
మహా గర్జనకు తరలిరండి
మెదక్ మున్సిపాలిటీ: దివ్యాంగుల సమస్యలపై ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే మహా గర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహాక సభకు హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి, 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదన్నారు. దీంతో దివ్యాంగులు రూ. 20,000 కోట్లు నష్టపోయారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేసిన డబ్బులు దివ్యాంగులకు సంబంధించినవేనని అన్నారు. పేద వర్గాల డబ్బులు దోచి భూమి ఉన్నవర్గాలకు రేవంత్ రెడ్డి దోచిపెట్టాడని విమర్శించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి దండు శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి విజయ్, సైదులు, చెట్లపల్లి యాదగిరి, మురళి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మందకృష్ణ మాదిగ