‘అరైవ్‌–అలైవ్‌’లో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

‘అరైవ్‌–అలైవ్‌’లో భాగస్వాములు కావాలి

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

భానుపురి (సూర్యాపేట) : అరైవ్‌ –అలైవ్‌ రోడ్డు భద్రత అవగాహన ఉద్యమమని, ఇందులో అన్ని శాఖల అధికారులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీసీహాల్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, నేషనల్‌ హైవే అధికారులు, ఆర్‌అండ్‌బీ, రైల్వే, ఇరిగేషన్‌, ఆర్టీఓ, ఎడ్యుకేషన్‌, డీఎంహెచ్‌ఓ, పోలీస్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఎస్పీ కె. నరసింహతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు అరైవ్‌ అలైవ్‌ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలలో జిల్లా యంత్రాంగం కూడా భాగస్వాములై ప్రజలను, విద్యార్థులను, యువతను చైతన్యవంతం చేయాలని సూచించారు. రహదారులపై లోపాలను గుర్తించి సవరించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే ఉన్న నిరూపయోగ బావులను పూడ్చివేయాలన్నారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ 13న అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రత గ్రామ సభలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్‌శాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ వరి ధాన్యం కొనుగోలు, సెన్సెస్‌పై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, అడిషనల్‌ ఎస్పీ రవీందర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఈఓ అశోక్‌, ఆర్టీఓ జయప్రకాశ్‌రెడ్డి, సీపీఓ కిషన్‌, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

భూసేకరణను వేగవంతం చేయాలి

జిల్లాలో అభివృద్ధి పనులకు భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం వీసీ కాన్షరెన్స్‌హాల్‌లో జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు కావాల్సిన భూసేకరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇరిగేషన్‌, రైల్వే, ఇండస్ట్రియల్‌ పార్క్‌ వంటి పనులకు కావాల్సిన భూమిని త్వరితగతిన సేకరించి అందించాలన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement