అంకిత రైనా పరాజయం | Ankita Raina defeat | Sakshi
Sakshi News home page

అంకిత రైనా పరాజయం

Sep 13 2023 1:18 AM | Updated on Sep 13 2023 1:18 AM

Ankita Raina defeat - Sakshi

జపాన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ అంకిత రైనా పోరాటం  తొలి రౌండ్‌లోనే ముగిసింది. ఒసాకాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి  రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 181వ ర్యాంకర్‌ అంకిత 4–6, 2–6తో ప్రపంచ 174వ  ర్యాంకర్‌ మొయుక ఉచిజుమా (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సరీ్వస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్‌లో ఓడిన అంకితకు 2,804 డాలర్ల (రూ. 2 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 

Advertisement
 
Advertisement
Advertisement