తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌ | IND VS WI 1st T20I Live updates and Playing XI | Sakshi
Sakshi News home page

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌

Oct 6 2026 6:32 PM | Updated on Oct 6 2026 7:26 PM

IND VS WI 1st T20I Live updates and Playing XI

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌
4.3వ ఓవర్‌- 38 పరుగుల వద్ద విండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో కమిల్‌ పూరన్‌ (12) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

ధాటిగా ఆడుతున్న హోప్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ (13 బంతుల్లో 22) ధాటిగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ కమిల్‌ పూరన్‌ (5) ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 

భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. లక్నోలోని భారత రత్న అటల్‌ బిహారి వాజ్‌పేయి ఎకానా క్రికెట్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ మరికాసేపట్లో మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

కొద్ది రోజుల కిందటే విండీస్‌ వన్డే అరంగేట్రం చేసిన విధ్వంసకర బ్యాటర్‌ నమన్‌ ధిర్‌ ఈ మ్యాచ్‌తో టీ20 అరంగేట్రం కూడా చేశాడు. పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ నమన్‌కు టీమిండియా తొలి క్యాప్‌ అందజేశాడు. 

తుది జట్లు
భారత్‌: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (c), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్‌ ధిర్‌, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

వెస్టిండీస్‌: కమిల్ పూరన్, షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోస్టన్ చేజ్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డ్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, షమార్‌ స్ప్రింగర్‌

ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన ఆసీస్‌ ప్లేయర్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement