కెనడాకు ట్రంప్ షాక్.. 50 శాతం టారిఫ్‌ల మోత | world news us imposes new 50 tariffs on certain canadian goods | Sakshi
Sakshi News home page

కెనడాకు ట్రంప్ షాక్.. 50 శాతం టారిఫ్‌ల మోత

Jul 21 2026 5:00 AM | Updated on Jul 21 2026 11:53 AM

world news us imposes new 50 tariffs on certain canadian goods

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించారు.  కెనడాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై 50 శాతం మేర దిగుమతి సుంకాలను విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ కొత్త పన్నులు 30 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.

కెనడా,అమెరికాకు చెందిన ఆల్కహాల్ , ఆటోమొబైల్స్, డెయిరీ ఉత్పత్తుల విక్రయాల్లో విచక్షణారహితంగా  వివక్షతతో కూడిన" వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు.  ఈ నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులపై 50 శాతం పన్నులు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అయితే  ట్రంప్ విధించిన పన్నుల నుంచి ఎనర్జీ ఉత్పత్తులు , పోటాష్, చేపలు,అత్యవసర ఖనిజాలతో పాటు ప్రత్యేక సుంకాల పరిధిలోకి వచ్చే సరుకులకు ఈ కొత్త పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  అయితే, ఈ మినహాయించిన ఉత్పత్తులు తప్ప మిగతావన్నీ 'యుఎస్-మెక్సికో-కెనడా రవాణా వాణిజ్య ఒప్పందం' కింద దేశంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, వాటిపై ఈ నూతన సుంకాలు వర్తిస్తాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.

కెనడాలోని అడవుల్లో వస్తున్న భారీ కార్చిచ్చుల వల్ల అమెరికాలోని నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోందని, దానికయ్యే నష్ట పరిహారాన్ని కూడా టారిఫ్‌ల రూపంలో కెనడా నుంచే వసూలు చేస్తామని ట్రంప్ ఇటీవలే హెచ్చరించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement