రోగులకు అత్యవసర వైద్యం అందాల్సిందే | - | Sakshi
Sakshi News home page

రోగులకు అత్యవసర వైద్యం అందాల్సిందే

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

క్యాజువాలిటీ బెడ్లు – మార్చురీ విస్తరణ

సాక్షి, యాదాద్రి : రోగులకు అత్యవసర వైద్యం అందించాల్సిందేనని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి అభివృద్ధి, రోగులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సమావేశానికి చైర్మన్‌ హోదాలో హాజరైన ఎమ్మెల్యే.. ఆస్పత్రిలో ఎదురవుతున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జీజీహెచ్‌ను మోడల్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ నిధులు తెస్తానని వెల్లడించారు.

లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు

ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం ఆక్సిజన్‌ సమస్యను వైద్యాధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెలకొల్పాలని ఆయన నిర్ణయించారు. ప్లాంట్‌ ఏర్పాటుకు ఆస్పత్రి ఆవరణలో స్తలాభావం ఉండటంతో, వెనుక భాగంలో ఉన్న పాత క్వార్టర్లను తొలగించి బేస్‌ ఏర్పాటు చేసి ప్లాంట్‌ నెలకొల్పాలని నిర్ణయించారు.

అటెండెంట్లు, రోగులకు సౌకర్యాలు

రోగుల వెంట వచ్చే అటెండెంట్లు, బంధువులకు ఆస్పత్రి కారిడార్లలో కూర్చొని భోజనాలు చేస్తున్న తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరికి ప్రత్యేకంగా షెడ్‌ నిర్మించాలని, రోగులకు పౌష్టికాహారం వండటానికి వీలుగా కిచెన్‌ షెడ్‌ నిర్మించాలని నిర్ణయించారు.

కాంట్రాక్టర్‌తో సమీక్షిస్తాం

ఆస్పత్రి పైన కొనసాగుతున్న నిర్మాణ పనులపై కాంట్రాక్టర్‌తో సమీక్షించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశానికి కాంట్రాక్టర్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆస్పత్రి అభివృద్ధికి సుమారు రూ. 3 కోట్ల నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణ కుమారి, డీసీహెచ్‌ఎస్‌ సూర్యశ్రీ రావు, మున్సిపల్‌ చైర్మన్‌ తంగెళ్లపల్లి శ్రీవాణి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చంద్రప్రకాశ్‌రెడ్డి, అంగడినాగరాజు, భువనగిరి వెంకటరమణ, పలుగుల ఆగేశ్వరావు, రేణుక, ఎంపల్ల బచ్చిరెడ్డి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సద్గుణాచారి పాల్గొన్నారు.

ఫ జీజీహెచ్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతా

ఫ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కుంభం

క్యాజువాలిటీ విభాగంలో కొత్త బెడ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం జీజీహెచ్‌ మార్చురీలో ఒక్క ఫ్రీజర్‌ మాత్రమే ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించారు. వెంటనే మరిన్ని ఫ్రీజర్లను అందుబాటులోకి తెచ్చి మార్చురీని విస్తరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement