
గంజాయి కేసులో వ్యక్తికి జైలు
జహీరాబాద్ టౌన్: గంజాయి కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా అదనపు జడ్జి బుధవారం తీర్పు చెప్పారని ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వివరాలోకి వెళితే... ముంబాయికి చెందిన సట్రాజ్ హుస్సేన్(39) 2019లో కారులో 16 కిలోల గంజాయిని అక్రమంగా ముంబాయి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నాడు. కోహీర్ మండల కవేలి చౌరస్తా వద్ద ఎకై ్సజ్ అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఎండు గంజాయితో హుస్సేన్ పట్టుబడ్డాడు. అప్పట్లో కేసు నమోదు చేసి ఆయనను రిమాండ్‌కు పంపారు. కేసు పూర్వాపరాలు విన్న తరువాత జడ్జి హుస్సేన్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది.