ఇరాన్‌పై యుద్ధం నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధం నిలిపివేయాలి

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

సూర్యాపేట : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేసిన దాడులపై స్పందించకుండా ప్రధాని మోదీ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లు, మత మార్పిడి అంశంపై ఇచ్చిన తాజా తీర్పు సరైంది కాదన్నారు. గౌరవ న్యాయస్థానం ఈ తీర్పును రివ్యూ చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుడాలో 320 ఎకరాల భూమిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆక్రమించారని ప్రచారం జరుగుతోందని, ఈ విషయంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

పిట్టల దొరలా వ్యవహరిస్తున్న ట్రంప్‌...

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పిట్టల దొరలా వ్యవహరిస్తూ అపరిచితుడిగా మారిపోతున్నాడని అన్నారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర కరువైందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement