జిరాక్స్‌ మెషిన్‌ | Xerography Invented by Chester Carlson | Sakshi
Sakshi News home page

జిరాక్స్‌ మెషిన్‌

Jun 5 2026 2:32 AM | Updated on Jun 5 2026 2:32 AM

Xerography Invented by Chester Carlson

చిన్నారులూ.. జిరాక్స్‌ మెషిన్‌ మనందరికీ తెలుసు కదా! స్కూల్‌ ప్రాజెక్ట్‌ కోసమో, నోట్స్‌ కోసమో మనం తరచూ జిరాక్స్‌ తీయిస్తుంటాం. మరి మీరెపుడైనా ఆలోచించారా? ఈ జిరాక్స్‌ మెషిన్ ను ఎవరు కనిపెట్టారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి అని? 

1930లలో చెస్టర్‌ కార్ల్సన్‌ అనే అమెరికాకు చెందిన ఒక లాయర్‌ ఉండేవాడు. ఆయనకు ఆఫీసులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే... ఏదైనా పేపర్‌ కావాలంటే దాన్ని చూసి మళ్లీ చేత్తో రాయడం లేదంటే టైప్‌ చేయడం. దీనికి చాలా సమయం పట్టేది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన చాలా ఆలోచించాడు. ఒక పేపర్‌ను ఉన్నది ఉన్నట్లుగా క్షణాల్లో కాపీ చేసే మెషిన్‌ ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. 

కార్ల్సన్‌ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌  ఉన్నవాడు కావడంతో రకరకాలుగా ప్రయోగాలు చేసి, 1938 అక్టోబర్‌ 22న ఆయన ప్రపంచంలోనే మొదటి ఫోటోకాపీని విజయవంతంగా తీశాడు. ఈ టెక్నాలజీకి గ్రీకు పదాల ఆధారంగా జిరోగ్రఫీ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో జిరోస్‌ అంటే ‘పొడి’, గ్రాఫియా అంటే ‘రాత’ అని అర్థం. అంటే సిరా లేకుండా రాసే పద్ధతి అన్నమాట. ఆ తర్వాత కాలక్రమంలో ‘జిరాక్స్‌’గా మారిపోయింది. మరో విశేçషం ఏమిటంటే మొదట్లో వచ్చిన జిరాక్స్‌ మిషన్‌ దాదాపు ఒక పెద్ద ఫ్రిజ్‌ అంత పరిమాణంలో ఉండేది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement