Xerox machine
-
జిరాక్స్ మెషిన్
చిన్నారులూ.. జిరాక్స్ మెషిన్ మనందరికీ తెలుసు కదా! స్కూల్ ప్రాజెక్ట్ కోసమో, నోట్స్ కోసమో మనం తరచూ జిరాక్స్ తీయిస్తుంటాం. మరి మీరెపుడైనా ఆలోచించారా? ఈ జిరాక్స్ మెషిన్ ను ఎవరు కనిపెట్టారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి అని? 1930లలో చెస్టర్ కార్ల్సన్ అనే అమెరికాకు చెందిన ఒక లాయర్ ఉండేవాడు. ఆయనకు ఆఫీసులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే... ఏదైనా పేపర్ కావాలంటే దాన్ని చూసి మళ్లీ చేత్తో రాయడం లేదంటే టైప్ చేయడం. దీనికి చాలా సమయం పట్టేది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన చాలా ఆలోచించాడు. ఒక పేపర్‌ను ఉన్నది ఉన్నట్లుగా క్షణాల్లో కాపీ చేసే మెషిన్ ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కార్ల్సన్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో రకరకాలుగా ప్రయోగాలు చేసి, 1938 అక్టోబర్ 22న ఆయన ప్రపంచంలోనే మొదటి ఫోటోకాపీని విజయవంతంగా తీశాడు. ఈ టెక్నాలజీకి గ్రీకు పదాల ఆధారంగా జిరోగ్రఫీ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో జిరోస్ అంటే ‘పొడి’, గ్రాఫియా అంటే ‘రాత’ అని అర్థం. అంటే సిరా లేకుండా రాసే పద్ధతి అన్నమాట. ఆ తర్వాత కాలక్రమంలో ‘జిరాక్స్’గా మారిపోయింది. మరో విశేçషం ఏమిటంటే మొదట్లో వచ్చిన జిరాక్స్ మిషన్ దాదాపు ఒక పెద్ద ఫ్రిజ్ అంత పరిమాణంలో ఉండేది! -
‘వేలు’ పెడితే కోట్లొస్తాయ్!
హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రికి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఓ జిరాక్స్ మిషన్ కారణంగా ఆగిపోయాయంటే నమ్మగలరా..! కానీ.. నమ్మాల్సిందే.. అక్షరాలా రూ.6 కోట్లు వివిధ సంస్థల నుంచి నిమ్స్‌కు రావాల్సి ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం ఈహెచ్ ఎస్ స్కీం ద్వారా నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వచ్చి చికిత్స పొందుతారు. ఇలా చికిత్స పొందిన వారిలో ఆర్టీసీ, బీఎస్ఎన్ఎల్, సీజీహెచ్, సింగరేణి, రైల్వే, ఈఎస్ఐతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు ఉన్నారు. వారికి అవసరమైన చికిత్స నిర్వహించిన అనంతరం అందు కు సంబంధించిన బిల్లులను నిమ్స్ యాజమాన్యం ఆయా సంస్థలకు పంపి వసూలు చేస్తుంది. జిరాక్స్ మిషన్‌ను బాగుచేసేందుకు కేవలం రూ.13వేలు మాత్రమే అవుతాయి. కానీ ఆస్పత్రి ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం తో నాలుగు నెలలుగా అది మూలకు పడింది. ఎందుకీ దుస్థితి.. నిమ్స్ స్పెషాలిటీ బ్లాకులో క్రిడెట్ కలెక్షన్ యూనిట్ (సీసీయూ)ఉంది. ఆస్పత్రిలో ఈహెచ్ఎస్ ద్వారా చికిత్స పొందిన వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను ఆయా సంస్థలకు పంపి వసూలు చేయాలి. అందుకు వారికి వచ్చిన బిల్లులను నకళ్లను తీసి క్లెయిమ్ కోసం పంపించాల్సి ఉంటుంది. అందుకోసం 2011లో జిరాక్స్ మిషన్‌ను నిమ్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీనికి సంబంధిత తయారీ సంస్థ ఇచ్చిన లైఫ్ 6 లక్షల కాఫీలకు మాత్రమే. అయితే సుమారు 10 లక్షల కాఫీలను తీసి మిషన్ అలసిపోయింది. నాలుగు నెలలుగా జిరాక్స్ మిషన్ మూలకు పడి ఉంటోంది. ఎమ్మార్డీ నుంచి క్రిడెట్ కలెక్షన్ యూనిట్‌కు రాని బిల్లుల ఫైళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి బిల్లులను ఎమ్మార్డీ యూనిట్‌కు పంపుతారు. అక్కడ నుంచి క్రిడెట్ కలెక్షన్ యూనిట్‌కు రావాల్సి ఉంది. అయితే చాలా ఫైళ్లు క్రిడెట్ కలెక్షన్ యూనిట్ రావాల్సిఉందని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఎంతో విలువైన ఫైళ్లను నిర్లక్ష్యంగా సిబ్బంది నేలపై పడేశారు. వాటిలో కోర్టు కేసులకు సంబంధించిన మెడికో లీగల్ ఫైళ్లు ఉన్నాయి. అక్కడ ర్యాకులు లేకపోవడంతో.. వర్షం వస్తే ఫైళ్లు తడిసిపోతున్నాయి. -
నకిలీ నోట్ల తయారీ కేసులో ఇద్దరి అరెస్టు
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవిలో కలర్ జిరాక్స్ మిషన్‌తో నకిలీ రూ.2వేల నోట్లను తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ రూరల్ సీఐ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. కురవి మండలం తట్టుపల్లి శివారు చంద్యాతండాకు చెందిన మైనర్ గత ఆదివారం స్థానిక పెట్రోల్ బంకులో నకిలీ రూ.2వేల నోటు ఇచ్చి పె ట్రోల్ పోరుుంచుకున్నాడు. అక్కడి వారు నకిలీ నోటుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తనకు నారాయణ పురం గ్రామానికి చెందిన తేజావత్ ప్రమోద్ నోటు జిరాక్స్ ఇచ్చినట్టు చెప్పా డు. ప్రమోద్ కురవిలో జిరాక్స్ సెంటర్ నడుపుతున్నాడు. ఇటీవల విడుదలైన కొత్త రూ.2వేల నోటును బ్యాంకు నుంచి డ్రా చేసిన ప్రమోద్.. కొత్త నోటు ఇంకా ప్రజల్లోకి చేరకపోవడంతో సదరు నోటును జిరాక్స్ చేసి బాలుడికి ఇచ్చాడు. నోటు చెల్లించుకొని వస్తే చెరిసగం పంచుకుందా మని చెప్పాడు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన బాలుడు దొరికిపోయాడు. అతడిచ్చిన సమాచారం మేరకు ప్రమోద్ ను పోలీసులు అరెస్టు చేశారు. -
మాయదారి పెన్ను : రాసింది రాసినట్టే మాయం!!


