ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు
భువనగిరిటౌన్ : క్రిమినల్ న్యాయ వ్యవస్థలో కేసుల నిష్పక్షపాత ముగింపునకు శాసీ్త్రయ సాక్ష్యాలు ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు అన్నారు. భువనగిరి బార్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు హైదరాబాద్‌కు చెందిన ప్రోబ్‌ల్యాబ్ ఫోరెన్సిక్ సంస్థ సహకారంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం ఫోరెన్సిక్ సైన్స్ క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ప్రాముఖ్యత అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌ను జిల్లా ప్రధాన జడ్జి ప్రారంభించి మాట్లాడారు. నకిలీ పత్రాల గుర్తింపు, వేలిముద్రల విశ్లేషణలో ఫోరెన్సిక్ పాత్ర పెరిగిందన్నారు. అనంతరం ప్రోబ్‌ల్యాబ్ ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ ఎర్రగొల్ల (పీహెచ్‌డీ) మాట్లాడుతూ డిజిటల్ ఫోరెన్సిక్స్, నేరస్థల దర్యాప్తు, వివాదాస్పద పత్రాల పరిశీలన వంటి అంశాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.శారద, ప్రతినిధులు యు.సురేష్, సి.రజని, జి.శంకర్, ఎం.వసంత రాణి, ఎస్.రాజేందర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
జాతీయ జెండా చిరిగినా పట్టించుకోరా!
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్) వద్ద ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా చిరిగిపోయి దర్శనమిస్తోంది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచే మువ్వన్నెల జెండా పైభాగం చిరిగిపోయి గాలికి కొట్టుకుంటున్నా, అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాగ్ కోడ్ ప్రకారం చిరిగిన జాతీయ జెండాను అలా ఉంచడం అవమానించడమే అవుతుంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, చిరిగిన జెండా స్థానంలో కొత్త జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మహాశివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు అభిషేకం, అష్టోత్తర, బిల్వా పత్రాలతో పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


