భువనగిరి : గ్రామ పంచాయతీలకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సరిత అన్నారు. పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సోమవారం భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని సందర్శించి వివిధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రణాళికల తయారీలో పాలుపంచుకున్న అధికారులను తీరు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ఆమెకు గ్రామంలో స్వాతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ దినకర్, వివిధ శాఖల అధికారులు శ్యామ్‌సుందర్, గుండురావు, బాలస్వామి, మల్లేశం, సర్పంచ్ పల్లెపాటి నాగరాణి, ఉప సర్పంచ్ వెంకటేశం, సిబ్బంది పాల్గొన్నారు.


