నడిగూడెం : మండల కేంద్రంలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన బస్‌షెల్టర్ భవనం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు దీనిని వినియోగించుకోలేక పోతున్నారు. దాంతో ఇరువైపులా ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుమీద, బస్‌షెల్టర్‌కు చుట్టుపక్కల ఉన్న దుకాణాల వద్ద నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రం నుంచి ప్రజలు నిత్యం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారంతా బస్సుల కోసం గంటల కొద్దీ రోడ్డు మీదే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. నిలబడేందుకు నీడ, కనీసం తాగునీరు, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్‌కు మరమ్మతులు చేయించి, ఉపయోగంలోకి తీసుకరావాలని స్థానికులు కోరుతున్నారు.


