గృహజ్యోతికి కరెంట్‌ షాక్‌! | - | Sakshi
Sakshi News home page

గృహజ్యోతికి కరెంట్‌ షాక్‌!

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

జిల్లాలో గృహ వినియోగదారులు 2,93,559

గృహజ్యోతి లబ్ధిదారులు 1,51446

ఐదు నెలలుగా గృహజ్యోతికి

అర్హత కోల్పోయింది 33,688

ఆలేరు రూరల్‌ : ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా జూలై నెలలో జోరుగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండాల్సింది పోయి.. భానుడు భగభగలాడుతున్నాడు. జులై నెల సగం దాటినా ఎండల తీవ్రత తగ్గకపోగా, ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు సైతం తట్టుకోలేక ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను నిరంతరాయంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా గృహ విద్యుత్‌ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. ఇది కాస్తా ఉచిత విద్యుత్‌ పథకమైన ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు భారంగా మారుతోంది.

వేసవిని తలపిస్తున్న వాతావరణం

గత ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో జూలై నాటికే జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కానీ, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్‌ ఆరంభంలో ముగియాల్సిన వేసవి తీవ్రత.. జూలై ముగింపునకు వస్తున్నా కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో గృహాల్లో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో లోడ్‌ ఎక్కువై విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు కూడా ఏర్పడుతున్నాయి.

రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్‌

గత ఏడాది మార్చి నుంచి జూన్‌ మొదటి వారం వరకు జిల్లాలో పేదల ఇళ్లలో రోజువారీ విద్యుత్‌ వినియోగం 150 మెగావాట్లను మించలేదు. కానీ ఈ ఏడాది ఎండల దెబ్బకు మే నెలలో కొన్ని రోజులు ఏకంగా 281 మెగావాట్ల అత్యధిక వినియోగం నమోదు కావడం గమనార్హం. జూన్‌, జూలై నెలల్లో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ఉచిత పరిధి దాటుతున్న మీటర్లు

జిల్లాలో మొత్తం 2,93,559 గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్ల రేషన్‌ కార్డు ఉండి, ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పొందుతున్న లబ్ధిదారులు 1,51,446 మంది ఉన్నారు. అయితే, వాతావరణ పరిస్థితుల వల్ల ఇళ్లలో కూలర్లు, ఏసీలు గంటల తరబడి ఆన్‌ చేయాల్సి వస్తుండడంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. నెలవారీ వాడకం 200 యూనిట్ల పరిధి దాటిపోతుండడంతో లబ్ధిదారులు గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారుతున్నారు. ఫలితంగా భారీగా కరెంట్‌ బిల్లులు వస్తుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

11,967

9,476

6,408

4,766

1,071

ఎల్‌నినో ఎఫెక్ట్‌

ఫ వర్షాకాలంలోనూ సుర్రుమంటున్న ఎండలు, తీవ్ర ఉక్కపోత

ఫ కూలర్లు, ఏసీల వాడకంతో పెరిగిన విద్యుత్‌ వినియోగం

ఫ 200 యూనిట్ల పరిధి దాటడడంతో లబ్ధిదారుల్లో ఆందోళన

ఐదు నెలుగా

‘గృహజ్యోతి’కి

అర్హత

కోల్పోయిన వారు

మే

ఏప్రిల్‌

మార్చి

జూలై

జూన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement