పురుగులు పట్టి.. తుట్టెలు కట్టి.. | - | Sakshi
Sakshi News home page

పురుగులు పట్టి.. తుట్టెలు కట్టి..

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

సాక్షి, యాదాద్రి : రేషన్‌ షాపులు, గోదాముల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం పురుగులు పట్టి.. తుట్టెలు కట్టి పందికొక్కులు, ఎలుకలు, పురుగుల పాలు అవుతున్నాయి. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించే నాటికి జిల్లాలోని 515 రేషన్‌ దుకాణాలు, సివిల్‌ సప్లయ్‌ గోదాములు, ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్‌, రామన్నపేట, మోత్కూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం కొంతవరకు అక్రమార్కుల పాలయ్యాయి. పౌరసరఫరాల శాఖ పిలిచిన టెండర్లలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, బఫర్‌ గోదాముల్లోని బియ్యాన్ని మాత్రమే టెండర్‌దారులు దక్కించుకున్నారు. రేషన్‌ దుకాణాల బియ్యానికి టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రేషన్‌ దుకాణాల్లో పేరుకుపోయిన దొడ్డుబియ్యం నిల్వలను వెంటనే తరలించాలని రేషన్‌ డీలర్లు కోరుతున్నారు.

దేనికీ పనికిరాకుండా..

రేషన్‌ దుకాణాల్లో నెలల తరబడి ఉన్న 773.536 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం పాడైపోతున్నాయి. తెల్లపురుగు, లక్క పురుగులు పట్టడం, ముక్కిపోవడం, తుట్టెలు కట్టి ఎందుకూ పనిరాకుండా పోతున్నాయి. పందికొక్కులు, ఎలుకలు తినడంతో పాటు గోనె సంచుల నుంచి జారిపోతున్నాయి. దీంతో బియ్యం తగ్గిపోతున్నాయి. రేషన్‌ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పురుగులు సన్నబియ్యానికి పట్టే అవకాశం ఉందని డీలర్లు వాపోతున్నారు.

దొడ్డు బియ్యం నిల్వలు 1,302 మెట్రిక్‌ టన్నులు

జిల్లాలో 1,302.553 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిలో ఐదు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో 181.236 మెట్రిక్‌ టన్నులు, బఫర్‌ గోదాముల్లో 347.781 మెట్రిక్‌ టన్నులు, రేషన్‌ దుకాణాల్లో 773.536 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. రేషన్‌ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత దొడ్డు బియ్యం అక్కడినుంచి తరలించలేదు. మరో వైపు ఇళ్లలో పిండి వంటలకు, హోటళ్లలో టిఫిన్‌లు చేయడానికి ఈ బియ్యానికి డిమాండ్‌ పెరిగింది.

టెండర్‌కాని రేషన్‌ బియ్యం

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయంలో దొడ్డు బియ్యం టెండర్లు ఇటీవల పూర్తి అయ్యాయి. రేషన్‌ బియ్యం మాత్రం మరికొంత కాలం అక్కడే ఉండనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దొడ్డు బియ్యం బఫర్‌ గోదాములు, మండల్‌ లెవల్‌ స్టాక్‌ పాయింట్లలో నిల్వ ఉన్న బియ్యానికి మాత్రమే టెండరుదారు దక్కించుకున్నాడు. కిలో రూ.21.70 చొప్పున ధర పలికింది. కాగా జిల్లాలో దొడ్డు బియ్యం బఫర్‌ గోదాముల్లో 347.781 మెట్రిక్‌ టన్నులు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో 181.236 మెట్రిక్‌ టన్నులను టెండర్‌లో చైన్నెకి చెందిన పర్చ్యూన్‌ ఆగ్రో ఫుడ్స్‌ సంస్థ కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు.

ఫ రేషన్‌ షాపుల్లో పేరుకుపోయిన దొడ్డు బియ్యం నిల్వలు

ఫ పందికొక్కులు, ఎలుకల పాలవుతున్న బియ్యం

ఫ టెండర్లకు ముందుకురాని

వ్యాపారులు

ఫ ఆందోళనలో రేషన్‌ డీలర్లు

దొడ్డు బియ్యం నిల్వల వివరాలు (మెట్రిక్‌ టన్నుల్లో)

రేషన్‌ దుకాణాల్లో 773.536

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో 181.236

బఫర్‌ గోదాముల్లో 347.781

మొత్తం 1302.553

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement