T20 WC: జట్లు, వేదికలు, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు | ICC Womens T20 WC 2026: Squads Venues Live Streaming All Details | Sakshi
Sakshi News home page

T20 WC 2026: జట్లు, వేదికలు, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

Jun 10 2026 5:43 PM | Updated on Jun 10 2026 5:56 PM

ICC Womens T20 WC 2026: Squads Venues Live Streaming All Details

PC: ICC/X

గతేడాది సొంతగడ్డపై భారత మహిళ క్రికెట్‌ జట్టు అద్భుతం చేసింది. తొలిసారిగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో చాంపియన్‌గా అవతరించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ఆ తర్వాత టీమిండియా అదే జోరు కొనసాగిస్తూ స్వదేశంలో పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది. ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12 టీ20 మహిళా ప్రపంచకప్‌-2026 మొదలుకానుంది.

ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని హర్మన్‌ బృందం పట్టుదలగా ఉంది. పురుషుల మాదిరే ఈసారి తామూ ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగనుండగా.. గతేడాది రన్నరప్‌ సౌతాఫ్రికా కూడా ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఇక భారత జట్టు 2024లో కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. ఈసారి లోపాలు సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

ఇంతకీ ఈ టోర్నీలో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? సారథులు ఎవరు?.. వేదికలు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? తదితర వివరాలు తెలుసుకుందామా?!

షెడ్యూల్‌
👉రౌండ్‌- రాబిన్‌ ఫార్మాట్‌
👉జూన్‌ 12న వరల్డ్‌కప్‌ టోర్నీ మొదలు (ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక)
👉భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌- జూన్‌ 14
👉సెమీ ఫైనల్‌-1: జూన్‌ 30
👉సెమీ ఫైనల్‌-2: జూలై 2
👉జూలై 5న ఫైనల్‌తో ముగింపు.

వేదికలు
👉గ్రూప్‌, సూపర్‌-8 దశ: ఓల్డ్‌ ట్రఫోర్డ్‌, మాంచెస్టర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌, బ్రిస్టల్‌, హెడింగ్లీ, లీడ్స్‌, హాంప్‌షైర్‌ బౌల్‌, సౌతాంప్టన్‌, ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హామ్‌.
👉సెమీ ఫైనల్‌- ది ఓవల్‌, ఫైనల్‌- లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌.

జట్లు
ఆస్ట్రేలియా
సోఫీ మోలినెక్స్ (కెప్టెన్), నికోలా క్యారీ, ఆష్లే గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తాహ్లియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్.

బంగ్లాదేశ్‌
నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్‌), నహిదా అక్తర్‌ (వైస్‌ కెప్టెన్‌), షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, షోర్నా అక్తర్‌, రీతు మోని, రబెయా ఖాన్, ఫాహిమా ఖాతున్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, శంజిదా అక్తేర్ మఘ్లా, సుల్తానా ఖాతున్, దిలారా అక్తర్, జుయేరియా ఫిర్దోస్‌, తాజ్‌ నెహర్‌.

ఇండియా
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్‌

నెదర్లాండ్స్‌
బాబెట్ డి లీడే (కెప్టెన్‌), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్, హన్నా లాంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్‌హూయిస్, మైర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్‌బోయర్, రోసాలీ లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, స్టెరె కాలిస్

పాకిస్తాన్‌
ఫాతిమా సనా (కెప్టెన్‌), గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, ఇరామ్ జావేద్, ఇమాన్ ఫాతిమా, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, సైరా జబీన్, మునీబా అలీ, తుబా హసన్, రమీన్ షమీమ్‌, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్, తస్మియా రుబాబ్.

సౌతాఫ్రికా
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్‌), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్‌సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనేకే, టుమీ సెఖుఖునేర్, చ్లోవాన్ నికెర్కెర్

ఇంగ్లండ్‌
నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హీథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్-హాడ్జ్.

ఐర్లాండ్‌
గాబీ లూయిస్ (కెప్టెన్), అవా కానింగ్, క్రిస్టినా కౌల్టర్ రైలీ, అలనా డాల్జెల్, జార్జినా డెంప్సీ, అమీ హంటర్, ఆర్లీన్ కెల్లీ, లూయిస్ లిటిల్, ఐమీ మాగ్వైర్, లారా మెక్‌బ్రైడ్, కారా ముర్రే, లియా పాల్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, రెబెక్కా స్టోకెల్, ఆలిస్ టెక్టర్

న్యూజిలాండ్‌
మెలీ కెర్ (కెప్టెన్), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్‌మేరీ మైర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహు.

స్కాట్లాండ్‌
కాథరిన్ బ్రైస్ (కెప్టెన్), క్లో అబెల్, ఒలివియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియనాజ్ ఛటర్జీ, గాబ్రియెల్లా ఫొంటెన్లా, కాథరిన్ ఫ్రేజర్, కిర్స్టీ గోర్డాన్, ఐల్సా లిస్టర్, మైసీ మాసీరా, అబ్తాహా మక్సూద్, మేగన్ మెక్‌కోల్, రేచల్ స్లేటర్, పిప్పా స్ప్రౌల్

శ్రీలంక
చమరి ఆటపట్టు (కెప్టెన్‌), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, ఇమేషా దులాని, నీలక్షిక సిల్వా, కవీషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషిణి నుత్యాంగన, సుగందిక దాసనాయక, నిమాషా మదుషాని, కావ్య మదుషాని, కావ్య మదుషాని, మల్కి మదర, మిథాలి అయోధ్య, చేతన విముక్తి.

వెస్టిండీస్‌
హేలీ మాథ్యూస్ (కెప్టెన్‌), చినెల్లే హెన్రీ, డియాండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అలీన్, షెమైన్ క్యాంప్‌బెల్లే, అష్మిని మునిసార్, కరిష్మా రామ్‌హారక్, జన్నీలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, మాన్షా హేగ్రుక్, జైదా జేమ్స్‌, మాండీ మంగ్రూ, షానిష హెక్టార్‌.

ప్రత్యక్ష ప్రసారం
👉స్టార్‌ స్పోర్ట్స్‌ (టీవీ), జియోహాట్‌స్టార్‌ (డిజిటల్‌).

మ్యాచ్‌ ఆరంభ సమయాలు
భారత కాలమానం ప్రకారం: మధ్యాహ్నం మూడు గంటలు, రాత్రి ఏడు గంటలు, పదకొండు గంటలకు ఆరంభం.

చదవండి: గంభీర్‌ను పట్టించుకోని సీనియర్లు!

Advertisement
 
Advertisement
Advertisement