మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ధ్యేయం

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

బస్సు సర్వీస్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, బస్సు నడుపుతున్న ఎమ్మెల్యే కుంభం

భువనగిరి: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.భువనగిరి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి నమాత్‌పల్లి మీదుగా వలిగొండ మండలం టేకుల సోమారం వరకు వెళ్లే ఆర్టీసీ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

బస్సు నడిపిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే అనిల్‌కుమారెడ్డి.. ఆర్టీసీ డ్రైవర్‌గా మారి బస్సు నడిపి ప్రయాణికులను ఉత్సాహపరిచారు. నమాత్‌పల్లి మీదుగా వెళ్లే బస్సును ఆయన ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులు, ప్రయాణికులతో మాట్లాడారు.

నెరవేరిన 25 ఏళ్ల కల

నమాత్‌పల్లికి 25 ఏళ్ల నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లలేదు. ఆ కల ఎమ్మెల్యే చొరవతో నెరవేరింది . బస్సులోనే ఎమ్మెల్యే టేకుల సోమారం చేరుకొని అక్కడ జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీవాణి, వైస్‌ చైర్మన్‌ పోతంశెట్టి మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేఖ, కాంగ్రెస్‌ మండల కమిటీ అధ్యక్షుడు జంగయ్య, భువనగిరి, చందుపట్ల పీఏసీఎస్‌ల చైర్మన్లు ఫక్కీర్‌ కొండల్‌రెడ్డి, సతీష్‌పవన్‌, ఆర్టీసీ డీఎం సురేష్‌, సర్పంచ్‌ అరుణ, శివానంద్‌, ప్రమోద్‌కుమార్‌, జహంగీర్‌, వెంకటస్వామి, కృష్ణ, స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement