాడి లైఫ్‌లో ఫస్ట్ సౌండ్ మీరే అవుతారు.→ ‘కంప్లయింట్ బాక్స్’ ఉండాలి‘మా క్లాస్‌లో అందరం బాగున్నాం సార్’ అని పిల్లలంతా అంటారు. ఎందుకంటే బుల్లీ చేసేవాడి ముందు ఎవరూ నోరు విప్పరు. అందుకే క్లాస్‌లో ఒక ‘మాటల డబ్బా’ పెట్టండి. పేరు అవసరం లేదు. చీటీ మీద ‘నన్ను ఎవరో కొడుతున్నారు’ అని రాసి వేసినా చాలు. ‘ఫలానా వాడు నా పెన్ విరగ్గొట్టాడు’ అని రాసినా చాలు. వారానికి ఒకసారి మీరు మాత్రమే ఆ డబ్బా ఓపెన్ చేయండి. పేర్లు బయటికి చెప్పొద్దు. కానీ ఆ తప్పు చేసిన వాడిని విడిగా పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వండి. ‘ఇది తప్పురా. మళ్లీ చేస్తే ప్రిన్సిపాల్‌కి చెప్పాల్సి వస్తుంది’ అని వార్నింగ్ ఇవ్వండి. బాధ పడ్డ పిల్లాడికి ‘నేనున్నా’ అనే ధైర్యం ఇవ్వండి. ‘కంప్లైంట్ బాక్స్ అంటే మన స్కూల్ పరువు పోతుంది’ అని కొందరు అంటారు. కానీ నిజం ఏంటంటే, ఆ డబ్బా ఉండబట్టే పరువు నిలబడుతుంది. ఎందుకంటే సమస్యని దాచిపెడితే పెద్దదవుతుంది. బయటికి తీస్తే పరిష్కారం అవుతుంది. టీచర్‌గా మీరు కోర్ట్ కాదు, కౌన్సెలింగ్ సెంటర్.→ వేధించే పిల్లాడిని ఏం చేయాలి?బుల్లీ చేసిన పిల్లాడి పేరెంట్‌ని పిలిపించడం ఈజీ. కానీ మాట్లాడటం కష్టం. ఎందుకంటే ‘మా వాడు అలాంటోడు కాదు’ అని వాళ్లు ముందే డిఫెన్స్ లోకి వస్తారు. అందుకే ఈ మూడు రూల్స్ పాటించాలి.నేరం మోపొద్దు: ‘మీ అబ్బాయి రౌడీలా తయారయ్యాడు’ అనకండి. ‘క్లాస్‌లో ఒక సంఘటన జరిగింది. మీ అబ్బాయి కూడా అందులో ఉన్నాడు. మనం కలిసి సరిచేద్దాం’ అనండి. ‘మనం’ అనే మాట వాళ్లకి మీరు విలన్ కాదు, ఫ్రెండ్ అని అనిపిస్తుంది.పిల్లాడి ముందు పంచాయితీ వద్దు: పేరెంట్‌ని, పిల్లాడిని కలిపి కూర్చోబెట్టి ‘ఏరా నువ్వు చేశావా?’ అని అడగొద్దు. వాడు భయంతో ‘లేదు’ అంటాడు లేదా మొండిగా ‘అవును’ అంటాడు. ముందు పేరెంట్‌తో విడిగా మాట్లాడండి. తర్వాత పిల్లాడితో విడిగా మాట్లాడండి.సొల్యూషన్ తో ముగించండి: ‘ఇంకోసారి చేస్తే టీసీ ఇచ్చేస్తాం’ అని బెదిరించొద్దు. ‘మీవాడికి ఊపు ఎక్కువ. సాయంత్రం ఆటలకి పంపించండి. ఎనర్జీ అక్కడ రిలీజ్ అవుతుంది’ అని సలహా ఇవ్వండి. మీరు పేరెంట్‌కి శత్రువు కాదు, వాళ్ల పిల్లాడి భవిష్యత్తుకి మీరు పార్టనర్ అని ప్రూవ్ చేయండి. అప్పుడే ఇంటిదగ్గర కూడా మార్పు వస్తుంది.→ చివరిమాటక్లాస్లో 40 మంది పిల్లలుంటే వారు 40 మార్కుల లిస్టులు కాదు, మనసులని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ బెంచీ పిల్లాడి కంట్లో భయం, ఫస్ట్ బెంచీ పిల్లాడి కళ్లలో అహంకారం రెండూ డేంజరే. రెండిటికీ మందు మీ దగ్గరే ఉంది. అదే ‘పట్టించుకోవడం’. పాఠం మొదలుపెట్టే ముందు, ఒకసారి క్లాస్ మొత్తం చూడండి. ఎవరి మొహంలో బెరుకు ఉందో కనిపెడితే చాలు. బెంచీల మధ్య దూరం పోతుంది. అప్పుడు బ్లాక్‌బోర్డ్ మీద మీరు ఏం రాసినా వాళ్ల గుండెల్లోకి చేరుతుంది. ఎందుకంటే సేఫ్‌గా ఫీల్ అయిన పిల్లాడే షార్ప్‌గా నేర్చుకుంటాడు. -
చిరునవ్వుల చదువిద్దాం...
రెండు నెలల తర్వాత బడి. బ్లాక్‌బోర్డు ఎదుట టీచర్ నిలిచే సమయం. కొత్త క్లాసులో పిల్లలు. కొత్త లెసన్ ప్లాన్లు. అయితే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది. పిల్లలకు చిర్నవ్వుతో స్వాగతం పలకడం. వారిని వాత్సల్యంగా పలకరించడం. పిల్లలు పేరెంట్స్ కన్నా టీచర్స్‌తో ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్లే ‘స్కూల్ అమ్మ’, ‘స్కూల్ నాన్న’. పిల్లలు చదువులో ‘పాస్’ అవ్వాలంటే, టీచర్లు మొదట వాళ్ల దృష్టిలో పాస్ కావాల్సిందే. ఎలా?పిల్లలకు టీచర్లు బాగా తెలుసు. టీచర్లకు పిల్లలందరూ తెలియకపోయినా. ఒక్కోసబ్జెక్ట్కు ఇద్దరు ముగ్గురు టీచర్లు (సార్లు) ఉంటే వారిలో పాఠం ఎవరు బాగా చెప్తారో, ఎవరు చిరాకు పడతారో, ఎవరు ఎక్కువ కోపంగా ఉంటారో, ఎవరు పనిష్మెంట్లు ఎక్కువ ఇస్తారో పిల్లలకు తెలిసిపోతుంది. పిల్లలే ఆ సమాచారాన్ని ఒకరికి మరొకరు ఇచ్చుకుంటారు.స్కూళ్లు రీ ఓపెన్ అయినప్పుడు ‘మేథ్స్‌కు ఫలానా సార్ వస్తే బాగుండు’ అని కొందరు పిల్లలు ‘ఫలానా సార్/టీచర్ వద్దు బాబోయ్’ మరికొందరు పిల్లలు అనుకుంటారు. కాని ఎవరు రావాలనేది వారి చేతుల్లో ఉండదు. కాని వచ్చిన వారు తమ వ్యవహార శైలితో పిల్లలకు నచ్చడం వారి చేతుల్లోనే.‘ఈ ఏడాదంతా ఈ టీచర్లే’ అని పిల్లలకు స్కూల్ మొదటిరోజు తెలిసినప్పుడు ప్రతి టీచర్‌ను వాళ్లు ఇష్టపడేలా ఉంటే ఎంత బాగుంటుంది? టీచర్లు పిల్లల కోసం ఉన్నారు. పిల్లలు ఉన్నారు కనుక ఉన్నారు. కాబట్టి పిల్లలతో పాఠం సమయంలో కఠినంగా, మిగిలిన సమయాల్లో ప్రేమగా ఉంటూ కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు.కేస్ స్టడీ 1: సుజాత టీచర్ స్కూల్ తెరిచిన ఫస్ట్‌రోజు సుజాత మేడమ్ క్లాస్‌లోకి చాక్‌పీస్‌తో వెళ్లరు. ఒక పెద్ద చార్ట్, కొన్ని కలర్ స్కెచ్‌లు తీసుకెళ్తారు. బోర్డు మీద ముందో స్మైలీ గీసి ‘నా సమ్మర్ స్టోరీ’ అని రాసి, తాను సెలవుల్లో ఏం చేశారో మూడు నిమిషాలు చెప్తారు. ‘నేను మా ఊరెళ్లా, ఢిల్లీ చూశా, చాలా పుస్తకాలు చదివా’. తర్వాత పిల్లల్ని అడుగుతారు– ‘మరి మీ స్టోరీ ఏంటి?’ 40 మంది, 40 కథలు. ఒకడు అమ్మమ్మ వాళ్ల ఊర్లో బావిలో ఈత నేర్చాడు, ఒక పాప పిల్లి పిల్లకు పేరు పెట్టింది. నవ్వులు, కేకలు. పీరియడ్ అయిపోయింది. ఇలా క్లాసులు మొదలైతే పిల్లలు ఉత్సాహంగా ముందుకు దూకరూ?కేస్ స్టడీ 2: రవి సార్ రవి సార్ మ్యాథ్స్ అంటే పిల్లలకు దడ. సెలవుల తర్వాత మొదటి క్లాస్‌లో ఆయన బోర్డు మీద లెక్కల సూత్రం రాయరు. బదులుగా ‘మీలో ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టం?’అని అడుగుతారు. అందరూ చేతులు ఎత్తాక ‘సరే, ఐపీఎల్లో కోహ్లీ 5 మ్యాచ్‌లలో 45, 67, 2, 89,12 పరుగులు చేశాడు. యావరేజ్ ఎంత?’ అంటారు. పిల్లలు ఆన్సర్ చెప్పడానికి టకటకా పెన్నులు బయటకు తీస్తారు. లెక్కల క్లాసు ఇలా మొదలుపెట్టి రవిసార్ అనవసర భయాన్ని తగ్గిస్తారు. టీచర్లు దారి చూపేవారు. అయితే వారికి సూచనలు చేయవచ్చు.→ ‘అటెండెన్స్’ కంటే ముందు ‘అటెన్షన్’పేరుతో పిలవండి, నంబర్‌తో కాదు. రిజిస్టర్ లో ‘రోల్ నంబర్ 12’ అని ఉంటుంది. కానీ ఆ స్టూడెంట్‌కి పేరు ఉంది. ‘ఉత్కర్ష్... ఓ అక్కడ కూచున్నావా’ అని అనండి. ‘మేడంకి నా పేరు తెలుసా’ అనే ఫీలింగ్ ఉత్కర్ష్కి ధైర్యాన్నిస్తుంది. పరిశోధనలు చెప్తున్నాయి... పిల్లవాడిని పేరుతో పిలిచే టీచర్ క్లాస్‌లో హాజరు 23 శాతం ఎక్కువ ఉంటుందని. క్లాస్‌లో పేరు వినిపించే విద్యార్థి తన ఉనికికి సంతోషపడతాడు. ‘క్లాస్ లీడర్ ఎవరు?’... ‘బోర్డు తుడిచే మినిస్టర్ ఎవరు?’...‘పూలమొక్కలకు నీళ్లు పోసే గార్డెనర్ ఎవరు?’అని కొన్ని బాధ్యతలు ఇవ్వండి. పిల్లలకు ‘ఓనర్షిప్’ వస్తే బడి నచ్చుతుంది.→ ఆరా తీయండిమొదటిరోజు రోల్ కాల్ తీసేటప్పుడు మూడు నాలుగు పేర్లకు జవాబు రాదు. ‘ఆబ్సెంట్’ అని టిక్ పెట్టి వదిలేయకండి. ఆ పిల్లాడు ఎందుకు రాలేదు? టీసీ తీసుకున్నాడా? పనిమీద వేరే ఊరు వెళ్లాడా? లేక ‘బడి వద్దు’ అని మారాం చేస్తున్నాడా? 6వ క్లాస్, 9వ క్లాస్‌లో డ్రా΄ûట్స్ ఎక్కువ. ఫోన్ చేసి కనుక్కోండి. ‘ఏమైంది నాన్నా, రేపు వస్తావా?’ అని ఆ పిల్లాడితో మీరే మాట్లాడితే వాడి అమ్మానాన్నలకు ‘ఈ స్కూల్లో నా కొడుకుని పట్టించుకుంటారు’ అనే నమ్మకం వస్తుంది.→ మీ నవ్వే వాళ్లకు టానిక్ఫిన్లాండ్లో టీచర్లు మొదటి రెండు వారాలు అసలు పుస్తకం ముట్టుకోరు. కేవలం పిల్లలతో ‘బాండింగ్’ చేస్తారు. ఫలితం? ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌గా నిలిచింది. అందుకే మొదటిరోజు పిల్లలతో బాండింగ్ ఏర్పరుచుకోవడం మీదే దృష్టి పెట్టాలి. ‘ఇంట్లో ఎవరెవరు ఉంటారు?’..‘నీకు ఏ ఆట ఇష్టం?’... ‘అన్నం తిన్నావా?’ ఈ రెండు నిమిషాలు వాడికి ‘సేఫ్ జోన్’ క్రియేట్ చేస్తాయి. పిల్లవాడు మీతో కనెక్ట్ అయితే, సబ్జెక్ట్‌తో ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాడు. డియర్ టీచర్స్... విద్యార్థికి ‘బడి’ అంటే ‘బిల్డింగ్’ కాదు, మీరే. చాక్‌పీస్ పట్టుకునే ముందు, పిల్లాడి చేయి పట్టుకోండి. వాడు మిమ్మల్ని గురువుగా, గైడ్‌గా చూస్తాడు. అది చాలు, ఈ ఏడాది మీ క్లాస్ నూరుశాతం పాస్. -
సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు
సెలవులు అయిపోయాయి.రేపో మాపో బడిగంట. ఇక అమ్మ ‘లేవరా’ అంటుంది. బయట స్కూల్ బస్ హారన్ మోగుతుంది. టీచర్ గుర్తొచ్చి భయమేస్తుంది. స్కూలుకు పోబుద్ధి కాదు. రెండు నెలల సెలవుల తర్వాత పిల్లలకు ఇలా అనిపించడం మామూలే. దీనిని స్కూల్ ఫీవర్ అనొచ్చు. అయితే ‘ఇలా నీకొక్కడికే కాదు... క్లాసంతా’ అని చెప్పాలి. పిల్లల్ని బడికి హుషారుగా సిద్ధం చేయాలి.తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగే వేళన పిల్లలకు ఎన్నో సందేహాలు, లోలోపలి భయాలు, చిన్నపాటి ఆందోళనలు ఉంటాయి. కొత్త స్కూల్‌కి, కొత్త క్లాస్‌కి, కొత్త సెక్షన్‌కి మారడం... మళ్లీ ఆ భారీ స్కూల్ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టడం... కొత్త టీచర్లను ఫేస్ చేయడం... అదీగాక ఇన్నాళ్లూ ఫోన్ చూసిన కళ్లతో రేపు బ్లాక్‌బోర్డ్ చూడాలంటే కష్టమే. అందుకే స్కూల్ ఫీవర్ తెచ్చుకుంటారు. అయితే దానికి విరుగుడు మాత్ర ఉంది.‘స్కూల్ ఫీవర్’ ఎందుకు?రెండు నెలలు ఇష్టానుసారం గడిచి ఉంటాయి. లేట్‌గా లేవడం, ఆడుకోవడం, టీవీ, నో హోంవర్క్.... ఇప్పుడు మళ్లీ టైమ్‌కి లేవాలి, ఇంట్లో స్కూల్లో రూల్స్ వస్తాయి... బ్రెయిన్ కి ఇది సడన్ బ్రేక్‌లా ఉంటుంది. అందుకే కడుపులో తిప్పేసినట్టు, ఏడుపు వచ్చేట్టు, చిరాకు కోపం, ఏదైనా ఎత్తుగడ వేయాలనిపించడం... పిల్లల్ని గమనించి మొదట వారిని ‘చిన్న పనుల్లో’ పెట్టాలి. ‘పుస్తకాలకు అట్టలు వేద్దాం రా’, ‘కొత్త పెన్ను పెన్సిలు బాక్స్‌లో పెట్టుకున్నావా?’, ‘యూనిఫామ్ సైజ్ చెక్ చేద్దాంరా’... ఈ పనులు చేయిస్తుంటే పిల్లల మైండ్‌కి ‘ఓకే, స్కూల్‌కి రెడీ అవ్వాలన్నమాట’ అనే ఫీలింగ్ వస్తుంది. ఫీవర్ దానంతట అదే తగ్గిపోతుంది.కొత్త బ్యాగ్ బెంగను పోగొడుతుందా?పోగొడుతుంది. కానీ బ్యాగ్ ఒక్కటే చాలదు. స్కూల్ ఫస్ట్ డే ఉదయం పిల్లలు లేచి చేసే మూడు పనులు వారి స్కూల్ ఫీవర్‌ని తరిమి కొడతాయి. ∙లేవగానే వారు చక్కగా తయారయ్యేలా చూసి అద్దంలో వారిని వారికి చూపించాలి. కొత్త యూనిఫామ్‌లో భలే బాగున్నావ్ అనాలి. ఏదో ఒక సరదా మాట చెప్పి నవ్వించాలి. నవ్వితే బ్రెయిన్ ‘నేను హ్యాపీ’ అని ఫిక్స్ అవుతుంది. ముందురోజు రాత్రే ఇష్టమైన టిఫిన్ కనుక్కుని ‘నీ ఫేవరెట్ టిఫిన్ రెడీ’ అని చెప్పాలి. కడుపు ఫుల్ అయితే మూడ్ ఆటోమేటిక్ సెట్. ∙స్కూల్‌కి వెళ్లేటప్పుడు ‘నీ బెస్ట్ ఫ్రెండ్ నీ సెక్షన్లోనే పడొచ్చు’ అనో, ‘ఈసారి ఎవరు కొత్త ఫ్రెండ్స్ అవుతారో’ అనో ఉత్సాహ పరచాలి. ‘క్లాస్‌రూమ్‌లకు కొత్తగా పెయింట్ చేయించారట’ అని చెప్పాలి. అలాంటివి వింటే పిల్లలు ఎగ్జయిట్ అవుతారు.హుషారుగా ఎలా ఉండాలి?‘మొదటిరోజు కాబట్టి నువ్వు ఈరోజు హుషారుగా ఉంటే సంవత్సరం అంతా హుషారుగా ఉంటావ్’ అని చెప్పాలి. ‘టీచర్ క్లాస్‌లోకి రాగానే గుడ్ మార్నింగ్ మేడం అని కాస్త గట్టిగా చెప్పు. లంచ్‌టైమ్‌లో ఒంటరిగా కూర్చోకు. ఇంకో విషయం... ఫస్ట్‌డే ఎవరూ నీ ర్యాంక్ అడగరు. నీ కొత్త షూస్, నీ నవ్వు చూస్తారు. నేను అందరితో కలిసిపోతా అనే ధైర్యంతో ఉండు’ అని చెప్పాలి.బస్సెక్కించేటప్పుడు ‘నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నీ సెక్షన్లో ఉండే అందరు పిల్లలూ అలాంటి ఫీలింగ్‌తోనే ఇవాళ స్కూల్‌కి వస్తారు. ఏం పర్వాలేదు. వెళ్లు. అక్కడ బెంచీలు, బ్లాక్‌బోర్డు, బెల్ అన్నీ నీ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఏడాది నీదే. స్కూల్లో చదువు, ఆడు, కథలు విను, ఫ్రెండ్షిప్ చెయ్...’ అని చెప్పాలి. మొదటిరోజు దాటితే ఈ సంవత్సరం దాటేసినట్టే. కేస్ స్టడీ 1: కార్తికేయ, 7వ తరగతికార్తికేయ గుంటూరులో చదువుతున్నాడు. రేపు స్కూల్ తెరిస్తే సెవెన్త్‌లో కూచోవాలి. పోయిన సంవత్సరం ఆరుకు వచ్చినప్పుడు ఫస్ట్ డే ΄÷ద్దున్నే ‘కడుపునొప్పి’ అన్నాడు. అమ్మ టెంపరేచర్ చూసింది, జ్వరం లేదు. బస్సెక్కించబోతే మొహం అదోలా పెట్టి ‘కొత్త సెక్షన్లో నా ఫ్రెండ్స్ ఉండరు’ అన్నాడు. అమ్మ వాడితో ‘మా బుజ్జి కదూ. బ్యాగ్‌లో నీకిష్టమైన ఫుడ్ పెట్టాను. అది లంచ్‌లో నీ పక్కవాడితో షేర్ చేసుకో’ అని చెప్పింది. కార్తికేయ నసుగుతూనే బస్సెక్కాడు. డల్‌గా కూచున్నాడు. కాని సాయంత్రం ఇంటికి హుషారుగా వచ్చి ‘కొత్త ఫ్రెండ్ దొరికాడు మా’ అన్నాడు. స్కూల్ ఫీవర్ పోయింది. మళ్లీ ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్‌డేకి ప్రిపేర్ చేయాలి.కేస్ స్టడీ 2: శ్రావ్య, 10వ తరగతిశ్రావ్య హైదరాబాద్‌లో ప్రయివేట్ స్కూల్. ఇప్పుడు 10కి వచ్చింది. 9వ క్లాస్‌లో మ్యాథ్స్‌లో 55 మార్కులు వచ్చాయి. సెలవులు అయిపోతున్నాయంటే శ్రావ్యకు మూడ్ పాడవుతోంది. ‘రేపు మ్యాథ్స్ మేడం సెలవుల్లో ఏం చేశావ్ అంటే ఏం చెప్పాలి? నన్నే లెక్క చేయమంటుందేమో’ అని ఏడుపు. అప్పుడు నాన్న పక్కన కూర్చుని ఒక పేపర్ ఇచ్చాడు. ‘దీనిమీద రాయి. టీచర్... నాకు లెక్కలు కష్టం. కానీ నేను నేర్చుకోవడానికి రెడీ. దయచేసి హెల్ప్ చేయండి. ఫస్ట్ డే ఇది మేడం డెస్క్ మీద పెట్టు. చదివిన ఏ టీచరూ హెల్ప్ చేయకుండా ఉండదు’ అన్నాడు. శ్రావ్యకు స్కూల్ ఫీవర్ పోయింది. బుర్రలో ‘భయం’ పోయి ‘భరోసా’ రావడంతో స్కూల్‌కు వెళ్లడానికి రెడీగా ఉంది. -
జిరాక్స్ మెషిన్
చిన్నారులూ.. జిరాక్స్ మెషిన్ మనందరికీ తెలుసు కదా! స్కూల్ ప్రాజెక్ట్ కోసమో, నోట్స్ కోసమో మనం తరచూ జిరాక్స్ తీయిస్తుంటాం. మరి మీరెపుడైనా ఆలోచించారా? ఈ జిరాక్స్ మెషిన్ ను ఎవరు కనిపెట్టారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి అని? 1930లలో చెస్టర్ కార్ల్సన్ అనే అమెరికాకు చెందిన ఒక లాయర్ ఉండేవాడు. ఆయనకు ఆఫీసులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే... ఏదైనా పేపర్ కావాలంటే దాన్ని చూసి మళ్లీ చేత్తో రాయడం లేదంటే టైప్ చేయడం. దీనికి చాలా సమయం పట్టేది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన చాలా ఆలోచించాడు. ఒక పేపర్‌ను ఉన్నది ఉన్నట్లుగా క్షణాల్లో కాపీ చేసే మెషిన్ ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కార్ల్సన్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో రకరకాలుగా ప్రయోగాలు చేసి, 1938 అక్టోబర్ 22న ఆయన ప్రపంచంలోనే మొదటి ఫోటోకాపీని విజయవంతంగా తీశాడు. ఈ టెక్నాలజీకి గ్రీకు పదాల ఆధారంగా జిరోగ్రఫీ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో జిరోస్ అంటే ‘పొడి’, గ్రాఫియా అంటే ‘రాత’ అని అర్థం. అంటే సిరా లేకుండా రాసే పద్ధతి అన్నమాట. ఆ తర్వాత కాలక్రమంలో ‘జిరాక్స్’గా మారిపోయింది. మరో విశేçషం ఏమిటంటే మొదట్లో వచ్చిన జిరాక్స్ మిషన్ దాదాపు ఒక పెద్ద ఫ్రిజ్ అంత పరిమాణంలో ఉండేది! -
ప్రాణాలనే త్యాగం చేస్తాయి!
నేస్తాలూ! చీమల ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో అత్యంత విచిత్రమైన చీమ‘కొలొబోప్సిస్’ దీన్ని సాధారణంగా డోర్–హెడ్ యాంట్ అని పిలుస్తారు. ఈ చీమ తల ముందు భాగం గుండ్రంగా, ఫ్లాట్‌గా ఉండి శత్రువులు తన గూట్లోకి రాకుండా ఉండటానికి, తన తలను ఆ రంధ్రానికి అడ్డు పెట్టి కూర్చుంటుంది. అందుకే ఈ చీమకు డోర్‌హెడ్ యాంట్ అని పేరు. అంతేకాదు ఈ కొలొబోప్సిస్ చీమల జాతిలోనే కొన్ని చీమలకు ఒక సూపర్ పవర్ ఉంటుంది. ఏదైనా పెద్ద శత్రువు గూటిపై దాడి చేసినప్పుడు, ఇవి తమ పొట్టను గట్టిగా బిగబట్టి బాంబులా బద్దలు కొట్టుకుంటాయి! అలా పేలినప్పుడు వాటి శరీరం నుంచి ఒక రకమైన జిగురు, విషపూరితమైన ద్రవం శత్రువులపై పడటంతో అవి ప్రమాదంలో పడటమో, చనిపోవడమో జరుగుతుంది. తన గూటిని, మిగతా చీమలను కాపాడటానికి ఇవి తమ ప్రాణాలనే త్యాగం చేస్తాయి. ఈ వింత చీమలు ఎక్కువగా ఆసియా ఖండంలోని దట్టమైన అడవులలో చెట్ల పైభాగాన జీవిస్తాయి. -
లిటిల్ రైటర్స్
కథలు వినే వయసులోనే.. ప్రపంచం చదువుకునేలా కథలు రాస్తున్నారు ఈ చిచ్చర పిడుగులు. కలాన్ని కూడా సరిగ్గా చేత్తో పట్టడం రాని ఈ చిన్నారులు తమ ఊహాశక్తితో, అద్భుతమైన ఆలోచనలతో కవితలు, కథలు సృష్టిస్తున్నారు. తమ రాతలతో ఏడేళ్లకే ఒకరు ప్రపంచ రికార్డు సృష్టిస్తే, మూడేళ్ల వయసులోనే మరొకరు గ్లోబల్ పబ్లిషింగ్ హౌస్‌లను సైతం ఆశ్చర్యపరిచారు. తమ అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.అభిజిత గుప్తాఉత్తర ప్రదేశ్‌కు చెందిన చిన్నారి రచయిత అభిజిత గుప్తా ఏడేళ్లకే ప్రపంచ రికార్డు సృష్టించింది. అత్యంత పిన్న వయస్కురాలైన కవయిత్రిగా, కథల రచయిత్రిగా ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం సంపాదించుకుంది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ‘గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్’ బిరుదును కూడా అందుకుంది. అభిజిత రాసిన మొదటి పుస్తకం ‘హ్యాపీనెస్ ఆల్ అరౌండ్’. కథలు, కవితల సమాహారమైన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. అభిజిత ప్రముఖ రాష్ట్రకవులైన మైథిలీశరణ్ గుప్తా, సియారాంశరణ్ గుప్తా కుటుంబం నుంచి వచ్చిన చిన్నారి. వియ్ విల్ స్యూర్లీ సస్టేయిన్, టు బిగిన్ విత్ ద లిటిల్ థింగ్స్ వంటి పుస్తకాలు కూడా ఈ చిన్నారి కలం నుంచి జాలువారినవే.క్రిసీస్ నైట్ప్రతిభావంతురాలైన బాల రచయిత్రి, ఇలస్ట్రేటర్ (పుస్తకాలకు బొమ్మలు వేయడం) క్రిసీస్ నైట్. ఈ చిన్నారి కేవలం మూడేండ్ల వయసులో ఉన్నçప్పుడే తన తొలి పుస్తకమైన ‘ది గ్రేట్ బిగ్ లయన్’ను స్వయంగా ప్రచురించి.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన రచయిత్రిగా గుర్తింపు పొందింది. మొదట సింగపూర్‌లో చిన్నగా ప్రచురితమైన ఈ పుస్తకాన్ని.. తరువాత అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రచురించింది. సింగపూర్‌లో జన్మించిన క్రిసీస్కి భారతదేశంతో మంచి అనుబంధం ఉంది. ఆమె పుస్తకం ఇండియాలో పెద్ద ఎత్తున విడుదలయ్యింది. క్రిసీస్ బాల మేధావి. మొదటి ఏడాదిలోనే చదవడం నేర్చుకుంది. ఆమెకున్న అసాధారణ భాషా నైపుణ్యాలను గుర్తించి, అతి చిన్న వయసులోనే ప్రతిష్టాత్మక మెన్సా ఇంటర్నేషనల్ సొసైటీలో ఆమెకు సభ్యత్వం లభించింది. అంతేకాకుండా ఆమె రాసిన ‘ది గ్రేట్ బిగ్ లయన్’ కథకు సింహం బొమ్మలను, ఇతర చిత్రాలను కూడా ఆమే స్వయంగా గీసింది. క్రిసీస్ నైట్ కేవలం ఈ ఒక్క పుస్తకానికే పరిమితం కాలేదు. పిల్లల్లో ధైర్యాన్ని నింపేందుకు ‘క్యాప్చరింగ్ థండర్’ అనే మరొక పుస్తకాన్ని కూడా రాసింది. క్రిసీస్ మొదటి పుస్తకం ‘ది గ్రేట్ బిగ్ లయన్’ విడుదలైన తర్వాత సింగపూర్, దుబాయ్, కెనడాతో పాటు భారతదేశంలో కూడా అనేక వర్చువల్ ఈవెంట్స్, బుక్ లాంచ్‌ల ద్వారా లక్షలాది మంది పిల్లలకు ఈ చిన్నారి స్ఫూర్తిగా నిలిచింది.అయాన్ కపాడియాసాధారణంగా చిన్న పిల్లలు జంతువుల కథలు రాస్తారు. కానీ ముంబైకి చెందిన అయాన్ కపాడియా మాత్రం కేవలం 10 సంవత్సరాల వయసులోనే సైన్స్ ఫిక్షన్ నవలను రాసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయాన్ రాసిన ‘మేవరిక్స్ మార్వలస్ అడ్వెంచర్’ సిరీస్ సైన్స్ ప్రియులను సైతం ఆలోచింపజేసేలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం, కథలు అల్లడం అభిరుచిగా ఉన్న ఈ బుడతడు తన 9వ ఏటనే మొదటి సిరీస్ అయినటువంటి మావెరిక్స్ మార్వలస్ అడ్వెంచర్‌ను కేవలం మూడురోజుల్లోనే పూర్తి చేశాడు. ఇందుకు గాను అయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి భారతదేశ బాలరచయిత అనే ప్రతిష్టాత్మక టైటిల్‌ను కూడా అందుకున్నాడు. తన పుస్తకాల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని అనా«థాశ్రమానికి విరాళంగా ఇచ్చాడు అయాన్. హ్యారీ పోటర్, పర్సీ జాక్సన్, రోనాల్డ్ డాల్ వంటి ఎన్నో పుస్తకాలను ఇప్పటికే చదివేశాడు ఈ బాల మేధావి.అభిరామ్ సాయి చిమ్మిలితెలంగాణకు చెందిన అభిరామ్ సాయి చిమ్మిలి రాసిన ద క్లాక్ ఆఫ్ కాన్సీక్వెన్స్ అనే పుస్తకం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. భారతీయ బాల రచయితలను ్రపోత్సహించే ప్రతిష్టాత్మక ‘నేషనల్ యంగ్ ఆథర్స్ ఫెయిర్’ లో అభిరామ్ నెంబర్ వన్ జ్యూరీ అవార్డు విజేతగా నిలిచి సరికొత్త రికార్డు çసృష్టించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక రచన ప్లాట్ఫారం అయిన ‘బ్రిబుక్స్’, ‘ఎడ్యుకేషన్ వరల్డ్’ సంయుక్తంగా న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. పర్యావరణ మార్పులు, వాటి వల్ల భవిష్యత్తులో రాబోయే పరిణామాలు, తీసుకోవాల్సిన తక్షణ చర్యల నేపథ్యంలో రాసిన ఈ పుస్తకంలో.. 2095వ సంవత్సరంలో పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను కళ్లకు కట్టినట్లు వివరించాడు. ఎంతో పరిణతితో కూడిన కథాంశం, అద్భుతమైన శైలితో రాసిన ఈ పుస్తకం జాతీయ స్థాయి జ్యూరీ ΄్యానెల్ను ఎంతగానో ఆకట్టుకుంది. అభిరామ్ సాయి చిమ్మిలి కేవలం రచనలకే పరిమితం కాకుండా స్పెల్ బి పోటీలలో రెండుసార్లు అంతర్జాతీయ స్థాయి వరకు పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం అభిరామ్‌కు ఇష్టమైన వ్యాపకాలు.మిరాయా వీర్ముంబైకి చెందిన మిరాయా వీర్ పర్యావరణ స్పృహæకలిగిన బాల రచయిత్రి. ఐదు సంవత్సరాల వయసులోనే రాయడం ప్రారంభించింది మిరాయ. తన తొమ్మిదేళ్ల వయసులో రాసిన తొలి పుస్తకం హలో అంటార్కిటికా. వాతావరణ మార్పుల నేపథ్యంలో మానవులు, జంతువులు, ప్రకృతి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని ఇందులో ఎంతో చక్కగా వివరించింది. ఆమె రాసిన రెండో పుస్తకం ది డౌన్ అండర్. కౌమారదశలో ఉన్న పిల్లలకు, వృద్ధులకు మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని ఆవిష్కరిస్తుంది ఈ పుస్తకం. అలాంగ్ ది నైల్: ఆన్ ఈజిప్షియన్ చేజ్ అనేది మిరాయా రాసిన మూడవ పుస్తకం. హిస్టారికల్ ఫాంటసీ, ట్రావెలాగ్, మిస్టరీ కలబోతగా సాగే పుస్తకం ఇది. ఈ కథలో ఐరా, అయాన్ పాత్రలు నైలు నది చారిత్రక ప్రాముఖ్యతను కళ్లకు కడతాయి. -
స్విగ్గీ టైమ్‌లో... పిగ్గీ బ్యాంక్!
‘డబ్బు చెట్లకు కాయదు నాన్నా’ ఈ డైలాగ్ ప్రతి మిడిల్ క్లాస్ నాన్న నోట్లోంచి వచ్చేదే. కానీ ఆ మాట పిల్లల బుర్రకి ఎక్కాలంటే చేతికి చిల్లర ఇవ్వాలి. ఇవాళ 10 రూపాయలు దాచడం నేర్చుకుంటే... రేపు 10 లక్షలు దాచడం తెలుసుకుంటారు. పొదుపు అనేది లెక్కల పాఠం కాదు, జీవిత పాఠం. స్కూల్లో టీచర్ చెప్పరు, మనమే చెప్పాలి. మరి ఐదేళ్ల పిల్లాడి నుంచి 15 ఏళ్ల టీనేజర్ వరకు పొదుపు ఎలా నేర్పాలి? ఇదిగో పాఠాలు. ఈ సెలవుల్లో కాసుల క్లాసు తీసుకోండి.పిగ్గీ బ్యాంక్ లాభంనాలుగైదేళ్లు వచ్చే సరికి పిల్లలకు డబ్బులు తెలుస్తాయి. అర్థమవుతాయి. వారికి డబ్బును దాచడం అప్పటి నుంచే నేర్పవచ్చు. ఎలా? ఒక హుండీ కొనివ్వండి. ‘ఇది నీ బ్యాంక్రా కన్నా’ అని చెప్పండి. రోజూ బయటికి వెళ్లొచ్చినప్పుడు రూపాయి, రెండు రూపాయల కాయిన్స్ చేతికిచ్చి డబ్బాలో వేయించండి. నెల తర్వాత డబ్బా ఓపెన్ చేసి వాడి ముందే లెక్క పెట్టండి. ఆ డబ్బుతో నచ్చిన చిన్న బొమ్మ కొనిపెట్టండి. ‘నువ్వు దాచుకుంటే నీకు కావాల్సింది కొనుక్కోగలవు’ అనే నమ్మకం వాడి బుర్రలో పడాలి. ఆటలో నేర్పిన పాఠం ఆఖరు వరకూ గుర్తుంటుంది.మూడు హుండీల విధానంఏడు నుంచి పదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ విధానం చెప్పాలి. వాళ్లకు మూడు హుండీలు ఇవ్వాలి. 1. దాచుకునేది.. భవిష్యత్తు కోసం. 2.ఖర్చుపెట్టేది... చాక్లెట్, బొమ్మల కోసం. 3. దానం చేసేది.. పేదవాళ్లకు ఇవ్వడానికి. పిల్లలకు వారానికి యాభై రూపాయలు పాకెట్ మనీ ఇస్తే, ‘20 రూపాయలు దాచు, 20 రూపాయలు ఖర్చుపెట్టు, 10 రూపాయలు దానం చెయ్’ అని రూల్ పెట్టండి. డబ్బు అంటే కేవలం ఖర్చుపెట్టడం కాదు. దాచుకోవడం, పంచుకోవడం కూడా. మూడు హుండీలు అంటే సంపూర్ణ మనిషి.కోరికలు అవసరాలుమీ ఇంట్లో 11 ఏళ్ల నుంచి 13 ఏళ్ల పిల్లలు ఉంటే వారికి చెప్పాల్సిన పాఠం ఇది. కోరికలు ఏమిటి... అవసరాలు ఏమిటి... ? ఈ పాఠం ఎలా చెప్పాలి? పిల్లలకు ఒక పేపర్ ఇవ్వండి. ‘నీకు కావాల్సినవి రాయి’ అనండి. తర్వాత కూర్చోబెట్టి అడగండి – ‘నువ్వు రాసిన వాటిలో నీ స్కూల్ బ్యాగ్ చిరిగిపోయింది. అది అవసరం. కాని క్రికెట్ బ్యాట్ నీ దగ్గర లేకపోయినా గ్రౌండ్లో వేరే పిల్లల బ్యాట్‌తో ఆడుకుంటున్నావు. ముందు ఏది?’ అని అడగండి. ‘పాకెట్ మనీ సరిగా దాచుకుంటే ముందు అవసరాలకు తర్వాత కోరికలకు ఖర్చు చేయవచ్చు’ అని చెప్పండి. ‘అమ్మ వద్దంది‘ అంటే ఏడ్చే పిల్లాడు ‘నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు’ అని వాడే అంటాడు. అదే పొదుపులో మొదటి గెలుపు.నీ బ్యాంక్ నీ బాధ్యతమీ ఇంట్లో పద్నాలుగేళ్ల నుంచి పదహారేళ్ల వాళ్లు ఉంటే ఈ పాఠం మీ కోసమే. ఈ వయసు పిల్లలకు నెలకు పాకెట్ మనీ 500 రూపాయలు ఇవ్వండి. ‘ఇది నీ నెల బడ్జెట్. సినిమా, ఫ్రెండ్స్‌తో పానీపూరి, నెట్ రీఛార్జ్, స్టేషనరీ అన్నీ ఇందులోనే. నెలాఖరుకి 100 రూపాయలు మిగిల్చి చూపించు’ అని టార్గెట్ పెట్టండి. ఒక చిన్న డైరీ ఇవ్వండి. ఖర్చు రాసుకోమనండి. వాడు రెండుసార్లు డబ్బులు అయిపోయాయని మీ దగ్గరకు వస్తాడు. జాలిపడి ఇవ్వకండి. ‘నెక్స్›్ట మంత్ ΄్లాన్ చేసుకో‘ అని చెప్పండి. అప్పుడే డబ్బు, పొదుపు విలువ తెలుస్తుంది.బడ్జెట్ షురూపదహారు నుంచి పద్దెనిమిదేళ్లకు చేరుకున్నాక పిల్లలకు బ్యాంక్ అకౌంట్ తీయండి. ఏ.టి.ఎం. కార్డ్ ఇప్పించండి. పిల్లల పాకెట్ మనీ నేరుగా అందులో వేయండి. ‘ఆన్ లైన్ లో ఏదైనా కొనాలంటే నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి’ అని రూల్ పెట్టండి. వడ్డీ అంటే ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అని చిన్న చిన్న మాటల్లో చెప్పండి. వాడు దాచిన 5000 రూపాయలకు మీరు 500 రూపాయలు కలిపి ‘వడ్డీ’ అని ఇవ్వండి. రెక్కలు రాకముందే ఎగరడం నేర్పాలి. దాని వల్ల రేపు పిల్లలు కాలేజీకి వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డు మాయలో పడకుండా ఉంటాడు. గుర్తుంచుకోండి. పొదుపు సరిగా నేర్చుకుంటే రేపటి కోటీశ్వరుడు ఇవాళ మీ ఇంట్లోనే ఉన్నాడు. -
ఫైర్‌పై బోర్ కొట్టకుండా!
సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్ఫేమ్’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాక΄ోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్వాల్వ్ అవ్వాలి. పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.ఏ విషయమైనా బోర్ కొట్టకుండా మన సంభాషణ పిల్లలతో సరదాగా ఉండాలి. పెద్దలకు కూడా ఇది ఎక్సర్సైజ్ పాఠమే అవుతుంది. ఉదాహరణకు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’... సినిమాటిక్‌గా ఓ డైలాగ్ చేప్పండి. వెంటనే పిల్లల అటెన్షన్ మీ వైపు తిరుగుతుంది. అమ్మో ‘నిప్పు’ అని భయపెట్టకూడదు. ఆశ్చర్యం, జాగ్రత్త, విజ్ఞానం.. కలిపి ‘నిప్పు’ గురించి తెలుసుకునేలా ఉండాలి.వెలుగు దీపాలు→ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో అందంగా అలంకరించిన కేక్ పైన క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగు ఎలా ఉంటుందో అడగండి. డ్రాయింగ్‌లో చూపమనండి.→ కిచెన్‌లో వంట వండటానికి ఏం వాడతారో అడగండి → దీపం వెలగడానికి ఏం అవసరం, లైటర్ ఎలా వెలుగుతుంది? → ఇంధనపు వేడి వల్ల ఏయే వాహనాలు, ఇంజన్లు నడుస్తాయో గెస్ చేయమనండి → అడవిలో మంటలు వస్తే, షార్ట్ సర్క్యూట్ జరిగితే, అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు ఏయే చోట్ల జరుగుతాయి... వాటినే చిత్రాల్లో చూపమనండి → కొవ్వొత్తి వెలుగుకి గాలి లేక΄ోతే ఏమవుతుంది, వేడికి కొవ్వొత్తి ఎందుకు కరిగి΄ోతుంది, మంట ఎందుకు రెపరెపలాడుతుంది?... మన రోజువారీ పనుల్లో ‘నిప్పు’ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చెప్పమనండి.సేఫ్టీ హీరో రోల్అగ్ని ప్రమాద సమయంలో 101కు కాల్ చేసే వ్యక్తి, ఇంట్లో గ్యాస్ వాడకంలో పొదుపు, వంట చేసేటప్పుడు జాగ్రత్త పడే వాళ్లు, కాలిన గాయాలకు నివారణ ఉపాయాలు సూచించే వ్యక్తి ... వీటిలో ఏవి చేసినా ‘హీరో’నే. ఏయే వస్తువులు నిప్పును పుట్టిస్తాయి. పిల్లలు అగ్గిపెట్టె, వంటగ్యాస్.. మొదలైన ‘నిప్పు’ కు కారణమయ్యే వస్తువులకు దూరంగా ఎందుకు ఉండాలి.. చూపమనాలి.నిప్పు కథలు→ ఆదిమ మనిషి నిప్పు కనుగొన్న విధానం → హనుమంతుడు లంక దహనం కథ → చలి పెట్టినప్పుడు వేడికోసం మంట ఎలా ఉపయోగపడుతుంది → సూర్యుడు వేడిని ఎలా పుట్టిస్తున్నాడు. వేసవిలోనే ఎందుకు అంతగా మండుతుంటాడు → నిప్పుకు ఎన్ని పేర్లు ఉన్నాయి. ఏయే భాషల్లో ఎలాంటి పేర్లు ఉన్నాయి.. ‘నిప్పు’ గురించి చేసే ఈ ప్రయోగం పిల్లలను ఆలోచింపజేస్తుంది. కొత్త విధానాల రూపకల్పన జరుగుతుంది. ఎన్నో విషయాలు ‘నిప్పు’ అనే టాపిక్ ద్వారా తెలియజేయవచ్చు. పిల్లల వయసు, వారు అర్ధం చేసుకుంటున్న విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ప్రోత్సహిస్తే పిల్లలు కూడా ‘నిప్పు’రవ్వల్లా మెరుస్తారు.నిర్వహణ: నిర్మలారెడ్డి -
స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు?
ఫ్రెండ్స్.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్ సిగ్నల్‌లో ఈ రంగు లైట్ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. ఔనా?హార్న్‌బిల్ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి. -
పేరెంట్ మార్క్ స్కాలర్షిప్స్
సంస్థలు ఇచ్చేది మార్కులకు స్కాలర్షిప్. కాని తల్లిదండ్రులు ఇవ్వాల్సింది బతుకుకు స్కాలర్షిప్. ఈ సెలవుల్లో పిల్లలకు నేర్పాల్సిన ఆరు లక్షణాలు: 1. కుతూహలం 2. ఓర్పు 3. సహానుభూతి 4. శ్రమ 5. ఓటమి ఒప్పుకోలు 6. కృతజ్ఞత... రోజుకో గంట. సెలవులు మరో 30 రోజులు. ఎలా నేర్పాలో చదవండి. చివరి రోజు ‘స్కాలర్షిప్ సర్టిఫికెట్’ ఇచ్చి వాళ్లు కోరిన సబబైన కానుక ఇవ్వండి. అదే అసలైన వేసవి ఫలితం. వేసవి సెలవులు ఇంకో 30 రోజులున్నాయి. ఆటలూ పాటలూ సరే. వాటితోపాటు కొన్ని వ్యకిత్వ గుణాల్లో కూడా తర్ఫీదు ఇవ్వాలి. మార్కుల కోసం హితవు చెప్పినట్టే ఈ లక్షణాల పెంపు కోసం కూడా హితవు చెప్పాలి. అందుకు స్కాలర్షిప్లు ప్రకటించండి. పిల్లల్లో ఆరు ఉత్తమ లక్షణాలను నాటి, పెంచి, సెలవులు అయిపోయే రోజు ‘స్కాలర్షిప్’ పేరుతో వాళ్లు అడిగిన సబబైన కానుక ఇవ్వండి. ఆ కానుక అందుకునే సమయానికి పిల్లలు ‘మనిషి’గా తయారై ఉంటారు. అదీ సంతోషం. ఇంతకీ ఆ ఆరు లక్షణాలు ఏంటి? 1. కుతూహలం: ప్రశ్నించే గుణం లేకపోతే నేర్చుకునేది ఏదీ ఉండదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా? అని అడిగే ధైర్యం నీలో ఉండాలి’ అని చెప్పాలి. ఇలా నేర్పాలి: రోజూ ‘ఈ రోజు నువ్వు అడిగే మూడు ప్రశ్నలు’ అని ఒక పేపర్ ఇవ్వండి. అందులో ప్రశ్నలు మీరే రాయండి. సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు? ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఇలా. జవాబు తెలుసుకోమనండి. ‘జవాబు నాక్కూడా తెలీదు, కలిసి వెతుకుదాం పద’ అనండి. నెట్లో కాదు. లైబ్రరీకి తీసుకెళ్లండి. ప్రశ్న లేకపోతే జీవితమే ప్రశ్నార్థకవుతుందని తెలియచేయండి.2. ఓర్పు: రీల్స్, షార్ట్స్ యుగంలో పిల్లలకు పది సెకన్ల కన్నా ఎక్కువ వేచి చూసే ఓపిక ఉండటం లేదు. ఓర్పు లేని వాడు చదువులో, ఉద్యోగంలో, జీవితంలో సమస్యలు ఎదుర్కొంటాడు. అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి అనే భావన సరికాదని తెలియచేయండి.ఇలా నేర్పాలి: ఒక మొక్క నాటించండి. రోజూ నీళ్లు పోయమనండి. ‘రేపటికి రేపు పండ్లు రావు. దానికి కొంత సమయం పడుతుంది’ అని చెప్పండి. ఓపిగ్గా చేయాల్సిన పజిల్స్, చెస్‌లో ఉంచండి. వంట చేయడం నేర్పండి. ‘సేమ్యా పాయసం ఉడకడానికి 20 నిమిషాలు ఆగాలి’ అని రుచి చూపించండి. ఈలోపు అతడు ఏడ్చినా, గొడవ చేసినా వెంటనే ఫోన్ ఇవ్వకండి. ‘ఐదు నిమిషాలు ఆగితే ఇస్తా’ అనండి. ఓర్పుకు రివార్డ్ ఇవ్వండి. 3. సహానుభూతి: ‘సాటివాడికి నొప్పి అయితే నాకూ నొప్పే’ అనే భావన కలిగించాలి. క్లాస్‌లో 95 శాతం మార్కులు తెచ్చుకుని అన్ని మార్కులు రాని వారితో కలవకపోతే, వారిని సహానుభూతితో చూడకపోతే ఒంటరిగా మిగలక తప్పదని చెప్పండి. రేపు ఉద్యోగమైనా అంతే అని చెప్పండి. ప్రపంచాన్ని నడిపేది ఐక్యూ కాదని; ఈ.క్యూ (ఎమోషనల్ కోషియెంట్) అని చెప్పండి.ఇలా నేర్పాలి: పనిమనిషి, పాలవాడు, చెత్త ఎత్తే అన్నతో మాట్లాడించండి. ‘వాళ్ల పిల్లలు ఏం చదువుతున్నారు?’ అని అడగమనండి. వీధికుక్కకు, పక్షులకు నీళ్లు పెట్టమనండి. ‘దానికి దాహం అవుతుంది’ అని చెప్పండి. టీవీలో యుద్ధం వార్త వస్తే ‘అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లలేరు కదా’ అని చర్చ పెట్టండి.4. శ్రమ: ‘నా పని నేను చేసుకుంటా’ అనే దర్జా కలిగి ఉండటమే జీవితం అని నేర్పండి. ఫోన్లో మీటలు నొక్కుతూ ఏ.సి. రూమ్‌లో కూర్చుని ఆర్డర్ వేస్తే అన్నీ ముంగిటకొస్తాయనుకునే తరం తయారవుతోంది. ఇలాంటి వారు డేటా అయిపోయినా, కరెంట్ లేకపోయినా, స్విగ్గీబాయ్ రాకపోయినా మిడిగుడ్లేస్తారు. ఇలా నేర్పాలి: వాళ్ల పక్క వాళ్లతోనే సర్దించండి. ప్లేట్ కడిగించండి. వారానికి ఒకరోజు ‘నో స్విగ్గీ డే’. కలిసి అన్నం వండండి, చపాతీలు చేయించండి. తల్లి, తండ్రి ఎంత శ్రమ చేస్తారో ఆఫీస్, షాప్, పొలం చూపించండి. ‘ఇంట్లో ఫ్యాన్ తిరగడానికి బయట నాన్న ఎంత చెమటోడుస్తున్నాడో’ చూపించండి.5. ఒప్పుకునే గుణం ‘ఓడిపోయా. తప్పు నాదే. నెక్ట్స్ ట్రై చేస్తా’ అనిపించే తత్త్వం పిల్లల్లో ముఖ్యం. 99 మార్కులు వచ్చి ఒక మార్కుతో ఫస్ట్ ర్యాంక్ పోతే కుంగిపోయే పిల్లలున్నారు. ఆటల్లో ఓడిపోతే బ్యాట్ విరగ్గొడుతున్నారు. జీవితం ర్యాంకుల గేమ్ కాదు పడి లేచే గేమ్ అని వారికి తర్ఫీదు ఇవ్వండి.ఇలా నేర్పాలి: వాళ్లతో కలిసి క్యారమ్స్, చెస్ ఆడండి. కావాలని ఓడించండి. ‘ఓటమి కొత్త గేమ్‌కి టికెట్’ అని చెప్పండి. మీరు కూడా చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల ఓడిపోయిన ఉదంతాలు చెప్పండి. ‘నాన్న కూడా ఒకసారి ఫెయిల్ అయ్యాడు’ అనండి. ‘ట్రై’ అనే మాటకు చాలా బలం ఉందని చెప్పండి. ఓడినా గెలిచినవారి కథలు వినిపించండి.6. కృతజ్ఞత: ‘ఇది నాకు ఊరికే రాలేదు’ అని గుర్తించే పిల్లలూ, గుర్తుంచుకునే పిల్లలే ముందుకు వెళతారు. అన్నీ ఉన్నా ‘ఇంకా ఏం లేదు’ అని ఏడ్చే పిల్లలు ఉంటున్నారు. ఉన్నదానితో సంతృప్తి పడటం లేదు. కృతజ్ఞత లేని వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండడని చెప్పాలి.ఇలా నేర్పాలి: రాత్రి పడుకునే ముందు ‘ఈ రోజు నీకు నచ్చిన మూడు మంచి విషయాలు’ చెప్పమనండి. అన్నం తిన్నాను, సినిమాకు వెళ్లాను, ఫ్రెండ్ బ్యాట్‌తో ఆడుకున్నాను – ఇలా ఏదైనా. అన్నం వండిన అమ్మకు, సినిమా కు డబ్బు ఇచ్చిన నాన్నకు, బ్యాట్ ఇచ్చిన ఫ్రెండ్‌కు మనసులో థ్యాంక్స్ చెప్పుకోమనండి. ‘థ్యాంక్యూ కార్డ్’ చేయించండి. ‘గ్లాస్ నీళ్లు ఇచ్చినందుకు థ్యాంక్స్‌రా’ అనండి. పిల్లలూ నేర్చుకుంటారు. ముగింపు – స్కాలర్షిప్ డేసెలవులు అయిపోయే రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్. ‘నెల రోజుల స్కాలర్షిప్ ప్రోగ్రాం కంప్లీటెడ్’ అని సర్టిఫికెట్ మీ చేత్తో రాసి ఇవ్వండి. ‘నువ్వు స్కాలర్షిప్ గెలిచావ్. నీకు ఈ టెలిస్కోప్’ అని ఇవ్వండి. ఆ కానుక విలువ 500 కావచ్చు, 5000 కావచ్చు. ఎన్ని లక్షణాల్లో బాగా తర్ఫీదు అయ్యారో ఆ ప్రతి లక్షణానికి ఒక సర్టిఫికెట్, బహుమతి ఇవ్వండి. ఇవి జీవితాంతం గుర్తుంటాయి. ఆ లక్షణాలను కాపాడుకునేలా చేసి జీవితాంతం నడిపిస్తాయి. -
ప్రపంచం మెచ్చిన బ్రేక్‌ఫాస్ట్!
చిన్నారులూ! ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినే కార్న్‌ఫ్లేక్స్ అంటే మీకు ఎంతో ఇష్టం కదూ.. రుచిగా, కరకరలాడుతూ ఉండే వీటి తయారీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది తెలుసా.. ఇది చదివేయండి. మీకే తెలుస్తుంది. ఆ కథేంటో...చాలా కాలం క్రితం అంటే సుమారు 130 సంవత్సరాల క్రితం, అమెరికాలో జాన్ కెల్లాగ్, విల్ కెల్లాగ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ ఒక హాస్పిటల్లో పనిచేస్తూ, అక్కడి రోగుల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుండేవారు. అలా ఒకరోజు వారు రోగుల కోసం గోధుమలతో ఒక వంటకం చేయాలనుకున్నారు. అందుకోసం గోధుమలను ఉడకబెట్టారు. కానీ, వేరే ఏదో పనిలో పడి ఆ ఉడకబెట్టిన గోధుమలను అలాగే వదిలేసి మర్చిపోయారు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి, ఆ గోధుమలు కాస్తా ఎండిపోయి, గట్టిగా మారిపోయాయి. అలా ఎండిపోయిన వాటిని వృథా చేయడం ఇష్టం లేక.. రోలర్ మిషన్ల ద్వారా నొక్కిచూశారు. అప్పుడు అవి ఫ్లేక్స్లా విడిపోయాయి. వాటిని కాస్త వేడి చేయగా, అవి చాలా క్రిస్పీగా మారాయి. అలా తయారైన వాటిని హాస్పిటల్‌లోని రోగులకు ఇస్తే, వారు చాలా ఇష్టంగా తిన్నారు. ఆ తర్వాత, తమ్ముడు విల్ కెల్లాగ్కు గోధుమలకు బదులుగా అదేవిధంగా మొక్కజొన్నలతో తయారు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. అలా చేసినప్పుడు అవి మరింత రుచిగా, కరకరలాడుతూ వచ్చాయి. అలా తయారైనవే ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే కార్న్ ఫ్లేక్స్. -
నీటి విలువ నేర్పుదాం!
సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్ఫేమ్’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..→ ‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాకపోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్వాల్వ్ అవ్వాలి. → పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.→ పంచ భూతాలలో నీరు ప్రాణాధారమైనదనే విషయం పెద్దలుగా మనకు తెలుసు. ఈ విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పాలి..?! తల్లిదండ్రులు లేదా టీచర్లు పిల్లల వయసును బట్టి 5 విభాగాలుగా తీసుకోవాలి.→ నర్సరీ, ప్రీ ప్రైమరీ నుంచి 2 వ తరగతి వరకు, 3–5 తరగతులు, 6–7 తరగతుల వారీగా తీసుకొని, విజువల్ ఆర్ట్ ద్వారా చూపించమనాలి. ఇలా చెప్పి చూడండి... నీటిచుక్క పరిమాణం, నీళ్లు వివిధ పాత్రలలో పోస్తే వచ్చే మార్పు.. ను డ్రాయింగ్ ద్వారా చూపమనవచ్చు.నీటి మాట→ నీటి ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. పంటలు పండుతాయి. ఇలాగే ఇంకేం లభిస్తాయి? పిల్లలనే అడగండి. → నీటి వనరులు లేని చోట వాతావరణం ఉండే విధానం, పరిష్కారం కూడా సూచించమనాలి.→ నీటి శుభ్రత గురించి ఏమేం చేయవచ్చో వారినే ఆలోచించి, ప్రెజెంట్ చేయమనాలి.→ వాటర్ వర్డ్స్ .. నీటికి సంబంధించిన పదాలతో క్రాస్ పజిల్స్, డూడుల్స్, సాంగ్స్... కళాత్మకమైన సందేశాన్ని ఇవ్వమని చెప్పవచ్చు. → రోజువారీ జీవన విధానంలో నీటి ప్రాముఖ్యత గురించి పిల్లలను చెప్పమని ప్రోత్సహిస్తూ, వారిచేత వివిధ రకాల యాక్టివిటీస్‌ను చేయించవచ్చు. ఆరోగ్యకరమైన పోటీని కూడా పిల్లల మధ్య పెట్టవచ్చు. పిల్లలు నీటి గురించి చేసే ఎన్నో విన్యాసాలకు వాళ్లే కాదు, పెద్దలూ నవ్వుతారు. తమ గురించి స్వచ్ఛమైన మనసులు పడే తపనను చూసి నీటి చుక్కలు కూడా అందంగా నవ్వుతాయి.ఇలా చెబుదాం...→ దాహం వేసినప్పుడు ఏం తాగుతాం. → నీళ్లను ట్రేలో పోసి, ఫ్రిజ్‌లో పెడితే ఐస్‌క్యూబ్స్‌గా ఎలా అవుతాయి. బయటకు తీస్తే ఐస్ క్యూబ్ కరిగిపోయి తిరిగి నీళ్లుగా ఎలా మారుతాయి. → హిమాలయాలు ఎందుకు అంతగా చల్లగా ఉంటాయి, అవి కరగడం వల్లనే నీళ్లు మన దాకా వస్తున్నాయా?→ కూరగాయలు, పండ్లు ఎలా వస్తాయి? → నీళ్లతో స్నానం చేస్తే మైండ్, బాడీ కూల్ అండ్ ఫ్రెష్ ఎందుకు అవుతుంది.→ వేసవిలో చెరువు నీళ్లలోకి దిగి ఈత కొట్టాలనిపిస్తుంది కదా, అలా దిగినప్పుడు ఆ నీళ్లు చల్లగా ఎందుకు ఉంటాయి. → చెరువులు, కుంటలు, నదులు, బ్యాక్ వాటర్, సముద్రం... భూమి మీద నీరు ఎక్కడెక్కడ ఉంటుంది, భూమిలోపలకు నీళ్లు ఎలా చేరుతాయి, మనం ఎన్ని విధాలుగా నీళ్లను వాడుకుంటున్నాం. చెట్లు నీళ్లు ఎలా తాగుతాయి.. ఇవన్నీ పిల్లలనే అడగాలి. ఇలా నీటికి సంబంధించిన ప్రతీ ఉపయోగం.. కథ, నాటకం, డ్రాయింగ్, ప్రయోగ రూపం... ఏదైనా పిల్లల నుంచే వచ్చినదై ఉండాలి.పొదుపు ఇలా...తాగు నీళ్ల కోసం కుళాయిల వద్ద, వేసవిలో ట్యాంకర్ల వద్ద జరిగే నీటి యుద్ధాల గురించి మనకు పరిచయమే. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పలేం. భవిష్యత్తులో నీటియుద్ధాలు రాకుండా ఉండాలంటే నీటి పొదుపు గురించి వారి ఆలోచనల ద్వారానే చెప్పించవచ్చు.→ షవర్‌తో కాకుండా బకెట్ నీళ్లతో స్నానం చేయమనాలి. పూర్తి బకెట్ నీళ్లు కాకుండా అందులో నుంచి మరికొన్ని తగ్గించి వాడమనాలి ∙బట్టలు ఉతికిన నీళ్లను తిరిగి ఏ విధంగా ఉపయోగించవచ్చో చెప్పమనాలి.→ నీళ్లు తిరిగి భూమిలోకి ఎలా ఇంకుతాయో చూపమనాలి. ఈ విధానం వల్ల నీటి పిల్లల్లో నీటి వృధాను తగ్గించవచ్చు అనే ఆలోచన వస్తుంది.నిర్వహణ: నిర్మలారెడ్డి -
బొమ్మల ప్రపంచంలోకి...
ఫ్రెండ్స్, గ్రేట్ పెయింటర్ పికాసో గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆయన మీ గురించి ఏమన్నారో తెలుసా? ‘పిల్లలందరూ చిత్రకారులే!’ అని. మీకు తెలియకుండానే మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారన్నమాట. ఆ ఆర్టిస్ట్‌ను ఈ సెలవుల్లో బయటికి తీసుకువస్తే భలే ఉంటుంది కదూ! మీకో విషయం చెప్పాలి... ‘ఎప్పుడూ కార్టూన్ సీరియల్స్ చూసే బదులు బొమ్మలు వేయడం నేర్చుకోవచ్చు కదా!’ అని మొన్న ఒక అబ్బాయితో వాళ్ల నాన్నగారు అంటే... ‘ఎందుకు టైమ్‌వేస్ట్... ఇలా ప్రాంప్ట్ ఇస్తే అలా బొమ్మలు వచ్చే యాప్స్ చాలా ఉన్నాయి’ అన్నాడట ఆ పిడుగు! మీకు కూడా ‘నిజమే కదా!’ అనిపిస్తుంది. ఇలా ప్రాంప్ట్ ఇవ్వగానే, అలా బొమ్మలు రావడం బానే ఉంటుంది. అయితే మనమే స్వయంగా బొమ్మలు గీయడం వల్ల, బొమ్మలు వేయడం నేర్చుకోవడం వల్ల బో...లెడు ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే...→ కంటితో చూస్తున్నదానికి అనుగుణంగా చేతి కదలికలు (హ్యాండ్ మూమెంట్స్) చేయడానికి మీలాంటి పిల్లలు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. చిత్రకళ ఆ సమస్య లేకుండా చేస్తుంది.→ గీతల లోపల రంగులు వేయడం ద్వారా చేతి–కంటి సమన్వయం(హ్యాండ్–ఐ కోఆర్డినేషన్) మెరుగుపడుతుంది.→ హ్యాండ్–ఫింగర్ స్ట్రెంగ్త్ మెరుగుపడుతుంది.→ స్పాంజ్ ఆర్ట్. వేలితో రంగులు వేయడం, టెక్స్చర్డ్ పేపర్‌ను ఉపయోగించడం ద్వారా స్పర్శజ్ఞానం (టాక్టయిల్ పెర్సెప్షన్) పెరుగుతుంది.→ రకరకాల సైజుల బ్రష్‌లను ఉపయోగించడం వల్ల గ్రిప్ అండ్ కంట్రోల్ పెరుగుతుంది.→ రాయడానికి, పట్టుకోవడానికి, కత్తిరించడానికి... తదితర పనులకు రిస్ట్ స్టెబిలిటీ కావాలి. అడ్డంగా, నిలువుగా బ్రష్‌తో గీతలు గీయడం ప్రాక్టిస్ చేయడం వల్ల రిస్ట్ మజిల్స్ స్ట్రెంతెన్ అవుతాయి.→ చిత్రలేఖనం ఏకాగ్రతను పెంచుతుంది.→ బొమ్మలు గీయడం అనేది కొత్తగా ఆలోచించడాన్ని నేర్పుతుంది. మీరు ఎంపిక చేసుకున్న కలర్స్, బ్రష్ స్ట్రోక్స్, కొల్లాజ్ పీస్ మీలో క్రియేటివిటీని, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తాయి.→ చిత్రకళ మీ దినచర్యలో భాగం అయ్యేలా చూసుకోండి. మీ ఫీలింగ్స్‌ను వ్యక్తీకరించడానికి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు ఆర్ట్ సాధనంగా ఉపయోగపడుతుంది.→ మీలో ఊహశక్తి (ఇమాజినేషన్) విస్తరించడానికి చిత్రకళ ఉపయోగపడుతుంది.ఆల్ఫాబెట్స్‌తో అలవోకగా బొమ్మలే బొమ్మల్!ఆల్ఫాబెట్స్, అంకెలతో స్పీడ్ స్పీడ్‌గా బొమ్మలు గీయడం భలే సరదాగా ఉంటుంది. ‘ఏబిసిడి డ్రాయింగ్’ ‘ఎంటైర్ ఆల్ఫాబెట్ ఏబీíసీ డ్రాయింగ్స్’ ‘హౌ టూ డ్రా విత్ ఆల్ఫాబెట్స్’ ‘ఆల్పాబెట్స్ డ్రాయింగ్స్ ఫర్ కిడ్స్’ ‘ఈజీ డ్రాయింగ్స్ విత్ ఎబిసిడి’ ‘హౌ టు డ్రా ఏ పిక్చర్ ఫ్రమ్ నంబర్ 6’ ‘హౌ టు డ్రా ఎనీథింగ్ ఫ్రమ్ నంబర్స్ ఈజీ’లాంటి వీడియోలు ఎన్నో యూట్యూబ్‌లో ఉన్నాయి.చిన్న వయసులోనే...పెద్ద పేరు!→ అహ్మదాబాద్‌కు చెందిన దుర్వ హిరల్ బ్రహ్మభట్ రెండు సంవత్సరాల ఆరు నెలల వయస్సులోనే కాన్వాస్, కాగితంపై వందకు పైగా చిత్రాలను గీసి రికార్ట్ సృష్టించింది.→ ‘ఆరుషి ఆర్ట్’గా ఫేమస్ అయిన ఆరుషి భట్నాగర్ చిన్న వయసు నుంచి బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. 52 చిత్రాలతో సోలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న ఆరుషి చిత్రకళలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.→ గుజరాత్‌కు చెందిన అవ్యాన్ పటేల్ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో తాను గీసిన 250కి పైగా పెయింటింగ్స్‌తో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన బాలుడిగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.పిల్లలూ... పికాసోఫ్రెండ్స్... పాబ్లో పికాసో చాలా పెద్ద ఆర్టిస్ట్ అనే విషయం మీకు తెలుసుకదా! ‘కళలో స్వచ్ఛత ఉండాలంటే చిత్రకారులలో పసితనం ఉండాలి’ అనేది పికాసో మాట. మీరు (పిల్లలు) అంటే పికాసోకు చాలా ఇష్టం. ఆయన మాటల్లో మీపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. పికాసోకు చిన్నప్పుడు బొమ్మలు గీయడం, పేపర్స్ నుంచి బొమ్మలను కత్తిరించడం అంటే ఇష్టం. క్లాస్‌రూమ్‌లో ఒక మూల కూర్చొని బొమ్మలు వేస్తుండేవాడు! ఎనిమిది సంవత్సరాల వయసులో మొదటి ఆయిల్ పెయింటింగ్ వేశాడు. దీనికి ‘ది లిటిల్ యెల్లో పికాడోర్’ అని పేరు పెట్టాడు. తొమ్మిది సంవత్సరాల వయసులో తనకు ఇష్టమైన పావురాలు, ఎద్దుల పోరాట దృశ్యాలు గీసేవాడు. మనం ఏ రంగంలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నామో...ఆ రంగంలోని పెద్ద వాళ్లపై వచ్చిన పుస్తకాలు లేదా వారు రాసిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. గ్రేట్ ఆర్టిస్ట్ పికాసో గురించి... ఏ లైఫ్ ఆఫ్ పికాసో, పికాసో: ఎ బయోగ్రఫీ, పికాసో క్యూబిజం... మొదలైన పుస్తకాలు ఎన్నో వచ్చాయి.– యాకుబ్ -
స్పెల్లింగ్ బీ బాద్షా... దేవ్ షా
ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న అబ్బాయి పేరు... దేవ్ షా. నేషనల్ స్పెల్లింగ్ బీ చాంపియన్. ‘స్పెలింగ్ బీ’ గురించి దేవ్ షా మాటలు వింటే ఆ పోటీ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ‘నేను కూడా సాధించాలి’ అనే పట్టుదల మీలో పెరుగుతుంది. ‘స్పెల్లింగ్ బీ’ గురించి దేవ్ షా మాటల్లో...నేను సెకండ్ గ్రేడ్ నుంచి స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొంటున్నాను. ఎన్నోసార్లు ఓడిపోయాను. కొన్నిసార్లు పోటీకి అర్హత కూడా సాధించలేకపోయాను. నేను తడబడిన మొదటి పదం వెన్స్డే. స్పెలింగ్ తప్పుగా చెప్పాను. ఈ పోటీల కోసం ప్రిపేర్ కావడం చాలా భారంగా అనిపించేది. దీంతో గూగుల్ షీట్లో నా ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవడం మొదలుపెట్టాను. నేను చదివిన పదాల సంఖ్య, మూల పదాలు, ఎటిమోలజీ టెక్ట్స్ బుక్‌లో నేను చదివిన పేజీలు నమోదు చేసేవాడిని.పెద్దపనులు... చిన్న చిన్న భాగాలుగా...డిక్షనరీలో దాదాపు 5,00,000 పదాలు ఉంటాయి. వాటిలో నాకు చాలా కష్టంగా అనిపించేవి, సులభంగా అనిపించేవి...ఇలా రకరకాలుగా వాటిని గూగుల్ ఎక్సెల్ షీట్లో వర్గీకరించుకున్నాను. పెద్ద పెద్ద పనులను చిన్న చిన్న పార్ట్స్‌గా విభజించడం మొదలుపెట్టాను. ఇలా విభజించాలంటే ఓపిక ఉండాలి. ప్రతిరోజూ ఏడు నుంచి పదిగంటల వరకు మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ చదివేవాడిని. ఇలా చదవడం వల్ల చరిత్ర నుంచి జీవశాస్త్రం వరకు ఎన్నో పదాలు, వాటి మూలాల గురించి తెలుసుకోగలిగాను.గుర్తుంచుకోవడానికి...స్పెల్లింగ్‌లను గుర్తుంచుకోవడానికి బండ గుర్తులు, రైమింగ్ ట్యాక్టిక్స్, రకరకాల మెమొరీ టిప్స్ ఉపయోగించేవాడిని. రోజూ ప్రిపేర్ కావడం ద్వారా నాలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగాయి.నేషనల్ స్పెల్లింగ్ బీలో పదజాలం(వొకాబులరీ) అనేది ముఖ్యమైన భాగం. ఒక పదాన్ని సరిగా యూజ్ చేయకపోతే దాన్ని నేర్చుకోవడంలో అర్థం లేదు. నేను నేర్చుకున్న పదాలను నేను రాసే వ్యాసాలలో ఎక్కడో ఒకచోట వాడుతుంటాను.ఎలాగైనా గెలవాలి అనే ఆరాటం వద్దు!ఎలాగైనా గెలవాలి...అనే ఆరాటం వల్ల ఒత్తిడికి గురవుతాము. ఈ ఒత్తిడి వల్ల మైండ్ పనిచేయదు. నేను ఒకప్పుడు స్పెల్లింగ్ బీ పోటీకి ఎంపిక కానప్పుడు బాగా బాధపడ్డాను. ‘నేను గతంలో కంటే చాలా కష్టపడ్డాను. మరి ఎందుకు ఓడిపోయాను?!’ అని నా డైరీలో రాసుకున్నాను. ఆ తరువాత మాత్రం నాలో మార్పు వచ్చింది. గెలవాలనే ఒత్తిడిని వదిలేసి, దానికి బదులుగా కొత్త కొత్త పదాలను నేర్చుకోవడం ద్వారా ఆనందించడంపై ఎక్కువ దృష్టి పెట్టాను. నేను స్పెలింగ్ చెబుతున్నప్పుడు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన స్థితిలోకి వెళతాను. స్పెల్ బీ ప్రయాణం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందమే చివరికి నన్ను చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకునేలా చేసింది. -
పిల్లల పొలం బడి
మీరెప్పుడైనా పచ్చని పంట పొలాల దగ్గరకి వెళ్లారా? వ్యవసాయం గురించి ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగితే... మీలాంటి పిల్లలలో చాలామంది చెప్పే జవాబు...‘వెళ్లలేదు’... ‘తెలియదు’ పాలు ఎక్కడినుంచి వస్తాయి? ఒక అమ్మాయిని ఎవరో అడిగారట... ‘పాలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని! దానికి ఆ పాప... ‘టెట్రా ప్యాక్‌లో నుంచి వస్తాయి’ అని చెప్పిందట!ఇది విన్న ఆ పాప తండ్రి కిరుబ శంకర్ ఆశ్చర్యపోయారు. కిరుబ శంకర్ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడు ఆయనకు పంటపొలాలు మరో స్కూల్. స్కూల్ అయిపోగానే అక్కడికి పరుగెత్తుకు వెళ్లేవాడు. గొర్రెలతో, మేకలతో ఆడుకునేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలుసు.వెల్కమ్ టు వక్సాన ఫార్మ్స్మరేమో, మీ తరం పిల్లల విషయానికి వస్తే... చాలా మందికి వ్యవసాయం గురించి బొత్తిగా తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శంకర్ అంకుల్ తమిళనాడులోని రెట్టనై గ్రామంలో మీలాంటి పిల్లల కోసం వ్యవసాయ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. పద్నాలుగు ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రం (వక్సాన ఫార్మ్స్)లోకి మీరు అడుగుపెడితే వ్యవసాయం గురించి సమస్త విషయాలు తెలుసుకోవచ్చు. ‘వక్సాన’ అంటే పచ్చదనంతో నిండిన సారవంతమైన భూమి అని అర్థం.ఎంచక్కా... విత్తనాలు నాటవచ్చు, పొలం దున్నవచ్చు...‘వక్సాన ఫార్మ్స్’లో పంటలు, రకరకకాల చెట్లు, జంతువులు, కాలువలు... ఎన్నో ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకోవచ్చు. పొలంలోనే మధ్యాహ్నం భోజనం వడ్డిస్తారు. భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి. ఆ తరువాత జంతుప్రపంచంలోకి తీసుకువెళతారు. అక్కడ గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటె... మొదలైన వాటితో పాటు బాతులు, హంసలు, టర్కీలు ఉంటాయి.‘జంతువులు, వ్యవసాయం వేరు కాదు’ అంటూ వ్యవసాయ ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యం, కష్టం గురించి తెలియజేస్తారు. మీలాంటి పిల్లలకు ఇప్పుడు ఈ ‘ఫార్మ్ క్యాంప్’ ఫెవరెట్ స్పాట్ అయింది. ఈ ‘ఫార్మ్స్ క్యాంప్’లో మీరు ఒక రోజు పూర్తిగా గడపవచ్చు.పొలం దున్నడం, సాగు కోసం భూమిని ఎలా సిద్ధం చేస్తారో తెలుసుకోవడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం, ట్రాక్టర్ సవారీలు... ఇలా ఎన్నో ఉంటాయి. ఈ పనులన్నీ మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎద్దులను ఉపయోగించి చేసే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కూడా మీకు ఇక్కడ పరిచయం చేస్తారు. ఆధునిక వ్యవసాయానికి, ఒకప్పటికి వ్యవసాయానికి తేడా ఏమిటో వివరంగా చెబుతారు. పిల్లలు వాటికి ఆహారం పెడతారు. వాటి ప్రవర్తనను దగ్గరి నుంచి గమనిస్తారు. పొలం పనులకు అవి ఎలా ఉపయోగపడుతాయో ప్రత్యక్షంగా చూస్తారు.రాత్రి ఆరు బయట భోజనం... ఆ తరువాత కథలుసాయంత్రం కావడానికి ముందు పొలానికి దగ్గరలోని చెరువులో పిల్లలు ఈత కొడతారు. పంపు సెట్ల కింద స్నానం చేస్తారు. పొలాల్లో నడుస్తూ, కూరగాయలు కోసి రాత్రి భోజనానికి ఏమి వండాలో చెబుతారు. తల్లిదండ్రులు, అక్కడ ఉన్నవారితో కలిసి వంట చేస్తారు. రాత్రి భోజనాన్ని ఆరుబయట వడ్డిస్తారు. ఆ తరువాత మంట చుట్టూ చేరి కథలు చెప్పుకుంటారు. ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీలాంటి పిల్లలు రైతు జీవితాన్ని గడపవచ్చు. మీరు ఒకరోజు పొలంలో పనిచేయడం వల్ల వ్యవసాయం గురించి మాత్రమే కాదు పర్యావరణం గురించి కూడా తెలుసుకోవచ్చు. బంబరం, తాయంబాస్, కిట్టి పుల్, ఉరియడిలాంటి సంప్రదాయ గ్రామీణ ఆటలను, వ్యాయామాలను పరిచయం చేస్తారు. ‘పిల్లలు భవిష్యత్‌లో తల్లిదండ్రులవుతారు. వారు ఇక్కడ పొందిన అనుభవం వారి భవిష్యత్‌కు బాగా ఉపయోగపడుతుంది’ అంటున్నారు కిరుబ శంకర్.24 గంటలుప్రతి క్యాంపులో పదిమంది పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఫార్మ్క్యాంప్లో ఏప్రిల్, మే నెలలో క్యాంప్‌లు నిర్వహిస్తారు. మేలో జరిగేవి... 9–10 మే, 16–17 మే, 30–31 మే. కార్యక్రమాలు శనివారం ఉదయం పదిగంటల నుండి ఆదివారం ఉదయం పది గంటల వరకు జరుగుతాయి.vaksanafarms.in/special/summer-camp/– యాకూబ్ -
వేసవి సంజీవని సబ్జా
ఈ సీజన్లో వేడి చేసిందని అంటే ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు ‘సబ్జా గింజలు నాన బెట్టిన నీళ్లు తాగు’ అని సలహా ఇస్తుంటారు. నిజంగానే సబ్జా గింజలు నానబెట్టిన నీళ్లు, నన్నారి, మజ్జిగ, లస్సీ, ఫలూదా, కొబ్బరి నీళ్లు... ఇవన్నీ ఎంత చలువ చేస్తాయో చూస్తూనే ఉంటాం. కాని సబ్జా గింజలు ఉపయోగించాలని చెప్తే తప్ప గుర్తు చేసుకోము.స్వీట్ బేసిల్సబ్జా గింజలు తులసి జాతికి చెందిన ‘కామన్ బేసిల్’ మొక్క విత్తనాలు. వీటిని ‘స్వీట్ బేసిల్’ లేదా ‘టూక్మరియా’ అని కూడా అంటారు. నల్లగా, నువ్వు గింజలకన్నా చిన్నగా ఉంటాయి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో విరివిగా పండిస్తున్నారు. ఎండని తట్టుకుని పెరిగే పంట కాబట్టే చలువ గుణం జాస్తి. సబ్జా గింజల్లో ‘మ్యుసిలేజ్’ అనే జిగురు పదార్థం ఉంటుంది. నీళ్లలో వేయగానే 30 రెట్లు ఉబ్బి, చుట్టూ జెల్లీ లాంటి పొర ఏర్పడుతుంది. ఈ జెల్లీనే శరీరంలోకి వెళ్లాక అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అందుకే దీన్ని ‘నేచురల్ కూలెంట్’ అంటారు. దీనిలో ఫైబర్, ఐరన్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం.బాడీ హీట్ తగ్గిస్తుందికడుపులో మంట, కళ్లు మండటం, యూరిన్ ఇన్ఫెక్షన్ – అన్నీ శరీరం వేడెక్కడం వల్లే. సబ్జా లోపల్నుంచి చల్లబరుస్తుంది. డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. నీళ్లను పీల్చుకుని జెల్లీగా మారి, ఆ నీటిని కొంచెం కొంచెంగా శరీరానికి అందిస్తుంది. అందుకే ఎండలో తిరిగినా నీరసం రాదు. బయట తిండి, మసాలాలు తిని కడుపు మండుతుంటే గ్లాస్ సబ్జా నీళ్లు తాగితే 10 నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది. షుగర్, బీపీ ఉన్న వాళ్లకు కూడా మంచిది.పిల్లలు, స్త్రీలు,వృద్ధులకు ఎలా వాడాలి?పిల్లలకు అర టీస్పూన్ గింజలు నానబెట్టి ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే కడుపు ఉబ్బరం. రోజ్ మిల్క్, పుచ్చకాయ జ్యూస్‌లో కలిపితే మారు మాట్లాడకుండా తాగేస్తారు. వేసవిలో చెమటకాయలు, మూత్రంలో మంట రాకుండా సబ్జా గింజలు కాపాడతాయి. స్త్రీలకు నెలసరి సమయంలో కడుపులో మంట, వేడి చేస్తుంటే సబ్జా మజ్జిగ చాలా మంచిది. బాలింతలకు పాలు పడతాయి. ఐరన్ ఉండటం వల్ల నీరసం తగ్గుతుంది. (గమనిక: గర్భిణులు మొదటి 3 నెలలు డాక్టర్ని అడిగి వాడాలి) వృద్ధులకు మలబద్ధకం, అసిడిటీ, నిద్రలేమిలకు సబ్జా మంచి మందు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో స్పూన్ నానిన సబ్జా వేసుకుని తాగితే సుఖ నిద్ర పడుతుంది.వడ దెబ్బకుఎండలో బయటికి వెళ్లే అరగంట ముందు ఒక గ్లాస్ నిమ్మ సబ్జా షర్బత్ తాగి వెళ్లండి. సబ్జా శరీరంలో నీటిని నిలుపుతుంది కాబట్టి డీహైడ్రేట్ అవరు. తలకు టోపీ, కడుపులో సబ్జా – ఇక వడదెబ్బ మీ జోలికి రాదు. వడదెబ్బ తగిలితే వాంతులు, విరోచనాలు, తల తిరగడం వస్తుంది. అప్పుడు వెంటనే నీడలోకి చేర్చి, తడి గుడ్డతో ఒళ్లు తుడవాలి. ఒక గ్లాస్ చల్లటి నీళ్లలో 2 స్పూన్ల నానిన సబ్జా + చిటికెడు ఉప్పు + చెంచాడు చక్కెర కలిపి తాగించాలి. ఇది ఓఆర్ఎస్ కంటే ఎక్కువ పని చేస్తుంది. తల మీద, అరికాళ్లకి నానిన సబ్జాని పట్టులా వేస్తే వేడి వెంటనే దిగుతుంది. ఇది మన బామ్మల చిట్కా.ఎలా వాడాలి?ముఖ్య నియమం ఏమిటంటే సబ్జా గింజల్ని ఎప్పుడూ నానబెట్టకుండా తినకూడదు. నేరుగా తింటే కడుపులో వెళ్లి ఉబ్బి నొప్పి వస్తుంది. 1 టీస్పూన్ సబ్జా గింజలకుఒక గ్లాస్ నీళ్లు పోసి 15–20 నిమిషాలు నానబెట్టాలి. నల్ల గింజలు తెల్లటి జెల్లీతో ఉబ్బుతాయి. అప్పుడు వాడుకోవాలి.పెరుగు అన్నంలోఅన్నంలో పెరుగు కలిపాక, 1 స్పూన్ నానబెట్టిన సబ్జా వేసుకుని తింటే కడుపుకి చలువ, రుచికి రుచి. రాగి జావ/అంబలిలోవేసవిలో తాగే రాగి జావలో సబ్జా కలిపితే డబుల్ కూలింగ్. ఫ్రూట్ సలాడ్లోపుచ్చకాయ, ఖర్బూజా ముక్కల మీద సబ్జా చల్లుకుని తింటే పిల్లలు ఇష్టంగా తింటారు.పానీయాలలో ఎలా వాడాలి?నిమ్మ షర్బత్ + సబ్జాఒక గ్లాస్ చల్లటి నీళ్లలో నిమ్మరసం, కొద్దిగా బెల్లం, చిటికెడు ఉప్పు, 2 స్పూన్లు నానిన సబ్జా వేసి తాగితే – ఇదే వేసవి అమృతం. రోజ్ మిల్క్/ ఫలూదాపిల్లలు ఇష్టపడే ఫలూదాలో ప్రధానమైనది సబ్జానే. పాలల్లో రోజ్ సిరప్, సబ్జా, ఐస్ వేసుకుంటే సరిపోతుంది. మజ్జిగ సబ్జామజ్జిగలో కరివేపాకు, కొత్తిమీరతో పాటు సబ్జా వేసి తాగితే వడదెబ్బ దరిచేరదు. కొబ్బరి నీళ్లు సబ్జాకొబ్బరి బోండాం నీళ్లలో సబ్జా వేసుకుంటే ‘నేచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్’ రెడీ.సో... సబ్జాకి జిందాబాద్ అనండి. సూర్యనారాయణ బాబాయ్‌ని ఈ నల్ల గింజలతో శాంతింపచేసుకోండి. -
చిట్టి చేతుల్లో పచ్చని ప్రపంచం
చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, నీరు లేకపోతే జీవం ఉండదు, పక్షులు, జంతువులు ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి... ఇలా ఒక్కో విషయాన్ని పిల్లలకు వివరించి చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టేలానూ చేయాలి. అప్పుడే భవిష్యత్తులో మార్పులు వస్తాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను సరైనచోట వేయడం, నీటిని పొదుపు చేయడం, వస్తువులను రీసైక్లింగ్ విధానంలో వాడటం.. ఇవన్నీ పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు నేర్పించాలంటున్నారు నిపుణులు.గాలి, నీరు, నేల, చెట్లు, జంతుజాలం.. ఇవన్నీ మన జీవనానికి ఆధారం. పిల్లలకు వీటి ప్రాముఖ్యతను తెలియజేయాలి. పర్యావరణానికి సంబంధించి కథలు, పెయింటింగ్, ఆటల ద్వారా అవగాహన తీసుకురావచ్చు. ప్రయోగాత్మకంగా నేర్పాలంటే పిల్లలతో మొక్కలు నాటించడం, వాటికి నీరు పోయించడం, పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సేంద్రీయ ఎరువుల తయారీ.. లాంటి పనులలో భాగస్వాములను చేయడం వల్ల వారికి ప్రకృతిపై ప్రేమను కలుగుతుంది.చిన్న ఆలోచనతో పెద్ద మార్పు...→ ప్రకృతి సహజవనరులు–ప్రతికూల అంశాల గురించి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వవచ్చు. → స్థానిక పార్కుల వద్దకు తీసుకెళ్లి, చుట్టుపక్కల ఉన్న చెత్తను సేకరించడం, రీసైక్లింగ్ పట్ల అవగాహన కలిగించడం, కాలుష్య నివారణలో భాగస్వాములను చేయాలి. → గ్లోబల్ స్థాయిలో పర్యావరణంలో పిల్లలను ఇన్వాల్వ్ చేస్తున్న సంస్థలు, అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలియజేయాలి. → వాహనాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగ, ఎండ వేడిమి పెరగడానికి కారణాల గురించి తెలియజేయాలి.కీడు చేసే రసాయనాలు→ ఇంటి శుభ్రతలో వాడే క్లీనర్లలో ఉండే విషపూరిత రసాయనాలు, వీటి వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం, మూగజీవాల ఆరోగ్యం దెబ్బతినడం వంటి ప్రమాదాల గురించి అవగాహన కలిగించాలి. ఇంటి శుభ్రతలో సేంద్రీయ ఉత్పత్తుల తయారీని పరిచయం చేసి, పర్యావరణ హానిని తగ్గించవచ్చు. → పర్యావరణ అనుకూల వస్తువుల వాడకం వల్ల జంతువులకు, మానవ మనుగడకు ఎంత మేలు చేస్తుందో తెలియజేయవచ్చు. → ఔషధ మొక్కల ఆధారిత పదార్థాల నుండి తయారుచేసిన ఉత్పత్తులు, నీటి వ్యవస్థల గురించి అవగాహన కలిగించాలి. ఇంటా బయట మనవంతుగా కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ స్వచ్ఛత లో భాగస్వాములు అవ్వాలని చెప్పవచ్చు. → ఆన్లైన్ – ఆఫ్‌లైన్ వేదికలుగా జరిగే పర్యావరణ సంబంధిత వర్క్‌షాప్స్, కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్పిల్లలకు బొమ్మలతో ఆడుకోవడం అంటే ఇష్టం. అందుకోసం వారికి ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ తయారీని పరిచయం చేయడం, లేదా కొనుగోలు చేసి వాటి, ఉపయోగాలను వివరించాలి. కొబ్బరిచిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. టెడ్డీబేర్ క్లాత్‌ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా కుట్టి, అందులో కోకోపిట్ నింపి, తల భాగంలో జుట్టు ఎలా అయితే ఉంటుందో, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేయవచ్చు. కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి బొమ్మ చేయవచ్చు. బొమ్మ తల భాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరుగుతాయి. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను తయారు చేయించవచ్చు. ఓల్డ్ క్లాత్స్తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్‌ని పిల్లల చేత చేయించడానికి ఈ సీజన్ చాలా అనుకూలమైనది. పెద్దలు పర్యావరణాన్ని కాపాడేందుకు చేసే ప్రతి పని, పిల్లల్లో ఆలోచనను కలిగిస్తుంది. ప్రకృతి పట్ల బాధ్యతగా నడుచుకునేందుకు తగిన అవగాహన ఏర్పడుతుంది. ప్రకృతికి దగ్గరగా...మన భూమిని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు అనే ఆలోచనతో పిల్లల చేత పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ప్రకృతికి నష్టం కలగకుండా ఎలా జీవించాలి, కమ్యూనిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెరువుల చుట్టూ పేరుకుపోయిన చెత్తను శుభ్రపరచడం, ఎకో–ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీ, వాడకం, ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తుంటాం. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రతీ పనిలోనూ పిల్లల్లో మనోవికాసం వృద్ధి చెందుతుంది. – మేఘనా ముసునూరి, పర్యావరణ వేత్త, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ ఫౌండర్ – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
లిటిల్ డాక్టర్
పిల్లలు రోజులో ఎన్ని నీళ్లు తాగాలి, వ్యాయామం ఎందుకు అవసరం, కూల్ డ్రింక్స్ ఎందుకు తాగకూడదు, రోజులో విశ్రాంతి ఎంత అవసరం, సన్‌స్ట్రోక్ తగిలితే ఏం చేయాలి, చిన్న చిన్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి... ఇలా ఈ వేసవిలో ఆరోగ్య అవగాహన వల్ల పిల్లల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఫన్‌గా, ఉపయుక్తంగా హెల్దీ కిట్‌ను అందిద్దాం..ఎండ వేడికి ఒంట్లోని నీరు ఆవిరైపోతుంటుంది. శరీరం అలసటగా మారిపోతుంటుంది. స్కూల్ లేదని రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా లేవడం సాధారణమే. పెద్దలు కూడా సెలవులే కదా... అని వదిలేస్తుంటారు. అలాగే ఆహారం, శారీరక శ్రమ గురించి అంతగా శ్రద్ధ చూపరు. ఆ నిర్లక్ష్యం మిగతా వాటిపైనా ప్రభావం చూపుతుంది. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ , స్కిన్ ర్యాషెస్, కడుపునొప్పి, తలనొప్పి.. వంటి సమస్యలూ తలెత్తవచ్చు. అవగాహన పాఠాన్ని ఆచరణలో చూపిస్తే మేలైన ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.→ సూపర్ హీరో ఛాలెంజ్→ నీళ్లు తాగడం బోర్ అని పిల్లలు అనకుండా ఉండాలంటే రోజుకు 6–8 గ్లాసుల ‘వాటర్ ఛాలెంజ్’ ఇవ్వచ్చు. ‘నీళ్లు తాగకుంటే శరీరం వేడెక్కుతుంది’ అని చెప్పి, ప్రతి గ్లాస్‌కు ఒక స్టార్, వారం రోజులు పూర్తయితే చిన్న రివార్డ్ ఇచ్చి ప్రోత్సహించవచ్చు. కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, బటర్‌మిల్క్... వంటి సహజ పానీయాల గురించి చెప్పి వాటిని తయారు చేయించవచ్చు. → ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణగా టోపీ, సన్ గ్లాసెస్, సన్‌స్క్రీన్, కాటన్ దుస్తులు, బ్యాగ్, వాటర్ బాటిల్.. ఇలా ఏయే వస్తువులు ఉపయోగించాలో ఒక పజిల్ టాస్క్‌గా ఇవ్వచ్చు. → ఐస్‌క్యూబ్స్ వేసిన పానీయాలు గొంతునొప్పి, జలుబు .. వంటి సమస్యలకు ఎలా కారణం అవుతాయో డిజిటల్ మీడియాలో వచ్చిన వీడియోలను చూపి తెలియజేయవచ్చు. → పొట్ట తేలికగా ఉండేలా పండ్లు, కూరగాయలు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పి, జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలకు ఎందుకు దూరంగా ఉండాలో వివరించవచ్చు. ∙చెమట వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకు రోజూ స్నానం చేయడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని అలవాటు చేయాలి. → ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడు ఆరు బయట ఆటలను ప్రోత్సహించాలి.→ తలనొప్పి, తిమ్మిరి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే పెద్దలకు తెలియజేయడం వల్ల సమస్యకు సత్వర పరిష్కారం ఉంటుందని చెప్పాలి.→ ఆటగా డాక్టర్ గేమ్...పిల్లలకు ఫస్ట్ ఎయిడ్ నేర్పడం అంటే కేవలం గాయాలకు ఎలా చికిత్స చేయాలో చెప్పడం మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా, తెలివిగా స్పందించేలా తయారు చేయడం కూడా. → ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉండాల్సిన వస్తువుల గురించి అవగాహన కల్పిస్తూనే, గాయాలకు ప్రథమ చికిత్స ఎలా చేసుకోవాలో నేర్పించాలి. → ముక్కు నుండి రక్తస్రావం అయితే ఏం చేయాలి, ఏదైనా కారణం చేత పెద్ద గాయం అయినా, వాపు సంభవించినా పెద్దలను లేదా డాక్టర్‌ను సంప్రదించడం గురించి చెప్పాలి.→ అత్యవసర నంబర్లను పిల్లలకు నేర్పాలి. డాక్టర్–పేషంట్ గేమ్‌ను ఆడించవచ్చు. → హెల్త్ అవేర్నెస్ క్యాంపులకు తీసుకెళ్లవచ్చు. చొరవ తీసుకొని తమ కమ్యూనిటీలలో హెల్త్ అవేర్నెస్ వర్క్‌షాప్స్ నిర్వహించవచ్చు. → మార్కెట్లో లభించే డాక్టర్ కిట్ టాయ్, ఆర్గాన్ టాయ్స్తోనూ అవగాహన కలిగించవచ్చు.→ ప్లేటు నిండుగా ఆరోగ్యం..హెల్త్ టాపిక్‌ను ఒక క్లాస్లా చెబితే... దూరంగా వెళ్లిపోతారు. అలా కాకుండా ప్లేట్ మీద చూపించవచ్చు. పుచ్చకాయ ‘ఇది నీళ్లు ఎక్కువగా ఇస్తుంది. కీరా.. ఇది శరీరాన్ని కూల్ చేస్తుంది’ ఇలాంటి ఉదాహరణలు పరిచయం చేయవచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువైతే బాడీ ఏ విధంగా అలసిపోతుందో చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా! వేసవిలో నిద్ర, ఆహారం విషయంలో క్రమశిక్షణ ఉండదు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపైనా చెడు ప్రభావం చూపుతుంది. టీవీ, మొబైల్స్‌ను ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు, మానసిక సమస్యలు ఎలా ఉత్పన్నం అవుతాయో చూపాలి. స్కూల్ టైమ్ పాఠాల మాదిరి ఆరోగ్య సందేశాలను ఇవ్వకూడదు. ప్రతీది ప్రాక్టికల్‌గా చూపుతూ, పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ ఆరోగ్య అవగాహన కలిగించాలి. – డా.పి.జ్యోతిరాజ, లైఫ్ స్కిల్ ట్రైనర్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గరిట పట్టిద్దాం
వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటుంది. చదువులకు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం. కుకింగ్, మనీ మేనేజ్మెంట్, క్రియేటివ్ ఆర్ట్స్, రీ సైక్లింగ్, ఫిజికల్ యాక్టివిటీస్, నేచర్ లైఫ్, గ్లోబల్ ఎక్స్పోజర్, వెల్బీయింగ్ క్లాసెస్, కమ్యూనికేషన్, డిజటల్ అండ్ టెక్నాలజీ స్కిల్స్.. ఇవన్నీ పాఠాలుగా కాకుండా వివిధ రకాల అంశాలలో అవగాహన కలిగించడానికి మేలైన సమయం. ఈ వేసవిలో పిల్లలకు వినోదాన్ని కూడా ఇచ్చే అంశాలపై నిపుణుల సూచనలతో వరుస కథనాలు.వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటుంది. నచ్చిన ఆటలు, మెచ్చిన వినోదం.. వీటితోనే కాలక్షేపం చేయడం కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం కూడా. ఆ జాబితాలో ముందుగా వంటింట్లోకి తీసుకెళదాం. పిల్లలను కుదురుగా ఉంచేది, ఏకాగ్రతను పెంచేది, సహనాన్ని, టీమ్ వర్క్‌ని పరిచయం చేసే పాకశాస్త్రాన్ని పరిచయం చేద్దాం.. రోజూ అమ్మ చేసే వంటకు ఏదో వంక పెట్టే పిల్లలు ఉంటారు. ఒక వంట తయారు చేస్తే, మరోటి అడిగే వారూ ఉంటారు. ఇష్టమైనవన్నీ తయారుచేసి, సమయానికి బాక్స్ కట్టి ఇచ్చే అమ్మ పని తెలియాలంటే ఇదో చక్కని మార్గం కూడా. ‘అమ్మో! వంటింటిని పిల్లలకు అప్పజెప్పడమా!’ అని భయపడకుండా పిల్లల చేత గరిట పట్టిస్తే ఏమేం జరుగుతుందో తెలుసుకుందాం.. → రుచుల ఆస్వాదనవంట పాత్రలు, అందుకు ఉపయోగించే వివిధ రకాల సాధనాలు ముందుగా పరిచయం అవుతాయి. ఆ తర్వాత వంట దినుసులు, కూరగాయలు, ఆకుకూరల పట్ల అవగాహన పెరుగుతుంది. వేటితో ఏ తరహా వంటకాలు తయారు చేయచ్చు, రుచులను కలపడం వంటి ప్రక్రియల్లో పాల్గొంటారు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతుంది. ఒక సాధారణ పదార్థాన్ని కొత్తగా ఎలా రూ΄÷ందించవచ్చు, అనే ఆలోచన కూడా వారిలో అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా ఇటాలియన్ , జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ వంటకాలనూ పరిచయం చేయవచ్చు. దీనివల్ల పిల్లల్లో ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెరుగుతుంది.→ ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతాము తయారు చేసిన వంటకాన్ని కుటుంబ సభ్యులు రుచి చూసి, ప్రశంసిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న వయసులోనే ‘నేను చేయగలను‘ అనే భావన అలవాటు అవుతుంది. ఇంటì పనుల్లో తామూ భాగస్వాములు అవుతారు. వంట భారంగా కాకుండా సులభంగా చేసేలా ప్రోత్సహించవచ్చు.→ జట్టుగా విజయం కుకింగ్ క్లాసులలో చేరితే పిల్లలు గ్రూప్స్‌గా పనిచేస్తారు. ఇది వారికి టీమ్‌వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను నేర్పిస్తుంది. ఇతరులతో కలిసి పని చేయడం, బాధ్యతలు పంచుకోవడం వంటి లక్షణాలు పెరుగుతాయి.→ సమతుల్యత సాధనవంట సమయంలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వంటలో ఉపయోగించే పదార్థం తక్కువైతే ఎలా మార్చాలి, రుచిని ఎలా సర్దుబాటు చేయాలి... ఇవన్నీ పిల్లల్లో సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్యాలెన్స్ ఎంత అవసరమో తెలియజేస్తుంది.→ మంచి అలవాట్లుముఖ్యంగా వంట చేయడం ద్వారా పిల్లలు ఆహార విలువ తెలుసుకుంటారు. ఏ పదార్థం ఆరోగ్యానికి మంచిది, ఏయే పోషకాలు వేటి ద్వారా లభిస్తాయి,.. వంటి విషయాలు అర్థమవుతాయి. వృథాను అరికట్టడం, మిగిలిన పదార్థాలను తిరిగి ఎలా ఉపయోగించడం, శుభ్రతను ఎందుకు పాటించాలి.. వంటి విషయాల్లో అవగాహన కలుగుతుంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి.→ బాధ్యత పెరుగుతుందివంట చేయడం ద్వారా పిల్లలు స్వతంత్రంగా పని చేయడం నేర్చుకుంటారు. తమ పనిని తామే పూర్తి చేయడం, శుభ్రత పాటించడం వంటి బాధ్యతలు అలవాటు అవుతాయి. అంతేకాదు, వంట పనిలో భాగంగా వస్తువులను శుభ్రపరచడం, సర్దడం వంటి పనులూ నేర్చుకుంటారు. అదే సమయంలో గ్యాస్, ఎలక్ట్రిక్, కటర్స్.. వంటి వాడకంలో రక్షిత చర్యల గురించి అవగాహన కల్పించవచ్చు. ఇంట్లో వీలు కావడం లేదు అనుకునేవారు కుకింగ్ క్యాంప్స్లో చేర్పించవచ్చు. వంటల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు. వంట ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమనూ, ఆనందాన్ని, రుచుల ఆస్వాదననూ పరిచయం చేయవచ్చు. ఇది పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది కూడా.వంట.. వ్యక్తిత్వ వికాస పాఠంపిల్లలు వంట నేర్చుకోవడం ద్వారా ఒక సమగ్రమైన అవగాహన కలుగుతుంది. ఒక డిష్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుస్తుంది. ప్రతి వంటకం తయారీకి పట్టే సమయం వారిలో ఆలోచనాశక్తిని, సహనాన్ని పెంచుతుంది. జంక్ ఫుడ్ ఎందుకు తీసుకోవద్దో తెలుస్తుంది. వంట అంటే ఆడవాళ్లు మాత్రమే చేసేది కాదని కుటుంబంలో అందరూ చేయవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలో తెలుస్తుంది. అయితే, వంట పని ఒక భారంగా కాకుండా వినోదాత్మకంగా మార్చగలిగితే పిల్లలు జాయ్‌ఫుల్‌గా రుచుల తయారీ పట్ల దృష్టి పెడతారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల చేత వంటను ఫన్‌గా చేయించవచ్చు. ఎక్కువ మంది పిల్లలతో కలిసి పాల్గొనేలా చేయాలంటే..అందుకు కిడ్స్ కుకింగ్ క్యాంప్స్ పిల్లలకు వినోదంతో పాటు విలువైన నైపుణ్యాలనూ నేర్పిస్తున్నాయి. – మీరా గిరిజ తాడిమేటి, చెఫ్సాక్షి ‘హెల్త్ ప్లస్’ ఈపేపర్‌లో...పిల్లలకు వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహార పదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే ప్రత్యేక కథనం... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మేడిన్ ఇండియా ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ చాలా పురోగతి సాధించింది. దశాబ్దంలో వచ్చిన మార్పును చూస్తే ఔరా అనిపించాల్సిందే. ఇందుకు స్మార్ట్‌ఫోన్స్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. యాపిల్ ఫోన్లూ భారత్‌లో రూపుదిద్దుకుంటున్నాయి. 2014లో దేశంలో వినియోగించిన ఫోన్లలో 30 శాతంలోపు దేశీయంగా అసెంబుల్ అయితే.. 2024 వచ్చే సరికి ఇది 99 శాతం దాటిందంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత దూకుడును అర్థం చేసుకోవచ్చు. ఉపకరణాల తయారీలో వినియోగించే విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్ హబ్’గా అవతరించే దిశగా భారత్ దూసుకుపోతోంది.ఏటా కొత్త మైలురాళ్లు..మొబైల్ ఫోన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్.. ఇలా విభాగం ఏదైనా తయారీపరంగా భారత్‌లో ఏటా కొత్త మైలురాళ్లు నమోదవుతున్నాయి. దేశంలో తయారైన ఎలక్ట్రానిక్స్ విలువ 2014–15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంటే 2023–24 నాటికి ఐదురెట్లు పెరిగి రూ. 9.5 లక్షల కోట్లకు చేరుకోవడం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్‌లో జరుగుతున్న పురోగతికి నిదర్శనం. అయితే మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ కొత్త రికార్డులకు ప్రధానంగా రూ. 1.9 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కారణం. 2024–25లో భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లు దాటాయి. ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగించే విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకం ప్రకటించడం ఈ రంగంలో పెద్ద అడుగు పడినట్టు అయింది.ఈసీఎంఎస్‌తో ఊతం..విడిభాగాల తయారీ కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 22,919 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం (ఈసీఎంఎస్) ప్రారంభించింది. ఈ పథకం 2031–32 వరకు కొనసాగుతుంది. కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, మల్టీ లేయర్ పీసీబీలు సహా వివిధ విడిభాగాల తయారీని ప్రోత్సహించనుంది. రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, రూ. 4.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధించడం, కొత్తగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇప్పటికే 70 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 80% చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి పెద్ద కంపెనీలు సైతం దరఖాస్తు చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయని సమాచారం.అసెంబ్లింగ్‌ను మించితేనే..ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలంటే విడిభాగాల తయారీలో దూసుకుపోవాలి. అసెంబ్లింగ్‌కు పరిమితం కాకుండా తయారీ దిశగా అభివృద్ధి చెందాలన్నది నిపుణుల అభిప్రాయం. మొబైల్ ఫోన్లను తయారు చేయడానికి దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్ తయారీ సేవలు లేదా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలు కెమెరాలు, డిస్ప్లేలు, హై–ఎండ్ బ్యాటరీ ప్యాక్‌లు, సెమీకండక్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల వంటి కీలక భాగాల దిగుమతులపై ఆధారపడుతున్నాయి. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, వేరబుల్స్, హియరబుల్స్‌ను సైతం దిగుమతి చేసుకున్న విడిభాగాలతోనే అసెంబుల్ చేసున్నారు. విడిభాగాలు ఇప్పటికీ చైనా, కొరియా, తైవాన్ నుంచి ప్రధానంగా సరఫరా అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల విలువలో దిగుమతుల వాటా ఏకంగా 85–90% ఉందని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
అన్నీ ఆ 13,000 రూపాయల్లోనే!
వచ్చేదే అరకొర. పొదుపుగా వాడుకోవాలి. అందులోనే దాచుకోవాలి. అనుకోని ఖర్చులు ఎదురైతే ఎలా అని వెంటాడే ఆలోచనలు.. ఇదీ పైసా పైసా లెక్కబెట్టే ఓ సగటు దిగువ మధ్య తరగతి ‘జీవి’తం. దేశంలో దిగువ మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సగటు ఆదాయం నెలకు రూ. 33,000. ఖర్చులు రూ. 20,000 వరకు ఉంటున్నాయి. మిగిలిన రూ.13 వేలల్లోనే వారి కలలు, ఆకాంక్షలు, నిర్ణయాలు అన్నీ ముడిపడి ఉంటున్నాయని ‘హోమ్ క్రెడిట్’ సంస్థ నివేదిక చెబుతోంది. గతేడాదితో పోలిస్తే ఆయా విభాగాల్లో నెలవారీ సగటు వ్యయాలూ పెరిగాయని వెల్లడించింది.దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది కస్టమర్లున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ‘హోమ్ క్రెడిట్ ఇండియా’ విడుదల చేసిన ‘ద గ్రేట్ ఇండియన్ వాలెట్–2025’ నివేదిక ప్రకారం నెలవారీ వ్యయాలు పోను తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్న వారు 50% మంది మాత్రమే. ఖర్చులతోనూ వెళ్లదీస్తూ, ఆదా చేయలేకపోతున్నవారు 38% మంది ఉన్నారు. 12% మంది నెలవారీ అవసరాల కోసం అప్పు చేస్తున్నారు. ప్రాంతాలు, తరాల వారీగా ఆదాయాల్లో వ్యత్యాసం, కొనుగోళ్ల తీరు వేరుగా ఉందని ఈ నివేదిక తెలిపింది. ఆదాయం రూ.5 లక్షలలోపు..వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న కుటుంబాల ఆదాయాలు, ఖర్చులు, పొదుపుల ఆధారంగా 17 నగరాలలోని 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించారు. వీరిలో పురుషులు 84%, స్త్రీలు 16% ఉన్నారు. జెన్ –జడ్ (13–28 ఏళ్లు) 19%, మిలీనియల్స్ (29–44 ఏళ్లు) 53, జెన్ –ఎక్స్ (44–59 ఏళ్లు) 28% ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో కార్మికులు 42 %, వ్యాపారులు 29, వేతన జీవులు 22, స్వయం ఉపాధి పొందుతున్నవారు 7% ఉన్నారు.పొదుపులో జెన్ –జడ్జెన్ –జడ్ తరంలో అత్యధికంగా 56% మంది పొదుపు చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. మిలీనియల్స్‌లో ఇది 53%. వీరితో పోలిస్తే జెన్ –ఎక్స్‌లో తక్కువగా 41% మంది మాత్రమే సేవింగ్స్‌కు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నవారిలో జెన్ –జడ్ తరం నుంచి 33% ఉన్నారు. లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక మార్గదర్శకులు కావాలని 58% మంది భావిస్తున్నారు. జెన్ –జడ్ విషయంలో ఈ సంఖ్య 65%, మిలీనియల్స్‌లో 59% ఉన్నారు. ఇక భారత్‌లో దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక సగటు ఆదాయం రూ.38,600 నమోదు చేయగా, ఉత్తరాది, తూర్పున ఇది సగటున రూ.30,300గా ఉంది. బెంగళూరు రూ.45,700తో తొలి స్థానంలో నిలిచింది. రూ.39,200తో హైదరాబాద్, రూ.35,800 తో ముంబై ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఆకాంక్షలతోపాటు ఆందోళనలు..వచ్చే అయిదేళ్లలో వ్యాపారం ప్రారంభించడం, విస్తరించాలని 23% మంది లక్ష్యంగా చేసుకున్నారు. ఇల్లు కొనుక్కోవాలని 23% ఆకాంక్షించారు. పిల్లల విద్యకు పొదుపు చేయాలని 15% మంది, రుణాల చెల్లింపు 11%, కారు కొనుగోలు 11%, విదేశీ టూర్ వెళ్లాలని 7% మంది భావిస్తున్నారు. దాదాపు 60% మంది తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉన్నారు. పిల్లల చదువులకు ఖర్చులు సరిపోవడం లేదని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే తగినంత పొదుపు లేదని, రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నామని, ఉద్యోగం లేదా ఆదాయ వనరు కోల్పోయామని, పదవీ విరమణకు సరిపడా డబ్బు లేవని ఆవేదన చెందుతున్నారు.దుకాణాలకు వెళ్లి..దుస్తులు, ఫ్యాషన్ , మొబైల్ ఫోన్ ్స, గృహోపకరణాలు, సరుకులు, మందులు.. ఈ విభాగాల్లో కస్టమర్లు ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మొత్తం కొనుగోళ్లలో ఏకంగా 83–85% ఆఫ్‌లైన్ లోనే నమోదు కావడం గమనార్హం. బస్సు, రైలు టికెట్ బుకింగ్స్, ఫుడ్ ఆర్డర్స్‌లో ఆఫ్‌లైన్ వాటా 58–59%గా ఉంది. రుణాల చెల్లింపుల్లో 50%, బిల్ పేమెంట్స్‌లో 54% ఆన్లైన్లోనే చేస్తున్నారు.రూ.20వేల వరకు ఖర్చులకే సరిపోతోంది⇒ పొదుపు చేయగలుగుతున్న వారు 50% మంది⇒ భారీగా పెరిగిన పిల్లల చదువు వ్యయం⇒ గతేడాదితో పోలిస్తే 34% పెరుగుదల⇒ దుకాణాలకు వెళ్లి కొంటున్నారు⇒ ‘ద గ్రేట్ ఇండియన్ వాలెట్–2025’ నివేదిక⇒ కొనుగోళ్లలో సుమారు 85% ఆఫ్‌లైన్ లోనే -
సివిల్స్ విజేతలు అక్కడ సైన్స్.. ఇక్కడ ఆర్ట్స్..
సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా పలు అఖిల భారత సర్విసులకు అభ్యర్థులను ఎంపిక చేసే అత్యంత క్లిష్టమైన ఎంపిక ప్రక్రియ. ఈ ప్రక్రియలో జనరల్ స్టడీస్ నుంచి ఆప్షనల్ సబ్జెక్ట్ వరకు అన్నిటిపై.. అభ్యర్థులకు ఉన్న అవగాహనను లోతుగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఇందులో పొందే మార్కులే తుది విజయాన్ని నిర్దేశిస్తున్న పరిస్థితి. దీంతో అకడమిక్‌గా టెక్నికల్, సైన్స్, మెడిసిన్ వంటి నాన్–ఆర్ట్స్ నేపథ్యాల అభ్యర్థుల్లో 85 శాతం మంది హ్యుమానిటీస్ సబ్జెక్ట్‌లనే ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకుంటున్నారు. ఫలితాల్లోనూ సత్తా చాటుతున్నారు. వీళ్లంతా అంతవరకు తాము చదువుకున్న సబ్జెక్ట్ వదిలేసి.. అందుకు భిన్నంగా హ్యుమానిటీస్ వైపు ఎందుకు మళ్లుతున్నారు.. ఎలా విజయం సాధిస్తున్నారు.. ఈ కారణాలపై విశ్లేషణ. ..: సాక్షి, స్పెషల్ డెస్క్ :..⇒ శక్తిదూబె.. సివిల్స్–2024 లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీ పూర్తి చేసుకున్న ఆమె.. సివిల్స్‌లో మాత్రం ఆప్షనల్ సబ్జెక్ట్‌గా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంచుకున్నారు.⇒ తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని ఎలక్ట్రానిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేసి.. ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నారు.⇒ ఇంజనీరింగ్, సైన్స్ నేపథ్యాల అభ్యర్థులు.. సివిల్స్‌లో ఆప్షనల్ విషయంలో మాత్రం హ్యుమానిటీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి మచ్చుకు రెండు ఉదాహరణలివి. వీరిద్దరే కాదు.. 2017 నుంచి 2021 వరకు 76% మంది టెక్, సైన్స్, మెడిసిన్ నేపథ్యాల విజేతలు కాగా.. వీరిలో 85% మంది హ్యుమానిటీస్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోవడం విశేషం.వనరుల లభ్యతే కారణం.. హ్యుమానిటీస్‌ను ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకుంటున్న వారు సైతం.. అందులో నాలుగు సబ్జెక్ట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, జాగ్రఫీ. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా హ్యుమానిటీస్ విభాగంలోని ఒక సబ్జెక్ట్ ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న అంశం.. వనరుల లభ్యత. సివిల్ సర్విసెస్ ఎంపిక ప్రక్రియలో రెండో దశలోని మెయిన్స్‌లో రెండు పేపర్లుగా 500 మార్కులకు ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి పరిపూర్ణ అవగాహన తప్పనిసరి.మెటీరియల్ లభ్యత, శిక్షణ సదుపాయం విషయంలో హ్యుమానీటీస్ సబ్జెక్ట్‌లకు సంబంధించి పుష్కలమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. కోచింగ్ ఫ్యాకల్టీలో సైతం 90 శాతం మంది ఈ సబ్జెక్ట్లలోనే అందుబాటులో ఉంటున్నారు. విశ్లేషణాత్మక వ్యక్తీకరణ సులభంగా ఉండడం కూడా ఈ సబ్జెక్ట్‌లను ఎంచుకోవడానికి కారణమని విజేతలు, కోచింగ్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. న్యూమరికల్ పాఠ్యాంశాలు ఉండే మ్యాథ్స్, సైన్స్‌లు సహనానికి పరీక్షగా మారుతున్నాయి.జీఎస్ పేపర్లకు సమయం ఆదా..హ్యుమానిటీస్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోవడం వల్ల అభ్యర్థులకు కలిసొస్తున్న మరో అంశం.. జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్(జీఎస్) పేపర్లకు సమయం ఆదా చేసుకునే అవకాశం. ఒక జనరల్ ఎస్సే, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఉండే మెయిన్స్ పరీక్షలో అత్యధిక శాతం అంశాలు సమకాలీన, భౌగోళిక అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు, పరిపాలన, చరిత్ర, ఆర్థిక అంశాల నుంచే ఉంటున్నాయి. దీంతో హ్యుమానిటీస్లోని ఏ సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకున్నా.. ఎస్సే, జీఎస్ పేపర్లతో కలిపి చదివే అవకాశం ఉంటోంది. సివిల్స్ మెయిన్స్ ఆప్షనల్స్ విషయంలో హ్యుమానిటీస్ సబ్జెక్ట్‌లైన ఆంత్రోపాలజీ, పబ్లిక్ అడ్మిని్రస్టేషన్, సోషియాలజీ, పాలిటీలకు ఎప్పటి నుంచో స్కోరింగ్ సబ్జెక్ట్‌లనే పేరుంది. విధుల్లోనూ ఉపయోగంహ్యుమానిటీస్ సబ్జెక్ట్‌ను ఎంచుకుంటే.. భవిష్యత్తులో సివిల్ సర్విస్ అధికారులుగా నిర్వర్తించాల్సిన విధుల విషయంలోనూ స్పష్టత ఏర్పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు పాలిటీ, గవర్నెన్్స, ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్ వంటి అంశాలనే పరిగణనలోకి తీసుకుంటే.. పాలన పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, పాలనా దక్షతకు సంబంధించిన అంశాలతో సిలబస్‌ను కూర్చారు. దీనిపై పట్టు సాధించడం ద్వారా విజేతలుగా నిలిస్తే భవిష్యత్తులో విధి నిర్వహణలోనూ సమర్థవంతంగా వ్యవహరించొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది.ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలోని రెండో దశ మెయిన్స్‌లో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. వీటిలో రెండు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–1, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–2గా ఉంటాయి. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా యూపీఎస్సీ 2025 పేర్కొన్న 26 సబ్జెక్ట్‌ల నుంచి ఒక సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోవాలి. మొత్తం 1,750 మార్కులకు ఉండే మెయిన్స్ పరీక్షలో ఆప్షనల్ సబ్జెక్ట్‌కే 29 శాతం వెయిటేజీ ఉంటోంది.నాలుగైదు నెలల్లో పట్టు సాధించే అవకాశం ⇒ హ్యుమానిటీస్ ఆప్షనల్స్ విషయంలో అభ్యర్థులకు కలిసొస్తున్న అంశం.. మంచి గ్రాహక శక్తి ఉన్న అభ్యర్థి నాలుగైదు నెలల్లో సంబంధిత సబ్జెక్ట్‌లో పట్టు సాధించే అవకాశం ఉండడమే. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు అకడమిక్ అభ్యసనం కోణంలో స్వతహాగా అనలిటికల్ స్కిల్స్ లభిస్తున్నాయి. ఇది కూడా వారికి కలిసొస్తున్న అంశమే. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ ఐఏఎస్ అకాడమీసక్సెస్ రేటు.. 2017 నుంచి 2021 వరకు సివిల్స్‌లో ఇంజినీరింగ్ అకడమిక్ నేపథ్యం ఉన్న 63.7%అభ్యర్థులు పరీక్షలు రాస్తే.. ఇంజినీరింగ్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుని విజేతలైంది మాత్రం కేవలం 5.5%. మన దృక్పథాన్ని విశ్లేషించే అవకాశం⇒హ్యుమానిటీస్ ఆప్షనల్స్ విషయంలో సమాధానం ఇచ్చేటప్పుడు మన దృక్పథాన్ని, అప్పటి వరకు చదివిన అంశాలను పూర్తి స్థాయిలో విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ సబ్జెక్ట్స్‌కు లోతైన అవగాహన అవసరం. సివిల్స్ ప్రిపరేషన్ గడువుతో పోల్చుకుంటే ఇది కొంత కష్టమైన ప్రక్రియ. అందుకే టెక్ నేపథ్యం ఉన్న వారు హ్యుమానిటీస్‌ను ఆప్షనల్‌గా ఎంచుకుంటున్నారు. అలాగే హ్యుమానిటీస్ విషయంలో కోచింగ్ తీసుకోలేని వారికి కూడా విస్తృతమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడమూ సులభం. నా ఆప్షనల్ ఆంత్రోపాలజీ పరిధి ఎక్కువే అయినప్పటికీ.. సిలబస్‌లోని అంశాలను బేరీజు వేసుకుని చదివాను. – ఇ. సాయి శివాని, సివిల్స్–2024లో 11వ ర్యాంకు (తెలుగు రాష్ట్రాల్లో టాపర్)సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్ – 2024 గణాంకాలు⇒ 5.8లక్షలు హాజరైన అభ్యర్థులు ⇒ 14,627 మెయిన్స్‌కు ఎంపికైన వారు⇒ 2,845 ఇంటర్వ్యూకు ఎంపికైన వారు ⇒ 1009 విజయం సాధించిన వారు -
60+ సాహస యాత్ర!
అరవైల్లో పడ్డాక ఇక జీవితం అయిపోయిందనే రోజులు పోయాయ్! అమ్మమ్మలు.. తాతయ్యలు కూడా ఇప్పుడు అంటార్కిటికా నుంచి అగ్నిపర్వతాల దాకా... యూరప్ నుంచి జపాన్ దాకా.. ప్రపంచాన్ని చుట్టేసేందుకు సై అంటున్నారు. అంతేకాదు స్కైడైవింగ్ మొదలు స్కీయింగ్.. శాండ్ సర్ఫింగ్.. ఎలాంటి సాహసాలకైనా తగ్గేదేలే అంటున్నారు. అడ్వెంచర్ టూర్ల విషయంలో యువతతో పోటీ పడుతుండటంతో బేబీ బూమర్స్(Baby Boomer) (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారు) పర్యాటకం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి వయసుతో పనేముందని నిరూపిస్తున్నారు బేబీ బూమర్స్. కుటుంబ బాధ్యతలతో తాము కోరుకున్న ఆనందాలను దూరం చేసుకున్న వారెందరో ఉంటారు. అయితే, అరవైల్లో మళ్లీ నలభై వచ్చింది.. అంటూ ప్రపంచ పర్యటనలకు సైతం సిద్ధమైపోతున్న వారు ఇటీవల బాగా పెరుగుతున్నారు. దీంతో ట్రావెల్ పరిశ్రమ కూడా ప్రత్యేక ప్యాకేజీలతో మరింత ప్రోత్సహిస్తోంది. సెగ్జాజెనేరియన్స్ (60–69 ఏళ్ల వయసు), సెప్టువాజెనేరియన్స్ (70–79 ఏళ్ల వయసు) ఆక్టాజెనేరియన్స్ (80–89 ఏళ్ల వయసు) ఇలా అన్ని వయసుల వారికీ ట్రావెల్ కంపెనీలు అనువైన ప్యాకేజీలను అందిస్తున్నాయి.⇒ అంటార్కిటికా నుంచి అగ్నిపర్వతాల దాకా...⇒ ప్రపంచాన్ని చుట్టేస్తున్న సీనియర్ సిటిజన్స్⇒ అడ్వెంచర్ యాక్టివిటీలకూ సై...⇒ ప్రత్యేక సదుపాయాలు, డిస్కౌంట్లతో ప్రోత్సహిస్తున్న ట్రావెల్ సంస్థలుఏ సాహసానికైనా రెడీకేవలం ప్రపంచ యాత్రలే కాదు అడ్వెంచర్ ట్రావెల్‌కు కూడా బేబీ బూమర్స్ ఎగిరి గంతేస్తున్నారు. బుకింగ్స్ డాట్ కామ్ ‘ట్రావెల్ ప్రిడిక్షన్స్–2025’ సర్వే ప్రకారం అత్యంత సాహసంతో కూడిన యాక్టివిటీలకు మొగ్గు చూపుతున్న బేబీ బూమర్స్ 30 శాతానికి ఎగబాకారు. 2024లో ఈ సంఖ్య 11 శాతం మాత్రమే. వయసు గురించి ఆలోచించకుండా ప్రతి నలుగురు బేబీ బూమర్స్‌లో ఒకరు ఇలాంటి అడ్వెంచర్లంటే మక్కువ చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.ప్రత్యేక డిస్కౌంట్లుసీనియర్ సిటిజన్స్ విదేశీ పర్యటన బుకింగ్స్‌లో ఏటా 20 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు ట్రావెల్ పోర్టల్ ఈజ్‌మైట్రిప్ సీఈఓ రికాంత్ పిట్టీ పేర్కొన్నారు. 2021తో పోలిస్తే బుకింగ్స్ ఏకంగా మూడు రెట్లు పెరిగాయన్నారు. కాగా, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక డిస్కౌంట్లనూ ఈ సంస్థ అందిస్తోంది. రిలాక్స్ అయ్యేందుకు కేరళ బ్యాక్ వాటర్స్, గోవా బీచ్‌లను ఎంచుకుంటున్నారు. ఇక ప్రకృతిలో సేద తీరేందుకు ఈశాన్య భారతాన్ని ఎక్కువగా చుట్టేస్తున్నారు.చలో అంటార్కిటికా...ఉత్తర ధ్రువం వద్ద నార్తర్న్ లైట్స్, అంటార్కిటికా క్రూజ్ యాత్రలకూ ఇటీవల ఆసక్తి పెరిగిందని సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ స్పెషలిస్ట్ సంస్థ ‘కరేవాయేజ్’ పేర్కొంది. సంప్రదాయేతర, సాహసోపేతమైన గమ్యస్థానాలకు మొగ్గు చూపేవారు 2021తో పోలిస్తే 2024లో మూడింతలు పెరిగారని చెప్పింది. ఏటా 10వేల మందికి పైగా డిమాండ్ ఉన్నప్పటికీ, మంచి పర్యాటక అనుభూతిని అందించే లక్ష్యంతో తాము అంతకు మించి బుకింగ్స్ అనుమతించడం లేదని కంపెనీ ఫౌండర్ షెఫాలీ జైన్ మిశ్రా తెలిపారు. గతేడాది ఈ సంస్థ 10 మంది సీనియర్ సిటిజన్స్ బృందంతో 10 రోజుల అంటార్కిటికా ట్రిప్ నిర్వహించింది. జపాన్ చెర్రీ బ్లోసమ్స్, ఫిన్లాండ్ వింటర్ ల్యాండ్‌స్కేప్స్, నార్వే నార్తర్న్ లైట్స్, ఐస్లాండ్స్ క్రూజ్ యాత్రలు, యూరప్ రివర్ సెయిలింగ్స్ వంటి ప్రత్యేక టూర్లనూ ఈ సంస్థ అందిస్తోంది.ఆర్థికంగా స్థిరపడటం ప్లస్ఖర్చులన్నీ పోను అదనంగా వెచ్చించగలిగే ఆదాయం దండిగా ఉండటం, కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోవడంతో ప్రపంచాన్ని చుటి్టరావాలన్న తమ కోరికలను తీర్చుకోవడానికి సీనియర్ సిటిజన్స్ ప్రాధాన్యమిస్తున్నారని పిట్టీ చెప్పారు. ‘రిటైర్మెంట్ తర్వాత తగినంత సమయం దొరకడంతో కొత్త ప్రదేశాలను చుట్టొచ్చేందుకు వీలవుతోంది. 51 శాతం మంది బేబీ బూమర్స్, 39 శాతం మంది సైలెంట్ జెనరేషన్ (80 ఏళ్ల పైబడిన వారు) జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన టూర్లకు మొగ్గు చూపుతున్నారు’ అని వివరించారు. కాగా, విమానాలు, రైలు చార్జీల్లో డిస్కౌంట్లు.. ఎయిర్‌పోర్టుల్లో ర్యాంపులు, ఎలివేటర్ సదుపాయాలు ఉండటం వల్ల వారు పర్యటనలకు ముందుకొస్తున్నారని భారతీయ టూరిజం, హాస్పిటాలిటీ అసోసియేషన్ల ఫెడరేషన్ (ఎఫ్ఏఐటీహెచ్) బోర్డు సభ్యుడు, టూర్వాలా ఎండీ వేద్ ఖన్నా అభిప్రాయపడ్డారు. నిపుణులైన టూర్ గైడ్లు, జర్నీలో వైద్యుల తోడ్పాటు వంటి సదుపాయాలతో ప్రత్యేకంగా ప్యాకేజీలను తీర్చిదిద్దుతుండటం వల్ల కూడా డిమాండ్ పెరిగిందన్నారు.అవీ ఇవీ⇒ సీనియర్స్ మక్కువ చూపుతున్న ప్రఖ్యాత ప్రపంచ నగరాలు: టోక్యో, సియోల్, సింగపూర్, లండన్⇒ ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలు: వారణాసి, అయోధ్య, హరిద్వార్, రిషికేష్, రామేశ్వరం, పూరి, తిరుపతి⇒ సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ బుకింగ్స్‌లో వృద్ధి: 20%⇒ 2023లో ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మార్కెట్ విలువ: 3.2 బిలియన్ డాలర్లు (రూ.27వేల కోట్లు)(2032 నాటికి ఇది 16.7 బిలియన్ డాలర్లకు చేరుతుందనేది అలైట్ మార్కెట్ రీసెర్చ్ అంచనా) -
చదువు కోసమే వచ్చారా?
అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరైన పత్రాలతోనే వచ్చారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. హెచ్–1బీ వీసా పొందిన వారిపైనా నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ప్రధాన వర్సిటీలపై దృష్టి అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23లో 2,68,923 మంది వెళ్తే, 2023–24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివ ర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్‌ల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజెలిస్ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. తలనొప్పిగా ఓపీటీ అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు (ఇవి కూడా స్కిల్డ్ మాత్రమే) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది.అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున రూ.35 లక్షల నుంచి రూ.49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ఏఐతో పటిష్టమైన డేటా ప్రతి విదేశీ విద్యార్ధిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్‌లో ఉన్నాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు. కన్సల్టెన్సీలపై నిఘా అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. పత్రాలన్నీ చూస్తున్నారు ఇండియా నుంచి వచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. – విక్రమ్ శశాంక్, ప్రవాస భారతీయుడు. ఓపీటీ తీసేస్తే పరిస్థితి ఏమిటి? రూ.45 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్ టైం జాబ్ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తే తిరిగి ఇండియా వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. – అఖిలేష్ పూనాటి, అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన విద్యార్ధి. హెచ్–1బీకీ తిప్పలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడివాళ్లకే (అమెరికన్లకు) అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలవారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్ వెళ్తున్నారు. భవిష్యత్‌లో హెచ్–1బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్, హెచ్–1బీ వీసాపై అమెరికా వెళ్లిన ఎంఎన్సీ ఉద్యోగిని. -
Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
ప్రతిరోజూ ఎండతోపాటుగా.. వర్షాలు, చల్లదనం, వాతవరణంలో ఓకేసారి మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అందులో చర్మం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపంచాలంటే ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేయండి..పుచ్చకాయ.. ద్రాక్ష!పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్‌ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతిమంతం అవుతుంది.ఆరెంజ్ జ్యూస్..టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది.కొబ్బరిపాలతో..ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరిపాలలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులపై అద్ది, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.సోంపుతో..రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టి, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్‌లో ఉంచాలి.ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూది ఉండను సోంపు నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగిస్తాయి. దురద, దద్దుర్లు, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా! -
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్‌తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్‌లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్‌కి ప్రసిద్ధి. -
Summer Special: ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!
ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లోనుంచి బాటిల్ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్ వాటర్ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.ఇవి చదవండి: Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా! -
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్‌గా లాంగ్ ఫ్రాక్స్
వేసవి వేడిమిని తట్టుకోవాలి, కంఫర్ట్‌గా ఉండాలి అదే టైమ్‌లో స్టైలిష్‌గానూ కనిపించాలి. కాటన్ కుర్తీ పైకి బాందినీ, చందేరీ, ఇకత్, సిల్క్ ఓవర్ కోట్లు ఇప్పుడు బెస్ట్ ఛాయిస్‌గా ఉంటున్నాయి. బోహోస్టైల్ని తలపిస్తూ, సమ్మర్ స్పెషల్‌గా ఉండే ఈ స్టైల్ ఏ సందర్భానికైనా బాగా నప్పుతుంది.కలర్ఫుల్గా.. కంఫర్టబుల్‌గా..సంప్రదాయ వేడుకల్లో షిమ్మరీ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్ట్, వాటి మీదకు సిల్క్ డిజైనర్ లాంగ్ ఓవర్ కోట్స్ ప్రత్యేకతను చూపుతాయి.లాంగ్ ఫ్రాక్ లేదా లాంగ్ కుర్తీ ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి స్లీవ్స్ లేదా స్లీవ్‌లెస్ టాప్స్‌ని సెలక్ట్ చేసుకోవాలి. కాటన్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫ్లోరల్స్లో లేదా భిన్నమైన ప్రింట్లు ఉన్న ఓవర్ కోట్స్ బాగా నప్పుతాయి. ఈ స్టైల్ డ్రెస్సింVŠ బోహో లుక్‌తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాలానికి తగినట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ దీనికి సరైన ఎంపిక అవుతుంది.కాటన్ కుర్తీ–పైజామా మీదకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ ఓవర్‌కోట్‌ను ధరించవచ్చు. దుపట్టా అవసరం లేని ఈ స్టైల్ క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ సెట్ అవుతుంది.కాటన్ లాంగ్ కుర్తీకి ఇక్కత్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే ఉక్కబోతను, స్టైల్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చు.సింపుల్ అండ్ గ్రేస్‌గా కనిపించే లుక్ టాప్ అండ్ బాటమ్‌కి ఫ్లోరల్ ఓవర్ లాంగ్ కోట్ సూపర్ స్టైలిష్ లుక్‌గా కనిపిస్తుంది. ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్ ఓవర్ కోట్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా స్పెషల్‌గా కనిపిస్తారు.లాంగ్ ఫ్రాక్‌కి అటాచ్ చేసినట్టుగా ఉండే ఫ్రాక్ స్టైల్ ఓవర్ కోట్ పార్టీలో స్టైలిష్ లుక్‌తో వెలిగిపోతుంది.ఓవర్కోట్లా అనిపించే లాంగ్ ఫ్రాక్ డ్రెస్‌ను కూడా ఈ స్టైల్‌కి ఎంపిక చేసుకోవచ్చు. సమ్మర్లో ఈవెనింగ్ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్‌గా వెలిగి΄ోవచ్చు.సిల్క్ టాప్స్ అయినా ఈవెనింగ్ టైమ్‌కి ఓకే అనుకున్నవారు అదే కాంబినేషన్లో వచ్చే సిల్క్ ఓవర్ కోట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు! -
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
మే నెల వచ్చేసింది... ఎండలు మండుతున్నాయి. భోజనం చేయాలంటే చెమటలు పడుతున్నాయి. కూరలను చూస్తేనే ఆకలి పోయి దాహం వేస్తోంది. నేరుగా మజ్జిగలోకి వెళ్లాలనిపించేంత దాహం అది. అందుకే పెరుగుతోనే కూరలు చేసుకుందాం. ఇవన్నీ నాలుకకు హితవుగా ఉంటాయి. తిన్న తర్వాత పొట్టను చల్లగా ఉంచుతాయి.దహీ బైంగాన్..కావలసినవి.. వంకాయ – 1 (మీడియం సైజు); నూనె – టేబుల్ స్పూన్ (వంటకు ఉపయోగించే నూనె ఏదైనా) ; ఆవనూనె – టేబుల్ స్పూన్ (పోపు కోసం) ; యాలకులు – 2 ; లవంగాలు – 2 ; పెరుగు – పావు లీటరు (చిలకాలి). గ్రేవీ కోసం: మెంతిపిండి – టేబుల్ స్పూన్ ;అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; కశ్మీర్ మిర్చిపౌడర్ – టేబుల్ స్పూన్ ; నీరు – కప్పు (పై వన్నీ కలపడానికి) ; ఇంగువ– చిటికెడు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; పసుపు – టీ స్పూన్.తయారీ..ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో మెంతిపిండి, మిర్చిపౌడర్, అల్లం పేస్టు వేసి కలపాలి.వంకాయను మందపాటి చక్రాల్లా తరిగి ఉప్పు రాయాలి.నూనె వేడి చేసి వంకాయ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి(ఎయిర్ ఫ్రయర్ ఉంటే నూనె లేకుండా ఫ్రై చేసుకోవచ్చు)అదే బాణలిలో మిగిలిన నూనెలో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, ఇంగువ వేయాలిఇందులో మెంతిపిండి, అల్లం, మిరప్పొడి కలిపిన మిశ్రమం, పసుపు వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలిఆ మిశ్రమం వేడెక్కిన తర్వాత పెరుగు వేసి గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల పాటు మరిగించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మరో కప్పు నీటిని పోసి కలిపితే చిక్కటి గ్రేవీ తయారవుతుందిఇప్పుడు ఉప్పు కలిపి గ్రేవీ చిక్కదనాన్ని సరిచూసుకుని అవసరమైతే మరికొన్ని నీటిని పోసి మరగనివ్వాలిఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలిపి వడ్డించాలిఇది అన్నంలోకి రోటీకి కూడా మంచి కాంబినేషన్.పులిస్సెరి..కావలసినవి.. పెరుగు – పావు లీటరు ; పసుపు – పావు టీ స్పూన్ ; నీరు – పావు లీటరు. కొబ్బరి పేస్టు కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చిమిర్చి– 3 ; జీలకర్ర– టీ స్పూన్; నీరు – కప్పు లేదా కొబ్బరి పేస్టు చేయడానికి తగినంత.పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు (వంటకు ఉపయోగించే కొబ్బరి నూనె లేదా ఇతర వంట నూనె) ; ఆవాలు – అర టీ స్పూన్ ; కరివేపాకు – 2 రెమ్మలు ; మెంతులు– పావు టీ స్పూన్ ; ఎండుమిర్చి– 2 ; ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు ; అల్లం – అర అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేయాలి. తగినంత నీటిని వేస్తూ మెత్తగా చేసుకోవాలిఒక పాత్రలో పెరుగు, పసుపు, నీరు కలిపి చిలికి అందులో ఉప్పు, కొబ్బరి పేస్టు వేసి కలపాలిఈ పాత్రను స్టవ్ మీద పెట్టి మీడియం మంటమీద మధ్యలో గరిటెతో కలుపుతూ వేడిచేయాలి.దీనిని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మరగడం మొదలైన వెంటనే దించేయాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు వేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలిఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత పోపును ముందుగా వేడి చేసి సిద్ధంగా ఉంచిన పెరుగు– కొబ్బరి పేస్టు మిశ్రమంలో కలిపి, కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. ఈ కేరళ వంట అన్నంలోకి రుచిగా ఉంటుంది.గుజరాతీ కడీ..కావలసినవి: శనగపిండి– 4 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చిమిర్చి పేస్ట్– అర టేబుల్ స్పూన్ (అల్లం అంగుళం ముక్క, రెండు పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి); తాజా పెరుగు – కప్పు ; బెల్లం లేదా చక్కెర – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నీరు – రెండున్నర కప్పులు. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర– అర టీ స్పూన్ ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; కరివేపాకు – ఒక రెమ్మ ; ఎండు మిర్చి – 2; మెంతులు – పావు టీ స్పూన్ ; ఇంగువ – చిటికెడు ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..ఒక పాత్రలో శనగపిండి, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, బెల్లం, ఉప్పు వేసి బాగా చిలకాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలిఅవి పేలిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, ఎండు మిర్చి (విరిచి వేయాలి), మెంతులు, ఇంగువ వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలిఈ పోపును ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు – శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలిఇప్పుడు ఆ పాత్రను మీడియం మంట మీద ఉంచి మిశ్రమం అడుగుకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి కలుపుతూ మాడకుండా చూసుకోవాలిశనగపిండి పచ్చి వాసన పోయిన తర్వాత మిశ్రమం మంచి రుచికరమైన వాసన వస్తుంటుంది. అప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలిగుజరాతీ కడీని సూప్లాగ భోజనానికి ముందు తాగవచ్చు. అన్నంలో కలుపుకోవచ్చు, రోటీలోకి కూడా తినవచ్చు. ఇది వేసవి, శీతాకాలాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారం.గుజరాతీ కడీ, కుకురార్కుకురార్..కావలసినవి.. చికెన్ – అర కేజీ ; చిక్కటి పెరుగు – 5 టేబుల్ స్పూన్లు ; బంగాళదుంప – 2 (ముక్కలుగా తరగాలి) ; అల్లం వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – 3 (తరగాలి) ; ఆవ నూనె లేదా సాధారణ వంటనూనె – 5 టేబుల్ స్పూన్లు ; చక్కెర – చిటికెడు ; ఉప్పు – 2 టీ స్పూన్లు లేదా రుచిని బట్టి ; ఎండు మిర్చి– 5 ; పచ్చిమిర్చి– 3 (నిలువుగా చీరాలి) ; పసుపు – టీ స్పూన్ ; మిరప్పొడి– 2 టీ స్పూన్లు ; గరం మసాలా పొడి – టీ స్పూన్ ; చికెన్ మసాలా పొడి– టీ స్పూన్ ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేయాలి.అందులో పసుపు, చికెన్ మసాలా పొడి, మిరప్పొడి వేసి మసాలా పొడులు చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలిఈ లోపు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఇంగువ, చక్కెర, ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలిఇవి చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులోనే పెరుగు కూడా వేసి సమంగా కలిసేటట్లు ఒకసారి తిప్పి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టాలిఉల్లిపాయలు వేయించిన బాణలిలో మిగిలిన నూనెలో బంగాళాదుంప ముక్కలు వేయించి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలిఅదే బాణలిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించి తీసి పెట్టుకోవాలిఇప్పుడు మిగిలిన నూనెలో మారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలిచికెన్ ముక్కలు ఎర్రగా వచ్చేవరకు వేయించి అప్పుడు ఉప్పు వేసి ముక్కలకు పట్టేటట్లు కలపాలిచికెన్ ముక్కల నుంచి నూనె వేరవుతున్న సమయంలో బంగాళాదుంప ముక్కలను వేయాలిఈ రెండింటినీ కలిపి పది నిమిషాల పాటు వేయించిన తర్వాత అందులో రెండు కప్పుల నీరు పోసి కలిపి మంట పెంచి ఉడకనివ్వాలిచికెన్ ఉడికేటప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితోపాటు గరం మసాలా పొడి, చిలికిన పెరుగు మిశ్రమాన్ని వేయాలిఇవన్నీ కలిసి ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. ఈ కుకురార్ అస్సాం వాళ్ల వంట. అన్నం, రోటీల్లోకి రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు.. -
భయపెడుతున్న ఎండలు: వడదెబ్బతో ఎంత ప్రమాదమో తెలుసా?
ప్రతీచోట 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ తగలడం ఖాయం. జాగ్రత్తలు పాటించకుండా ఎండలో తిరిగితే శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దానిని నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఎండలో వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ పలు అంశాలు వెల్లడించారు. ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ఎండలో వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమవుతుంది. ఎండకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్తే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. టోపీ, తలపాగానైనా తప్పకుండా ధరించాలి.సాక్షి: వడదెబ్బకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. కొబ్బరినీరు, గ్లూకోజ్, సల్ల, ఓఆర్ఎస్ నీటిని తాగించాలి. ఫ్యాన్ గాలి బాగా తగిలేలా చూడాలి. దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. మనిషికి తగినంత గాలి ఆడేలా చేయాలి. చుట్టూరా మంది గుమిగూడకూడదు. ఉప్పు కలిపిన ద్రవాలు, ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. కీరదోస ముక్కలు ఎక్కువగా తినిపించాలి.సాక్షి: వడదెబ్బకు ఎలా గురవుతారు.. లక్షణాలేంటి..?డీఎంహెచ్‌వో: తీవ్రమైన వడగాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురైన వ్యక్తి నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటిని కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు.సాక్షి: వడదెబ్బకు గురైన వ్యక్తిలో కలిగే మార్పులేంటి.. ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వేడికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల సోడియంక్లోరైడ్, నీటి నిష్పత్తి తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో పనిచేసినప్పుడు ప్రతి గంటకు 3 నుంచి 4 లీటర్ల నీటిని చెమట రూపంలో కోల్పోతుంటారు. ఇలాంటి సమయంలో నీరు బాగా తీసుకోవాలి.సాక్షి: వడదెబ్బ ప్రమాదకరమేనా? అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తే ఎలా?డీఎంహెచ్‌వో: వడదెబ్బ చాలా ప్రమాదకరం. మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం హైపోతలామస్ దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే సన్‌స్ట్రోక్, హీట్‌స్ట్రోక్ అంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ పడకుండా చూసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకూడదు.సాక్షి: ప్రథమ చికిత్స ఏంటి? ఎలా ఇవ్వాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకోవాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను తాగించడంతో పాటు చల్లని ప్రాంతంలో పడుకోబెట్టాలి. ముఖ్యంగా 65ఏళ్లు పైబడిన వారు బయటకు వెళ్లరాదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు, ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు, ముఖ్యంగా గుండెజబ్బులు, బీపీ ఉన్న వారు వెళ్లవద్దు.సాక్షి: వైద్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?డీఎంహెచ్‌వో: ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కువ సమయం చల్లని ప్రదేశాల్లో ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రికి వెళ్తే చికిత్స అందిస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలి.సాక్షి: ఎండలో వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ముఖ్యంగా ఎండకాలంలో వేడి కలిగించే పదార్థాలు తినకూడదు. కూల్‌డ్రింక్స్ అసలే తాగొద్దు. కూల్‌డ్రింక్స్ ప్రమాదకరం. మజ్జిగ, కొబ్బరినీరు మాత్రమే తీసుకోవాలి. వీలైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిగా చేసి అరస్పూన్ పొడిని గ్లాస్ నిమ్మరసంలో కలిపి ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఎనర్జీగా ఉంటుంది.- పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్యాధికారిఇవి చదవండి: Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు -
ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్‌కి దూరంగా ఉండాలంటే?
సెలవులొచ్చేది ఆటల కోసం, స్నేహాల కోసం బంధువుల కోసం, విహారాల కోసం, వినోదాల కోసం పిల్లలు ఇంతకాలం ఫోన్లలో కూరుకుపోయారు. వారిని ఫోన్ల నుంచి బయటకు తెండి. మీ బాల్యంలో సెలవుల్లో ఎలా గడిపారో అలా గడిపేలా చేయండి. పెద్దయ్యాక తలుచుకోవడానికి బాల్యం లేకపోవడానికి మించిన విషాదం లేదు.ఆటస్థలాలు లేని స్కూళ్లలో చదివించడం, ఆడుకునే వీలు లేని ఇళ్లలో నివసించడం, పార్కులు లేకపోవడం, ఆడుకోవడానికి తోటి పిల్లలు లేని వాతావరణంలో జీవించడం, ఇవన్నీ ఉన్నా పిల్లలతో గడిపే సమయం తల్లిదండ్రులకు లేకపోవడం... వీటన్నింటి వల్ల పిల్లలకు స్కూల్, ఇల్లు కాకుండా తెలిసింది ఒకే ఒక్కటి. సెల్‌ఫోన్. పిల్లలకు సెల్ఫోన్లు ఇచ్చి వారు వాటిలో కూరుకుపోతే ‘అమ్మయ్య. మా జోలికి రావడం లేదు’ అనుకునే తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆటలు, విహారం, అనుబంధాల విలువ, కొత్త విషయాల ఎరుక ఎలా కలుగుతుంది?అందుకే వేసవి సెలవలు ఒక పెద్ద అవకాశం. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు తెలుగు ్రపాంతాలలో వేసవి సెలవులు వస్తే పిల్లలు ఎలా గడిపేవారో ఇప్పుడూ అలా గడిపే అవకాశం కల్పించవచ్చు. కాకుంటే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలను మోటివేట్ చేయాలి.బంధువులు– బంధాలు..బంధువులు ఎవరో తెలియకపోతే బంధాలు నిలవవు. ఎంత స్వతంత్రంగా జీవిద్దామనుకున్నా, సాటి మనుషుల విసిగింపును తప్పించుకుని తెగదెంపులు చేసుకుని బతుకుదామనుకున్నా మనిషి సంఘజీవి. అతడు బంధాలలో ఉండాల్సిందే. బంధాల వల్ల బతకాల్సిందే. పిల్లలకు బంధాలు బలపడేది, బంధాలు తెలిసేది వేసవి సెలవుల్లోనే. ఇంతకు ముందు పిల్లలు వేసవి వస్తే తల్లిదండ్రులను వదిలిపెట్టి పిన్ని, బాబాయ్, పెదనాన్న, తాతయ్య... వీళ్ల ఇళ్లకు వెళ్లి రోజుల తరబడి ఉండేవారు. వారి పిల్లలతో బంధాలు ఏర్పరుచుకునేవారు.దీని వల్ల కొత్త ఊరు తెలిసేది. ఆటలు తెలిసేవి. కలిసి వెళ్లిన సినిమా అలా ఓ జ్ఞాపకంగా మిగిలేది. ఇవాళ పెద్దల పట్టింపులు పిల్లలకు శాపాలవుతున్నాయి. రాకపోకలు లేని బంధుత్వాలతో పిల్లలు ఎక్కడకూ వెళ్లలేని స్థితి దాపురించింది. దీనిని సరి చేయాల్సిన బాధ్యత పెద్దలదే. లేకుంటే పిల్లలు ఫోన్లనే బంధువులుగా భావించి అందులోని చెత్తను నెత్తికెక్కించుకుంటారు. జీవితంలో సవాళ్లు ఎదురైన సమయంలో ఒంటరితనం ఫీలయ్యి అతలాకుతలం అవుతారు.తెలుగు ఆటలు..సెలవుల్లో పిల్లలకు తెలుగు ఆటలు తెలియడం ఒక పరంపర. బొంగరాలు, గోలీలు, వామనగుంటలు, పరమపదసోపాన పటం, ఒంగుళ్లు–దూకుళ్లు, నేల–బండ, ఏడుపెంకులాట, పులి–మేక, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడిపండు, లండన్ ఆట, రైలు ఆట, ΄÷డుపుకథలు విప్పే ఆట, అంత్యాక్షరి, కళ్లకు గంతలు... ఈ ఆటల్లో మజా తెలిస్తే పిల్లలు ఫోన్ ముట్టుకుంటారా?కథ చెప్పుకుందామా..కథలంటే పిల్లలకు ఇష్టం. పెద్దలు చె΄్పాలి గాని. ఈ సెలవుల్లో రాత్రి పూట భోజనాలయ్యాక, మామిడి పండ్లు తిన్నాక, పక్కలు వేసుకుని అందరిని కూచోబెట్టి పెద్దలు కథలు చెప్తే ఎన్నెన్ని తెలుస్తాయి! ఎన్ని ఊహల కవాటాలు తెరుచుకుంటాయి. మర్యాద రామన్న, తెనాలి రాముడు, బేతాళుడు, సింద్బాద్, ఆలీబాబా, పంచతంత్రం, రామాయణం, మహాభారతం... భీముడిలోని బలం, అర్జునుడిలోని నైపుణ్యం... ఇవి కదా చె΄్పాలి.బలం కోసం తిండి..పిల్లలను సరిగ్గా గమనించి వారికి కావలసిన బలమైన తిండి తినిపించడానికి వీలయ్యేది ఈ సెలవుల్లోనే. బలహీనంగా ఉండే పిల్లలు, ఎదిగే వయసు వచ్చిన ఆడపిల్లలకు ఏమేమి వొండి తినిపించాలో పెద్దల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ కాలంలో తినిపిస్తారు. శిరోజాల సంరక్షణ, చర్మ సంరక్షణ, పంటి వరుస సరి చేయించడం, జీర్ణశక్తిని ఉద్దీపన చేయడం, బంధువుల రాక వల్ల లేదా బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల పిల్లలందరికీ కలిపి వారికి వృద్ధి కలిగించే ఆహారం చేసి పెట్టవచ్చు. తోటి పిల్లలు పక్కన ఉంటే ఇష్టం లేకపోయినా పిల్లలు తింటారు.సెలవులొచ్చేది పిల్లల మానసిక, శారీరక వికాసానికి. కదలకుండా మెదలకుండా ఫోన్ పట్టుకుని కూచుని వారు ఈ సెలవులు గడిపేస్తే నింద తల్లిదండ్రుల మీదే వేయాలి... పిల్లల మీద కాదు.ఇవి చదవండి: Indian Navy Women Officers: సముద్రంపై సాహస సంతకం -
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
వేసవి ఉష్ణోగ్రత పెరగనుంది.. జర జాగ్రత్త! : వాతావరణశాఖ హెచ్చరిక
ప్రతిరోజూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా.. 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం 40 నుంచి 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇకపై ఈ ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎండ తీవ్రత ఇలా.. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు కొంత హెచ్చతగ్గులతో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత ప్రారంభం కాగా.. మార్చి ఆరంభంలో 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉన్నా ఈసారి మాత్రం 35 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మూడో వారానికి 40 డిగ్రీలు దాటగా, ఏప్రిల్ మొదటి వారంలో మరింతగా పెరిగాయి. ఏప్రిల్ 7న కొన్ని చోట్ల 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆతర్వాత మధ్యలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈనెల రెండో వారం నుంచి సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇప్పటికే వడదెబ్బల ఘటనలు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో ఎలాంటి మార్పు లేకుండడంతో రాబోవు ముందు రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశంఉందని, తగిన జాగ్రత్తలో పాటు, ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు వైద్యులని సంప్రదించాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవి చదవండి: వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్! -
నెల ముందే.. నిప్పులు చెరిగే సూరీడుతో.. జర జాగ్రత్త!
