30 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ | Danny Lamb forced to retire at 30 after serious spinal cord injury | Sakshi
Sakshi News home page

30 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌

Aug 12 2026 6:39 PM | Updated on Aug 12 2026 7:04 PM

Danny Lamb forced to retire at 30 after serious spinal cord injury

ఇంగ్లండ్ దేశవాళీ క్రికెటర్, ససెక్స్ కౌంటీ క్లబ్ ఆటగాడు డానీ లాంబ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 30 ఏళ్ల వయస్సులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతడు ప్రకటించాడు. తీవ్రమైన మెడ, వెన్ను గాయం కారణంగా లాంబ్ తన కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.

ప్రస్తుతం ససెక్స్ కౌంటీ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లాంబ్‌.. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో మెడలోని డిస్క్ సమస్యకు గురయ్యాడు. ఈ గాయం వెన్నుపాము(spinal cord)పై ప్రభావం చూపడంతో అతడి సమస్య మరింత తీవ్రమైంది.

దీంతో లాంబ్‌కు అత్యవసరంగా డిస్కెటోమీ, ఫ్యూజన్ సర్జరీ నిర్వహించారు. అయితే శస్త్రచికిత్స తర్వాత క్రికెట్‌ ఇకపై ఆడకూడదని వైద్యులు అతడికి సూచించారు. ఈ క్రమంలోనే డానీ లాంబ్‌ రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడు. 

లాంబ్ తొలుత లాంకాషైర్ కౌంటీ క్లబ్ తరపున 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.  మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ఆరేళ్ల తర్వాత లాంకాషైర్‌కు గుడ్‌బై చెప్పి 2023లో ససెక్స్ కౌంటీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

కానీ మూడేళ్ల తిరగకుముందే అనుహ్యంగా గాయాల బారిన పడి తన  కెరీర్‌ను లాంబ్ ముగించాడు. అతడు తన కెరీర్‌లో 38 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 1232 పరుగులతో పాటు 68 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో కూడా లాంబ్‌ పేరిట 61 వికెట్లు ఉన్నాయి.
చదవండి: IND vs SL: టీమిండియాకు భారీ షాక్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement