మఠంపల్లి : నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వరి ధాన్యం తెచ్చే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హుజూర్‌నగర్ సీఐ గజ్జెల చరమందరాజు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని మట్టపల్లి వంతెనపై ఉన్న సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, వాహనాల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని మట్టపల్లి వంతెన వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీ నుంచి దళారులు అక్రమ మార్గంలో ధాన్యం తెలంగాణలోకి తెచ్చి మద్దతు ధర, బోనస్ పొందే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ బాబు, సిబ్బంది ఉన్నారు.


