భువనగిరి : ఐదు సంవత్సరాల ్లలోపు వయస్సు కలగిన చిన్నారులు, గర్భిణుల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధుల నిరోధానికి టీకాలు ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనస్సు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీకాలు వేయించుకోని లేదా పాక్షికంగా టీకాలు వేయించుకున్న గర్భిణులు, 5 సంవత్సరాల లోపు పిల్లలకు 100 శాతం రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం ద్వారా మీజిల్స్ రూబెల్లా (ఎంఆర్) టీకాను ఇవ్వనున్నారు.
నిరోధించే వ్యాధులు ఇవే..
మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా ఎంఆర్ టీకాలు వేయడంతో డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, హెపటైటిస్–బి, తట్టు, రుబెల్లా, మెనింజైటిస్, నిమోనియా, జపనిస్ ఎల్సెఫలేటిస్, రోటా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నిరోధించవచ్చు. జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్న టీకాలు వేయించుకోని వారిని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంచార జాతులు, వలస కార్మికులు ఉండే స్థలాల్లో ఉన్న పిల్లలకు టీకాలు వేయించుకోని వారిని గుర్తించి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
ఫ ప్రాణాంతక వ్యాధుల
నిరోధానికి టీకాలు
ఫ పిల్లలు, గర్భిణుల్లో రోగ నిరోధక
శక్తి పెంపునకు ప్రణాళి
ఫ 27 వరకు టీకాల ప్రక్రియ కొనసాగింపు


