ఎయిడ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించండి

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

సూర్యాపేట : ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో విస్త్రృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యవారం కార్యక్రమంలో 4వ రోజు ఎయిడ్స్‌ నివారణ ప్రచార దినం, రెడ్‌ రన్‌ను కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హెచ్‌ఐవీపై సరైన అవగాహన కల్పించి వ్యాధి వ్యాప్తి కారణాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ.. అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల హెచ్‌ఐవీ సంక్రమించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత, వైస్‌ చైర్మన్‌న్‌ఎండీ షఫీఉల్లా, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు నాజియా, శ్రీశైలం, శ్రావణి, శాంతకుమార్‌, అమూల్య, ప్రణీత్‌, వాసవి, వార్డు కౌన్సిలర్లు రాజేశ్‌, ఈద ప్రవీణ్‌, మాణిక్యం అరుణ, ఎస్‌ఓ పి.వీరయ్య, డిప్యూటీ డీఈఎమ్‌ఓ సంజీవ్‌రెడ్డి మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీ రోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి

భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి జనరల్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పి.వెంకటరమణ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, ప్రవీణ్‌, దశరథ్‌, నిర్మల్‌కుమార్‌, విద్యాసాగర్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ శివప్రసాద్‌, మేనేజర్‌ నాగరాజు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు

చర్యలు తీసుకుంటున్నాం

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. గురువారం 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్‌–అలైవ్‌ వారోత్సవాల నిర్వహణపై సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీసీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్‌ ఈ వీసీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌– విజయవాడ నేషనల్‌ హైవేపై 32 బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్‌ కె సీతారామారావు, సీపీఓ కిషన్‌, ఆర్టీవో జయప్రకాశ్‌రెడ్డి, డీఈఓ అశోక్‌, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement