
స్వచ్ఛతలో సత్తా చాటేనా?
ఉత్తమ పంచాయతీల గుర్తింపునకు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే
మార్కుల కేటాయింపు ఇలా..
అంశాలు మార్కులు
క్షేత్ర స్థాయి పరిశీలన ఆధారంగా 540
మానవ వనరుల వినియోగం 240
వ్యర్థాల నిర్వహణ కేంద్రం 120
ప్రజాభిప్రాయ సేకరణకు 100
మొత్తం 1000 మార్కులు ఉంటాయి.
● పల్లెల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం
● జిల్లాలో 20 గ్రామాల ఎంపిక
● దాదాపు పూర్తయిన సర్వే
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలను గుర్తించేందుకు కేంద్ర బృందం సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా రోజుకు రెండు గ్రామాల చొప్పున సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు మరుగుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్యం నిర్వహణ, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రార్థన ప్రదేశాలు తదితర వాటిని వారు పరిశీలిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అయితే ఈసారి స్వచ్ఛతలో గ్రామాలు సత్తా చాటుతాయో? లేదో వేచి చూడాలి.
జిల్లాలో 620 గ్రామ పంచాయతీలున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను గుర్తించేందుకు 20 గ్రామాలను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు వట్‌పల్లి మండలంలోని గొర్రెకల్, మర్వెల్లి, పుల్‌కల్‌లోని శివంపేట్, వెండికోల్, సురెడ్డి ఇటిక్యాల, హత్నూరలోని ఎల్లమ్మగూడ, కొండాపూర్‌లోని మనసన్‌పల్లి, న్యాల్‌కల్‌లోని అమీరాబాద్, మొగుడంపల్లి మండలం, కందిలోని ఎద్దుమైలారం, అందోల్‌లోని తాలెల్మ, కల్హేర్‌తోపాటు నిజాంపేట్‌లోని రాంరెడ్డి పేట్, మనూర్‌లోని అతిమ్యాల్, మనూర్, నాగిల్‌గిద్దలోని ముక్తాపూర్, కారముంగి, నారాయణఖేడ్‌లోని నాగూర్, పగిడిపల్లి గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. మొత్తం 20 గ్రామాలకు గాను 19 గ్రామాల్లో పర్యటించగా ఒక గ్రామ పంచాయతీ మాత్రం మున్సిపాలిటీలో కలవడం వల్ల సందర్శించలేదు.
ఒక్కో గ్రామంలో 16 ఇళ్లల్లో సర్వే
ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో 16 నివాస గృహలను ఎంచుకొని బృందం సభ్యులు సర్వే చేస్తున్నా రు. అందులో మూడు ఎస్సీ, మూడు ఎస్టీ, ఇతర వర్గాలకు చెందిన 10 కుటుంబాలను ఎంపిక చేసు కుని ఆయా ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరిస్తున్నారు.
పరిశీలిస్తున్న అంశాలు..
ఎంపిక చేసుకున్న గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్డి ఉందా? ఉంటే దానిని వినియోగిస్తున్నారా? నల్లా ఉందా, దాని ద్వారా తాగు నీరు సరఫరా అవుతుందా? ఇంకుడు గుంత ఉందా? మురుగు నీరు మురికి కాల్వలోకి వెళ్తుందా? ఇంకుడు గుంతలోకి వెళ్తుందా? అని వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే చెత్త సేకరణ ఎలా జరుగుతుంది? తడి, పొడి చెత్త వేరు చేస్తున్నారా? సేకరించిన చెత్తను ఎక్కడ వేస్తున్నారు? డంపింగ్ యార్డు ఉందా? ఉపాధిహామీ పథకం పనితీరు, జాబ్ కార్డులు ఉన్నాయా?అనే అంశాలను అడుతున్నారు. గ్రామంలో రోడ్లు, తదితర వసతులతోపాటు పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రార్థనాలయాలు సందర్శించి వాటిలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, ఉన్నాయా?ఉంటే వాటి నిర్వహణ ఎలా ఉందనే విషయాలను పరిశీలిస్తున్నారు. సేకరించిన సమాచారం ఆధారంగా పంచాయతీలకు మార్కులు కేటాయిస్తారు. వాటి ఆధారంగా ఎంపికై న ఉత్తమ పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు.
పకడ్బందీగా సర్వే
ఎంపిక చేసుకున్న గ్రామాల్లో పకడ్బందీగా సర్వే కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాల్లో పర్యటించి సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 19 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, ఓ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం కావడం వల్ల సర్వే జరగలేదు. సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపరుస్తున్నాం. – దెశెట్టి స్వామి,
ఎస్‌బీఐ కో–ఆర్డినేటర్, సంగారెడ్డి

స్వచ్ఛతలో సత్తా చాటేనా?