సూర్యాపేట టౌన్ : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడానికే ప్రభుత్వం హెచ్‌పీవీ టీకా పంపిణీ చేస్తుందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 14 నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు తప్పనిసరిగా ఈ టీకాను వేయించాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,664 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని హెచ్‌పీవీ టీకా వేయించేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రితో టీకా వేస్తారని, విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా సంక్షేమ, విద్యాశాఖల అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, డీఈఓ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మాధవ్ కుమార్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


