ఫైర్‌పై బోర్‌ కొట్టకుండా! | Geetha Bhascker create awareness about the importance of art in a child life | Sakshi
Sakshi News home page

ఫైర్‌పై బోర్‌ కొట్టకుండా!

May 19 2026 5:59 AM | Updated on May 19 2026 5:59 AM

Geetha Bhascker create awareness about the importance of art in a child life

సమ్మర్‌ కిడ్స్‌

సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్‌ తల్లి గీతాభాస్కర్‌. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్‌ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్‌ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్‌ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్‌ఫేమ్‌’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్‌ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్‌ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాక΄ోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్‌వాల్వ్‌ అవ్వాలి. పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్‌ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.

ఏ విషయమైనా బోర్‌ కొట్టకుండా మన సంభాషణ పిల్లలతో సరదాగా ఉండాలి. పెద్దలకు కూడా ఇది ఎక్సర్‌సైజ్‌ పాఠమే అవుతుంది. ఉదాహరణకు ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా, ఫైర్‌’... సినిమాటిక్‌గా ఓ డైలాగ్‌ చేప్పండి. వెంటనే పిల్లల అటెన్షన్‌ మీ వైపు తిరుగుతుంది. అమ్మో ‘నిప్పు’ అని భయపెట్టకూడదు. ఆశ్చర్యం, జాగ్రత్త, విజ్ఞానం.. కలిపి ‘నిప్పు’ గురించి తెలుసుకునేలా ఉండాలి.

వెలుగు దీపాలు
→ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో అందంగా అలంకరించిన కేక్‌ పైన క్యాండిల్స్‌ వెలిగిస్తారు. ఆ వెలుగు ఎలా ఉంటుందో అడగండి. డ్రాయింగ్‌లో చూపమనండి.
→ కిచెన్‌లో వంట వండటానికి ఏం వాడతారో అడగండి 
→ దీపం వెలగడానికి ఏం అవసరం, లైటర్‌ ఎలా వెలుగుతుంది? 
→ ఇంధనపు వేడి వల్ల ఏయే వాహనాలు, ఇంజన్లు నడుస్తాయో గెస్‌ చేయమనండి 
→ అడవిలో మంటలు వస్తే, షార్ట్‌ సర్క్యూట్‌ జరిగితే, అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు ఏయే చోట్ల జరుగుతాయి... వాటినే చిత్రాల్లో చూపమనండి 
→ కొవ్వొత్తి వెలుగుకి గాలి లేక΄ోతే ఏమవుతుంది, వేడికి కొవ్వొత్తి ఎందుకు కరిగి΄ోతుంది, మంట ఎందుకు రెపరెపలాడుతుంది?... మన రోజువారీ పనుల్లో ‘నిప్పు’ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చెప్పమనండి.

సేఫ్టీ హీరో రోల్‌
అగ్ని ప్రమాద సమయంలో 101కు కాల్‌ చేసే వ్యక్తి, ఇంట్లో గ్యాస్‌ వాడకంలో పొదుపు, వంట చేసేటప్పుడు జాగ్రత్త పడే వాళ్లు, కాలిన గాయాలకు నివారణ ఉపాయాలు సూచించే వ్యక్తి ... వీటిలో ఏవి చేసినా ‘హీరో’నే. ఏయే వస్తువులు నిప్పును పుట్టిస్తాయి. పిల్లలు అగ్గిపెట్టె, వంటగ్యాస్‌..  మొదలైన ‘నిప్పు’ కు కారణమయ్యే వస్తువులకు దూరంగా ఎందుకు ఉండాలి.. చూపమనాలి.

నిప్పు కథలు
→ ఆదిమ మనిషి నిప్పు కనుగొన్న విధానం  
→ హనుమంతుడు లంక దహనం కథ 
→ చలి పెట్టినప్పుడు వేడికోసం మంట ఎలా ఉపయోగపడుతుంది 
→ సూర్యుడు వేడిని ఎలా పుట్టిస్తున్నాడు. వేసవిలోనే ఎందుకు అంతగా మండుతుంటాడు 
→ నిప్పుకు ఎన్ని పేర్లు ఉన్నాయి. ఏయే భాషల్లో ఎలాంటి పేర్లు ఉన్నాయి.. 

‘నిప్పు’ గురించి చేసే ఈ ప్రయోగం పిల్లలను ఆలోచింపజేస్తుంది. కొత్త విధానాల రూపకల్పన జరుగుతుంది. ఎన్నో విషయాలు ‘నిప్పు’ అనే టాపిక్‌ ద్వారా తెలియజేయవచ్చు. పిల్లల వయసు, వారు అర్ధం చేసుకుంటున్న విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ప్రోత్సహిస్తే పిల్లలు కూడా ‘నిప్పు’రవ్వల్లా మెరుస్తారు.

నిర్వహణ: నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement