భార‌త్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జ‌ట్టు ఇదే | England Announce Playing-XI For-1st-T20I-Vs-India-Archer Not-Playing | Sakshi
Sakshi News home page

భార‌త్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జ‌ట్టు ఇదే

Jul 1 2026 12:17 AM | Updated on Jul 1 2026 12:28 AM

England Announce Playing-XI For-1st-T20I-Vs-India-Archer Not-Playing

ఐర్లాండ్ చేతిలో దారుణ సిరీస్ ఓట‌మి అనంత‌రం టీమిండియా ఇంగ్లండ్ గ‌డ్డపై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఇంగ్లండ్‌, టీమిండియా మ‌ధ్య తొలి టీ20 జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోమ‌వారం రాత్రి తొలి టీ20 మ్యాచ్‌లో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

అయితే టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ బోర్డు 17 మందితో కూడిన స‌భ్యుల బృందాన్ని ప్ర‌క‌టించింది. హ్యారీ బ్రూక్ జ‌ట్టును న‌డిపించ‌నుండ‌గా, జాస్ బ‌ట్ల‌ర్ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు.  బ‌ట్ల‌ర్‌తో పాటు సీనియ‌ర్లు సామ్ క‌ర‌న్‌, ఆదిల్ ర‌షీద్‌తో పాటు టీ20 సంచ‌ల‌న ఆట‌గాళ్లు జాక‌నబ్ బెథెల్‌, టామ్ బాంట‌న్‌, లియామ్ డాస‌న్‌లకు అవ‌కాశం క‌ల్పించింది. 

అయితే స్టార్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్‌కు తొలి టీ20 మ్యాచ్‌కు విశ్రాంతి ఇచ్చిన‌ట్లు బోర్డు తెలిపింది. అయితే ఆర్చ‌ర్‌కు ఎందుకు రెస్ట్ ఇచ్చార‌నే దానిపై మాత్రం ఈసీబీ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు.  ఇటీవ‌లే న్యూజిలాండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్‌లో ఆర్చ‌ర్ నాలుగు ఇన్నింగ్స్‌లు క‌లిపి 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున ఆడిన ఆర్చ‌ర్ 25 వికెట్లు తీశాడు. అయితే ఐర్లాండ్‌తో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దానిని పున‌రావృతం చేయ‌కూడ‌ద‌నే సంక‌ల్పంతో ఉంది. మ‌రోవైపు ఇంగ్లండ్ మాత్రం ఈ ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్‌లో టీమిండియా చేతిలో ఓడిపోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయింది. 

అందుకే సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో భార‌త్‌ను ఓడించి ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. ఇక భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టీ20కి చెస్ట‌ర్ లె స్ట్రీట్‌లోని రివ‌ర్‌సైడ్ గ్రౌండ్ వేదిక కానుంది.

తొలి టీ20కి ఇంగ్లండ్‌ తుది జట్టు:
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement