వలిగొండ : డిసెంబర్ నాటికి ధర్మారెడ్డి కాల్వ ఫేజ్–2 పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వలిగొండ మండలం సంగెం సమీపంలో కత్వ వద్ద గేట్లు తెరిచి ధర్మారెడ్డిపల్లి కాల్వ ఫేజ్–1కు మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన15 నెలల్లో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి 15 నెలల్లో గోకారం వరకు ఫేజ్–1 పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించిన ఘనత కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. సాగు నీటితో రైతుల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ కృష్ణారెడ్డి, రాధాకృష్ణ, గరిసే రవి, వాకిటి అనంతరెడ్డి, కుంభం వెంకట పాపిరెడ్డి, బత్తిని సహదేవ, పాశం సతిరెడ్డి, చిట్టెడి జనార్దన్ రెడ్డి, గూడూరు శివశాంత్ రెడ్డి, బాతారాజు బాల్ నర్సింహ, నూతి రమేష్, సిరిగిరి మల్లారెడ్డి, సురకంటి మల్లారెడ్డి, పోలేపాక జానకి రాములు, పున్న జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


