సూర్యాపేటటౌన్ : మన జీవన శైలిలో మార్పుల వల్లే భౌతిక శ్రమ తగ్గిపోయి, మానసిక శ్రమ పెరగడం వల్లే అనేక వ్యాధుల బారిన పడుతున్నారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ప్రపంచ హోమియో దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమియోపతి ఔషధాలు వ్యాధిని లోతుల్లోంచి నయం చేయడంలో సహాయపడుతుందన్నారు. నిత్యం యోగా, ప్రాణాయం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీలు డాక్టర్ శ్రీకాంత్ భట్, డాక్టర్ కృష్ణయ్య, ఆయూష్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ రాకమృష్ణ, నరేష్ పాల్గొన్నారు.


