
యోగాతో మానసిక ప్రశాంతత
హత్నూర(సంగారెడ్డి): ప్రతీరోజు యోగా సాధన చేయడం వల్ల విద్యార్థులకు మానసిక ప్రశాంతతతోపాటు ఏకాగ్రత ఉంటుందని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రమైన హత్నూర కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో బసచేసిన కలెక్టర్ మంగళవారం ఉదయం విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడటంతోపాటు ఏకాగ్రత కూడా వస్తుందని తెలిపారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్న తహసీల్దార్ పర్వీన్‌షేక్, ప్రత్యేక అధికారి జయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య