
హస్తం హవా కొనసాగాలి
సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో హస్తం హవా కొనసాగాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, టీపీసీసీ మెదక్ ఇన్‌చార్జి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులతో హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన గుర్తింపునివ్వాలని చెప్పారు. కష్టకాలంలో జెండా మోసిన వారితో, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. సమావేశానికి సంగారెడ్డి నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా నేతల సమావేశంలో
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్