
రైతులకు సరిపడా ఎరువుల సరఫరా
జిన్నారం (పటాన్‌చెరు): రైతుల డిమాండ్‌కు తగ్గట్లుగా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. సోలక్‌పల్లి గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. మండలంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా యూరియా డీఏపీ, ఎంఓపీ ఇతర కాంప్లెక్స్ ఎరువుల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎరువుల సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల దుకాణాల వద్ద స్టాక్ పొజిషన్, ఎమ్మార్పీ ధరలు తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని దుకాణ నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి, ఏఈఓ అజారుద్దీన్, ఎరువుల దుకాణ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్