నైట్‌క్లబ్‌ వివాదం.. స్టోక్స్‌ కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌..? | Ben Stokes Retirement All But Confirmed After Nightclub Controversy | Sakshi
Sakshi News home page

నైట్‌క్లబ్‌ వివాదం.. స్టోక్స్‌ కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌..?

Jun 9 2026 8:54 PM | Updated on Jun 9 2026 8:54 PM

Ben Stokes Retirement All But Confirmed After Nightclub Controversy

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ భవిష్యత్తుపై సంచలన ప్రచారం జరుగుతోంది. తాజాగా న్యూజిలాండ్‌పై లార్డ్స్ టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత స్టోక్స్, సహచర ఆటగాడు గస్‌ అట్కిన్సన్‌ జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి కర్ఫ్యూ సమయంలో ఓ నైట్‌క్లబ్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వారు ఫుల్లుగా తాగి ఓ రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ వివాదం తర్వాత స్టోక్స్‌ తన కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'ది క్రికెటర్' సీనియర్ జర్నలిస్ట్ జార్జ్‌ దోబెల్‌ ప్రకారం.. అతడు స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.

ఇదిలా ఉంటే, నైట్‌క్లబ్‌ ఘటనలో స్టోక్స్‌, అట్కిన్సన్‌ ఎవరిపై దాడికి పాల్పడలేదని ECB వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తప్పకపోవచ్చు. స్టోక్స్‌కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. 

గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్‌క్ల‌బ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో వ‌న్డే మ్యాచ్‌కు ముందు వెల్లింగ్ట‌న్‌లోని ఓ నైట్‌క్ల‌బ్‌కు వెళ్లిన బ్రూక్, అక్కడ బౌన్స‌ర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ఇంగ్లండ్‌ భవిష్యత్తు ఆశాకిరణం జేక‌బ్ బెథెల్‌తో కలిసి సదరు బౌన్స‌ర్‌పై దాడి చేశాడు. అయితే దాడి పెద్ద‌ది కాక‌పోవ‌డంతో ఈసీబీ వారిద్ద‌రిని మంద‌లింపుతో స‌రిపెట్టింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement