
ఆసియాకప్-2025 ముందు భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోనున్నాడు. తాజాగా పాండ్యా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చేరాడు. ఈ మెగా టోర్నీ ముంగిట చాలా మంది భారత ఆటగాళ్లు సీవోఎకు క్యూ కట్టారు.
టీమిండియా వైట్‌బాల్ సెటాప్‌లో భాగమైన పాండ్యా.. ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. గత నెల రోజుల నుంచి తన శిక్షణ ప్రారంభించాడు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. పాండ్యా ఆగస్టు 11, 12 తేదీల్లో తన ఫిట్‌నెస్ టెస్టు చేసుకోనున్నాడు. ఈ బరోడా ఆల్‌రౌండర్ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎన్సీఎకి ఒక చిన్న ట్రిప్ అనే క్యాప్షన్‌తో స్టోరీని షేర్ చేశాడు.
అయ్యర్ పాస్..
మరోవైపు ఎన్సీఎలో ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ఫిట్‌నెస్ పరీక్షను జూలై 27-29 పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అతడు ఆసియాకప్-2025తో తిరిగి టీ20 జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మిడిల్ ఆర్డర్‌లో అనుభవం ఉన్న బ్యాటర్ జట్టుకు అవసరమని సెలకర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్-2025లో అయ్యర్ అద్బుతంగా రాణించిడంతో అతడికి తిరిగి పిలుపునిచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు వినికిడి. ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోవారంలో తన పూర్తి ఫిట్‌నెస్‌ను పొందనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఇక ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.
చదవండి: 'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు