ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకరైన బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట మధ్యలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలకనున్నట్లు స్టోక్స్ స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ ఆల్‌రౌండర్, 2019 వరల్డ్‌కప్ ఫైనల్‌లో తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు చారిత్రాత్మక విజయం అందించిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచే ఉంది.
రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో స్టోక్స్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. "నా రిటైర్మెంట్ కు గల కారణాల గురించి తర్వాత అయినా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ జట్టు కోసం నేను మరోసారి కష్టపడాల్సి ఉంది. ఫలితం ఎలా ఉన్నా శక్తివంచన లేకుండా పనిచేశామన్న సంతృప్తితో మైదానం వీడాలి. అదే నా కోరిక" అని స్టోక్స్ సహచర ఆటగాళ్లతో వ్యాఖ్యానించాడు. కాగా, 15 ఏళ్లుగా ఇంగ్లండ్ జట్టుకు సేవలు అందిస్తున్న స్టోక్స్ ఇప్పటివరకు 122 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 44 మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించాడు. ఇక అంతర్జాతీయ కెరీర్‌లో 114 వన్డే మ్యాచ్‌లు, 43 టీ20 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ ఇంగ్లండ్ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
కాగా స్టోక్స్ రిటైర్మెంట్ నిర్ణయం ఇంగ్లాండ్ క్రికెట్‌కు పెద్ద లోటు అని నిపుణులు భావిస్తున్నారు. ఆయన లాంటి ఆటగాడు జట్టులో లేకపోవడం భవిష్యత్తులో ఇంగ్లాండ్‌కు సవాళ్లను తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిన ఈ నిర్ణయం, అభిమానుల్లో నిరాశను కలిగించింది. ఇకపై స్టోక్స్ ఆటను చూడలేమనే ఆలోచన వారిని కలచివేస్తోంది.


