పిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా శుభారంభం చేసింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అల్జీరియాతో మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ చర్య వివాదానికి దారి తీసింది. మెస్సీ ఫౌల్ చేసినట్లు నిర్థారణ అయినప్పటికీ మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
విషయంలోకి వెళితే.. తొలి గోల్ కొట్టిన తర్వాత మెస్సీ అల్జీరియా ప్లేయర్‌ను అడ్డుకునే క్రమంలో వెనుక నుంచి స్టడ్స్-అప్ ఛాలెంజ్ చేశాడు. దీంతో ఆ ప్లేయర్ నొప్పితో నేలపై పడిపోయాడు. ఇది ఫుట్‌బాల్‌లో నిబంధనలకు విరుద్ధం. ఈ చర్య పట్ల మెస్సీకి రిఫరీ రెడ్ కార్డు చూపించాలి.
మెస్సీ ఫౌల్ చేసినట్లు రిప్లేలో స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మ్యాచ్ రిఫరీ సైమన్ మార్సీనియాక్ మెస్సీకి రెడ్ లేదా ఎల్లో కార్డు జారీ చేయాలి. దీంతో రిఫరీ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. ‘మెస్సీ అయితే రూల్స్ మారిపోతాయా?’ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మెస్సీకి సంబంధించిన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్ మెస్సీకి 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్ లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ (ఆట 17వ, 60వ, 76వ నిమిషం)తో మెరిశాడు. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరాస్లోవ్ క్లోస్‌తో కలిసి మెస్సీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో మెస్సీ ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
Messi just got away with an absolutely DISGUSTING challenge to an Algeria defenders leg.
Red card or not?pic.twitter.com/2ZU2B5j4oH— Banter FC (@FCBanter_) June 17, 2026


