
పీఎంశ్రీ హైస్కూల్ శిలాఫలకం ఆవిష్కరణ
వర్గల్(గజ్వేల్): పీఎంశ్రీ పాఠశాల లు దేశానికి అంకితంలో భాగంగా మంగళవారం భారత విద్యా శాఖ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నుంచి వర్గల్ పీఎంశ్రీ జెడ్పీహైస్కూల్ వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నది. ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి సునీత, ఏఏపీసీ చైర్మన్ భవాని, ఇన్‌చార్జి హెచ్‌ఎం సుధారాణి, ఏఈ అరవింద్, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా ‘పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ వర్గల్’ శిలాఫలకాన్ని ఎంఈఓ సునీత ఆవిష్కరించారు. పీఎంశ్రీ స్కూల్ కావడంతో పాఠశాలకు కంప్యూటర్లు, సంగీత పరికరాలు, ఆట వస్తువులు, సైన్ ్స ల్యాబ్, తరగతి గదులు తదితర అనేక హంగులు సమకూరుతున్నాయని పేర్కొన్నారు. ఇవి విద్యావికాసానికి బాటలు వేస్తాయని తెలిపారు.