మే నెలకు ముందే సూరీడు నిప్పులు కక్కుతుండటం ఆందోళనకర పరిణామం. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు ప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 41–45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్ అలర్ట్‌గా భావించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని.. అలాగే 45కు పైగా ఉష్ణోగ్రత చేరిందంటే.. మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు, రెడ్ అలర్ట్‌గా నిపుణులు చెబుతున్నారు. గత అయిదు రోజులుగా ఉష్ణోగ్రతల తీరిలా. ఎండ ప్రభావం.. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలపైనా ప్రభావముంటుంది. వేడి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పొలాల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పండ్ల తోటలకు కొంత నష్టం కలిగే అవకాశముంది. – డా.జి.మంజులత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం రైతులు ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాధారణ ప్రజలు ఈ ఎండలకి అల్లాడిపోతున్నారు. శనివారం ఎండ తీవ్రత 44 డిగ్రీలు నమోదు కాగా.. ఆదివారం కూడా 44 డిగ్రీలు దాటింది. గతేడాది ఇదే సమయంలో పలుచోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే రీతిలో నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. అసలే వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో ఎండలు దంచి కొడుతుండటంతో రైతులు ఉదయం 6 గంటలకు వెళ్లి 9 గంటలకే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పగటి పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితేనే బయటకి వస్తున్నారు. వ్యవసాయం పరంగా పంటలు చివరి దశకు చేరడంతో ఎండిపోయే ప్రమాదం కనపడుతోంది. రోజురోజుకి మారుతున్న ఎండ తీవ్రత నుంచి, వీచే వడగాలుల నుంచి జాగ్రత్తలు వహించక తప్పదు. దాహానికి తగ్గ పానీయాలు సేకరించాలి. చిన్న పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇకపై ఈ ఎండలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇవి చదవండి: సోమావతి అమావాస్య అంటే..రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు? -
Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా..
వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్. సరైన సమయంలో గుర్తించకపోతే ఇదిప్రాణాపాయానికి కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదు. శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగాలంటే ద్రవపదార్థాలు తగినన్ని ఉండడం అవసరం. ఒకోసారి రకరకాల కారణాల వల్ల శరీరంలోని ద్రవపదార్థాలు ముఖ్యంగా నీటి శాతం బాగా తగ్గిపోయి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒకోసారిప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు మరీ ఎక్కువ. అందువల్ల డీ హైడ్రేషన్‌ని నివారించేందుకు ఈ చిట్కాలు. డీ హైడ్రేషన్ గురికాకుండా ఉండాలంటే కనీసం రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. దాహంగా అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే నీరు తాగాలి. డీహైడ్రేషన్ కు గురయ్యామని సూచించే మొట్ట మొదటి సంకేతం ’దాహం’ అనిపించటం. డీ హైడ్రేషన్‌ను ఎలా గుర్తించాలంటే..? నోరంతా పొడిబారినట్లు, బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్నా తీవ్రమైన డీహైడ్రేషన్ ఎదుర్కోబోతున్నట్లు సంకేతంగా భావించాలి. తీవ్ర అలసట, నిద్ర పోవాలనే కోరిక ఉండడమూ డీ హైడ్రేషన్ లక్షణాలే. అలా ఉన్నప్పుడు చాలామంది నిద్రకు ఉపక్రమిస్తారు. దానికి బదులుగా వెంటనే కొంచెం మంచి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. భరించరాని తలనొప్పి కూడా డీహైడ్రేషన్ ను తెలియజేసే సాధారణ లక్షణం. సాధారణంగా కండర తిమ్మిర్లు శరీరంలో ఎలక్ట్రోలేట్ స్థాయుల అసమతుల్యతకు కారణంగా చెబుతారు. అయితే ఇది కూడా డీహైడ్రేషన్ ను సూచించే మరొక గుర్తు. కొంత శారీరక శ్రమను చేసిన తర్వాత హఠాత్తుగా చెమట పట్టడం నిలిచిపోతే, వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. డీహైడ్రేషన్ ను తెలియచేసే తీవ్రమైన సంకేతాల్లో ఇది ఒకటి. ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్‌కు సంకేతాలు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. ఇవేవీ అందుబాటులో లేనప్పుడు కనీసం వెంటనే నీటిని తాగడం కూడా ప్రమాద నివారణకు సహకరిస్తుంది. చర్మం సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అంటే చర్మాన్ని పట్టుకుని లాగి వదిలితే వెంటనే వెనక్కి వెళ్లకుండా పైన నిలిచినట్లుగా ఉండే ఈ సమస్యలో ఉన్నట్లే భావించాలి. అస్పష్టమైన కంటిచూపు కూడా డీహైడ్రేషన్ సూచించే ఒక గుర్తు. రక్తంలో తక్కువ చక్కెర స్థాయులు ఉన్నప్పుడు కూడా అస్పష్టమైన కంటిచూపు కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా నిర్ణీత సమయానికి భోజనం చేయలేకపోతే వెంటనే గ్లూకోజ్ నీరు తాగాలి. సులువుగా చేయగలిగేది తగినన్ని నీళ్లు తాగడం. కనీసం అదైనా సరిగా చేస్తుంటే ప్రమాదాన్ని నివారించిన వారమవుతాం. ఇవి చదవండి: ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే -
ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త!
మొన్నమొన్నటి దాకా చల్లగా సాగిన ప్రయాణం ఇప్పుడు వేసవి కొలిమికి సిద్ధమైంది. సమ్మర్ వార్తలు కొంతకాలంగా డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. ఓ వైపు వాతావరణంలో మొదలైన మార్పులు, మరోవైపు నిపుణుల హెచ్చరికలు తెలియకుండానే గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక నుంచి ఏం తిన్నా, ఏం తాగినా ఆపసోపాలే! ఎటు వెళ్లినా, ఎక్కడాగినా నీరసాలు, నిట్టూర్పులే! మరి ఈ ఎండాకాలాన్ని ఎలా దాటెయ్యాలి? ఈ వేసవి తాపానికి డీహైడ్రేషన్, వడదెబ్బ, కళ్లు తిరగడం, నీరసం, వాంతులు, జీర్ణసమస్యలు ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇతర కాలాల్లో అనారోగ్యం వస్తే.. ఏదో ఒకటి తిని, ఓ టాబ్లెట్ వేసుకుంటే.. ప్రశాంతంగా నిద్రైనాపోవచ్చు. కానీ ఈ ఎండాకాలంలో నిద్ర కూడా పట్టదు. పరచుకున్న పరుపులోంచి, మూసి ఉన్న తలుపుల్లోంచి వేడి తన్నుకొచ్చి.. కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటి వడగాల్పులను తట్టుకోవాలంటే.. చలువ చేసే ఆహారాలు, చల్లబరచే పానీయాలను పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తినేవాటిలో ఆయిల్ లెస్, తాగేవాటిలో సుగర్ లెస్ తప్పదంటున్నారు. జంక్ ఫుడ్‌కి, సాఫ్ట్ డ్రింక్స్‌కి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు. నిజానికి వేసవిలో ఎక్కువగా తినాలనిపించదు. ఆరారగా పానీయాలు తాగాలనిపిస్తుంది. అసలు తినడానికైనా, తాగడానికైనా ఏవేవి మంచివో చూద్దాం. ఎండాకాలం ఆహారాలు దోసకాయ, పుచ్చకాయ, మామిడిపండు, అరటిపండు, బొప్పాయి, అనాసకాయ ఇలా ప్రతి పండూ వేసవిలో ఆస్వాదించతగ్గదే! వాటిలోని వాటర్ కంటెంట్ బాడీలోని ఉష్ణోగ్రతల స్థాయిని తగ్గిస్తాయి. అలాగే అరుగుదల సజావుగా చేసి.. జీర్ణకోశాన్ని తేలికపరుస్తాయి. ఆయా పండ్లతో చిక్కగా జ్యూసులు చేసుకుని తాగొచ్చు. భోజనం విషయానికి వస్తే ఆకుకూరలు, కూరగాయలకే పోపు పెట్టడం మంచిది. సమ్మర్లో మాంసం, చేపలు వంటివి తినడం వల్ల అరుగుదల ఆలస్యం అవుతుంది. కడుపు బరువుగా మారుతుంది. నాన్‌వెజ్ వంటకాల్లో నూనె, మసాలా వంటివి ఎక్కువగా వాడాల్సి రావడంతో అవన్నీ వేసవి కాలంలో జీర్ణక్రియ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తినేటప్పుడు తేలికగా అరిగేవి ఎంచుకోవాలి. వేపుళ్లు తినడం వల్ల వడదెబ్బను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి, ఆ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా నీరు, జావలు, జ్యూసులు, ద్రవాహారాలను తీసుకోవాలి. డబ్ల్యూఎంఓ హెచ్చరిక ఈ వేసవి మూడునెలలు మండుతున్న కుంపటే అని మన వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్నే ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) కూడా వెల్లడించింది. ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. గత ఏడాది జూన్‌లో ‘ఎల్ నినో’ ఏర్పడిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉండబోతున్నాయని వెల్లడించింది. ఇవి అస్సలు తినొద్దు... కెఫీన్, ఆల్కహాల్: ఈ రెండూ బాడీని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. అందుకే వేసవిలో కాఫీ, టీలతో పాటు మద్యానికీ దూరంగా ఉండటం ఉత్తమం. స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ చెమటలు పుట్టిస్తాయి. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఉక్కబోతల వాతావరణంలో మరింత వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు బాడీని ఎక్కువగా డీహైడ్రేషన్‌కి గురిచేస్తాయి. ఇలాంటివి తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తుంది. కొవ్వు పదార్థాలు: కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాని వల్ల నీరసంగా, అలసటగా ఉంటుంది. అరుగుదల లోపంతో తెలియకుండానే ఆపసోపాలు మొదలవుతాయి. వేసవి పానీయాలు సాధారణంగా ఎండాకాలంలో నీళ్లు ఎక్కువ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే ‘ఉత్త నీళ్లు ఎన్నని తాగుతాం‘ అనుకునేవారు ’ఇలా చిటికెలో అయ్యే చలవ పానీయాలను తయారుచేసుకుని తాగండి’ అంటున్నారు నిపుణులు. అయితే పంచదారకు బదులుగా తేనె వాడుకోవడం మంచిది. తేనె లేని సమయంలో తక్కువ మోతాదులో బెల్లం పాకం వాడుకోవచ్చు. సబ్జా నీళ్లు.. ఈ సమ్మర్ సీజన్ లో సబ్జా నీళ్లు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే పెక్టిన్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ సీజన్లో సబ్జా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి సమస్యలు దరిచేరవు. అందుకే నీళ్లలో సబ్జా వేసుకుని తాగడం మంచిది. తేనె– నిమ్మరసం నీళ్లు ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మచెక్కను పిండుకుని, ఒకటిన్నర లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి తాగొచ్చు. ఇది తక్షణశక్తిని అందిస్తుంది. ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపున తాగితే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, తలనొప్పి వస్తున్నప్పుడు ఈ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. సోంపు నీళ్లు సోంపులో ఈస్ట్రాగోల్, అనెథాల్, ఫెంకోన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచి, జీర్ణ సమస్యలను దూరం చేసి పొట్టను తేలికగా ఉంచుతాయి. వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తేనె లేదా బెల్లం పాకం కలిపి తీసుకుంటే మంచిది. కొబ్బరి బోండం.. కొబ్బరి నీళ్లు ఎల్లప్పుడూ బాడీని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉండే ఈ సహజపానీయం వేసవిలో వేడిని తట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే వీలైనప్పుడల్లా కొబ్బరి నీళ్లు సేవించడం మంచిది. జీలకర్ర నీళ్లు.. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు, పోషకాలు చాలానే ఉంటాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ వాటర్ వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. సమ్మర్లో రాత్రిపూట జీలకర్రను నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఏలకుల నీళ్లు ఏలకుల్లోని ఔషధ గుణాలు.. బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. కడుపులో వేడి, మంట, వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. ఒక గ్లాసుడు వేడి నీళ్లల్లో ఏలకుల్ని దంచి వేసుకుని, బాగా కలుపుకుని, వడకట్టి తాగాలి. అభిరుచిని బట్టి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ నీళ్లు శరీరంలో వేడిని వేగంగా తగ్గిస్తాయి. మెంతుల నీళ్లు మెంతుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్ , పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని మెంతుల్ని గ్లాసు నీళ్లల్లో నానబెట్టి, వడకట్టుకుని తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి, చల్లబడుతుంది. దనియాల నీళ్లు ఒక టీస్పూన్ దనియాలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి, వడగట్టుకుని పది నిమిషాల పాటు మరిగించి, చల్లార్చుకుని తాగితే మంచిది. దనియాల్లోని పైబర్ జీర్ణక్రియను సరిచేస్తుంది. అలాగే ఈ వాటర్.. బాడీలోని టాక్సిన్స్‌ను తొలగించి.. చల్లదనాన్ని అందిస్తుంది. మజ్జిగ.. వేసవికి అసలు సిసలు చల్లదనం మజ్జిగతోనే వస్తుంది. కొద్దిగా పెరుగు తీసుకుని నిమ్మరసం, చిటికెడు ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని, గిలక్కొట్టి అందులో ఓ గ్లాసుడు నీళ్లు కలిపితే చాలు, మజ్జిగ రెడీ. కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే కడుపులో చల్లగా ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో బాడీలోకి నీటిని పంపితే వేసవి తాపం నుంచి ఇట్టే బయట పడొచ్చు. అలాగే ఫ్రిజ్‌లో వాటర్ కంటే మట్టికుండను ఇంట్లో పెట్టుకోవడం మంచిది. చర్మసంరక్షణ అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం సహజత్వాన్ని కోల్పోయి దెబ్బతింటుంది. మొటిమలు రావడం, ముఖం కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం, సాయంత్రం తప్పకుండా చల్లటి నీళ్లతో స్నానం చెయ్యాలి. ముఖాన్ని నీళ్లతో కొట్టినట్లుగా కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు అయినా నేచురల్ స్క్రబ్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మృతకణాలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. చెమట కారణంగా వచ్చే దుర్వాసన తగ్గుతుంది. క్రీమ్స్ అండ్ లోషన్స్ సాధారణంగా మాయిశ్చరైజర్ శీతాకాలంలో మాత్రమే అవసరం అనుకుంటాం. కానీ వేసవిలో వేడిని తట్టుకోవడానికి కూడా మాయిశ్చరైజర్ అవసరం అంటారు నిపుణులు. చర్మసంరక్షణలో భాగంగా సమ్మర్ క్రీమ్స్ వాడితే మంచిది. బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరచిపోవద్దు. అది సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మంలోని తేమను కాపాడుతుంది. హెయిర్ కేర్ ఎవరికైనా కురులే ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి. కానీ వేసవి వచ్చేసరికి చెమటకు, ఉక్కపోతలకు ఆ కురులే విసుగుపుట్టిస్తుంటాయి. అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వేసవిలోనూ జుట్టు ఆరోగాన్ని కాపాడుకోవచ్చు. పొడవాటి జుట్టున్నవారు పైకి ముడిపెట్టుకునేటప్పుడు జాగ్రత్తపడాలి. చిక్కులు పడకుండా అనువైన క్లిప్స్ వాడుకోవాలి. స్విమ్మింగ్ పూల్‌లో కాని, బీచ్‌లో కాని తల తడిసినప్పుడు ఇంటికి వచ్చి మంచి నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేదంటే వెంట్రుకలు పొడిబారిపోయి బలహీనంగా,పెళుసుగా మారతాయి. కెమికల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలు వాడటం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. తల స్నానం చేసేటప్పుడు, చేసిన తర్వాత కురులను బలంగా రుద్దకూడదు. బాగా ఆరిన తర్వాతే జుట్టుని అల్లుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు జుట్టుకి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. తల స్నానం తర్వాత వెంట్రుకలకు కండిషనర్ వాడటం మంచిది. గొడుగైనా.. హ్యాట్ అయినా.. ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోవడంతో బయటకి వెళ్లేప్పుడు తగుజాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయితే వేసవికి మరిన్ని జాగ్రత్తలు అసవరం అంటున్నారు నిపుణులు. వేసవిలో ప్రయాణాలు అంత మంచివి కావు. తప్పనిసరి అయితే మాత్రం వెంట తీసుకుని వెళ్లాల్సిన లిస్ట్ ఇదే. ఒక వాటర్ బాటిల్, ఒక గొడుగు లేదా హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్కార్ఫ్ లేదా హెడ్ బ్యాండ్ మాస్క్.. ఇవన్నీ వెంట తీసుకుని వెళ్లాల్సినవే. మొత్తానికీ ఈ వేసవి చల్లగా ఉండాలంటే ‘లైట్ ఫుడ్, లాట్ ఆఫ్ లిక్విడ్స్’ అనే పాలసీని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఉంటే కుండలో నీళ్లనే తాగాలి. బయటికి వెళ్తే కూలింగ్ గ్లాసెస్ పెట్టాలి. మన సంగతి సరే! పాపం మనతో పాటు జీవించే జంతువులు, పక్షులకూ ఈ వేసవి ప్రాణసంకటమే! కాస్త వాటి దాహాన్నీ తీర్చే ప్రయత్నం చేయాలి. ఇంటి ముందు చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెడదాం. నాలుగు ధాన్యపు గింజలు ప్లేటులో వేసి, గోడ మీద పెడదాం. ఇవి చదవండి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు! -
'మార్చి' వచ్చింది.. బోండాం 'కొట్టు..'
‘కొబ్బరి నీళ్ల జలకాలాడి కోనాసీమ కోకాగట్టి’... అని రాశాడు వేటూరి. కొబ్బరి నీళ్లతో జలకాలాడే భాగ్యం సామాన్యుడికి లేదు. పూర్వం కొన్ని బావుల్లో నీళ్లు కొబ్బరి నీళ్లలా అనిపించేవి. జనానికి ఆ బావి ఫేవరెట్‌గా ఉండేది. ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ముళ్లపూడి వెంకట రమణ అన్నట్టు ఎన్ని బిస్లరీ బాటిళ్ల నీళ్లైనా ఒక్క కొబ్బరిబోండాంకు సమానం కావు. సృష్టి మొత్తం మీద గర్భాన తియ్యటి, శుభ్రమైన నీళ్లను దాచుకున్న కాయ కొబ్బరికాయ మాత్రమే. పండ్ల రసాలు తయారు చేసేటప్పుడు ఏదో ఒక మేరకు ఇన్ఫెక్ట్ కావచ్చు. కాని కొబ్బరినీళ్లను కలుషితం చేయలేము. అందుకే వేసవి వచ్చిందంటే ఎండలో కాయకష్టం చేసేవారికి, రోజంతా రోడ్ల పై తిరిగే సన్న జీవులకి, కార్లలో తిరిగే కలిగిన వారికీ కూడా కొబ్బరినీళ్లు ప్రాణధార. అదేమిటోకాని కొన్ని విషయాలు విశ్వామిత్రుడి అకౌంట్లో పడ్డాయి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం కొబ్బరికాయ బ్రహ్మదేవుని సృష్టి కాదట. విశ్వామిత్రుడిది అట. ఎవరు సృష్టించినా భారతీయులకు కొబ్బరికాయ లేకుండా పూట గడవదు. భక్తి కలిగిన వారికి పూజల్లో, జఠరాగ్ని కలిగిన వారికి వంటల్లో కొబ్బరి తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి మార్చి వచ్చిందంటే గెలలు గెలలుగా దిగే కాయ కత్తికి సర్రున తెగుతూ తన నీటితో జిహ్వకు జీవం పోస్తుంది. కాని కొబ్బరి నీళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకొని ఉండి వాటిని సేవించడం మంచిది. ప్రయోజనాలు.. కొబ్బరి నీళ్లు పోషకాలు, ఎలక్ట్రోలైట్లను ఇస్తాయి. ఒక రకంగా కొబ్బరి నీళ్లు నోటి ద్వారా ఒంట్లో చేరే సెలైన్బాటిల్తో సమానం. మన శరీరానికి రోజుకు కనీసం 280 మిల్లిగ్రాముల సోడియం కావాలి. ఒక కొబ్బరిబోండాంలో దాదాపు 300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అంటే శరీరానికి కావాల్సిన సోడియం రోజుకు సరిపడా అందినట్టే. ఇక పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లు ఉత్తమ లవణ జలం. వీటిని మధ్యాహ్న భోజనానికి ఒక గంట ముందు, లేదా సాయంత్రం వేళల్లో తీసుకుంటే మంచిది. వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి కొబ్బరినీళ్లు ఉత్తమ సహాయకారి. ఎండల్లో వాంతులు, విరేచనాలు అవుతుంటే కొబ్బరినీళ్లను మెల్లమెల్లగా ఎక్కువసేపు తాగితే శరీరం పుంజుకుంటుంది. ఎండ వల్ల చర్మం టాన్ అయితే కొబ్బరినీళ్లతో బాగా రుద్దితే ఆ టాన్ పోతుంది. ముఖంపై మొటిమలు ఉంటే కొబ్బరినీళ్లలో ముంచిన దూదితో శుభ్రం చేస్తే అవి పోతాయి. వేసవిలో చెమట వల్ల వచ్చే దుర్వాసన పోవాలంటే కొబ్బరినీళ్లు తాగాలి. జీర్ణక్రియకు మంచిది. కొబ్బరినీళ్లలో ఉన్న పొటాషియం బీపీని నియంత్రించడానికి, కిడ్నీల పని తీరుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లలో యాలకుల పొడి చిటికెడు వేసుకుని తాగితే అరికాళ్లలో మంటలు తగ్గుతాయి. ‘దేహమే దేవాలయం’ అన్నారు. దేవాలయంలో కొబ్బరికాయ కొడితే ఏ ఆధ్యాత్మిక ఫలితాలు కలుగుతాయో, కొబ్బరినీళ్లు తాగితే దేహమనే దేవాలయానికి అవే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి చదవండి: వయాగ్రా..! నవజాత శిశువుల పాలిట వరం!


