రైతుల గోస పట్టని కాంగ్రెస్‌ సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

రైతుల గోస పట్టని కాంగ్రెస్‌ సర్కార్‌

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

బొమ్మలరామారం : కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీ చేయని అబద్దాలకోరు కాంగ్రెస్‌ ప్రభుత్వం పోవాలని, డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బొమ్మలరామారం మండలంలోని వివిధ సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర సోమవారం రాత్రి ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సభకు హాజరైన రామచంద్రరావు మాట్లాడుతూ.. సాగు నీరు లేక ఇబ్బంది పడుతున్న రైతుల గోడును ప్రభుత్వం వినడం లేదన్నారు. బీబీనగర్‌లో దేశం గర్వించదగ్గ రీతిలో ఎయిమ్స్‌ ఆసుపత్రిని నిర్మించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. కోట్లాది రూపాయలతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 12 జాతీయ రహదారులను నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను మరమ్మతులు చేయలేని స్థితిలో ఉందన్నారు. సబ్సిడీపై ఎరువులు, తెలంగాణలో లక్షా 60 వేల మంది రైతులకు క్రమం తప్పకుండా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను జమ చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బినామీల పేరున వడపర్తి నుంచి మర్యాల, చీకటిమామిడి రోడ్డును కాంట్రాక్ట్‌ తీసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.. రేండేళ్లు దాటినా రోడ్డు వేయకుండా ప్రజల ఉసురు తీస్తున్నాడని అన్నారు. చెరువుల మట్టిని కాంగ్రెస్‌ నాయకులు మాఫీయగా మారి దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్‌గౌడ్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఫక్కీరు రాజేందర్‌రెడ్డి, నాయకులు రంగారామాగౌడ్‌, వినోద్‌ నాయక్‌, కొలను చంద్రశేఖర్‌రెడ్డి, తిర్మని క్రిష్ణాగౌడ్‌, కుర్మిండ్ల ఈశ్వర్‌గౌడ్‌, మాదిరెడ్డి సుభాష్‌రెడ్డి, జగ్గర్ల ఆనంద్‌గౌడ్‌, చిమ్ముల రవీందర్‌రెడ్డి, రవిశంకర్‌, పెంటయ్య పాల్గొన్నారు.

ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement