
బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం
చేర్యాల(సిద్దిపేట): నలబైరెండు శాతం బీసీ రిజర్వేషన్‌కు బీజేపీ వ్యతిరేకమని, అందుకే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టడం లేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు ఆరోపించారు. బుధవారం పట్టణ కేంద్రంలో జరిగిన చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ కుల,మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ప్రజల ఐక్యతను విడదీస్తుందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పార్లమెంటులో బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి యూరియా కొరత ఏర్పడిందని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్‌గా సత్తిరెడ్డి వ్యవహరించగా జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు యాదవరెడ్డి, శశిధర్, వెంకట్‌మావో, యాదగిరి, అరుణ్, రవీందర్, కృష్ణారెడ్డి, శారద, ప్రశాంత్, శిరీష, నాగరాజు, షఫీ, రాజు, ఇస్తారీ, బాలకిషన్, శ్రీహరి, శోభ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్ బాబు