పిల్లర్‌ గుంతలోపడి వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

పిల్లర్‌ గుంతలోపడి వృద్ధుడు మృతి

Jul 31 2025 9:16 AM | Updated on Jul 31 2025 9:16 AM

పిల్ల

పిల్లర్‌ గుంతలోపడి వృద్ధుడు మృతి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రమాదశాత్తు పిల్లర్‌ గుంతలో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేశ్‌ వివరాలిల ప్రకారం.. శమ్నాపూర్‌ గ్రామానికి చెందిన కాటిపడిగల కిషన్‌(67) తన ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్‌ గుంతలో కాలుజారి పడిపోయాడు. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతలో నీరు నిల్వడంతో వెంటనే ఆయనను కుటుంబీకులు పైకి తీసేలోపే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడ్ని మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య నర్సమ్మ, కుమారుడు ఉన్నాడు.

2 నుంచి జిల్లా స్థాయి

యోగా పోటీలు

చేగుంట(తూప్రాన్‌): యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన చేగుంటలో ఆగస్టు2న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేష్‌రవికుమార్‌ తెలిపారు. సబ్‌ జూనియర్‌ నుంచి 55 సంవత్సరాల వరకు గల సీ్త్ర, పురుషుల వరకు 6 కేటగిరిలలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఆదిలాబాద్‌ నిర్మల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. వివరాలకు 96666 32023 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

చెరువులో

మృతదేహం లభ్యం

హత్య చేసి చెరువులో పడేసినట్లు అనుమానం

చేర్యాల(సిద్దిపేట)/మద్దూరు(హుస్నాబాద్‌): అదృశ్యమైన వ్యక్తి చెరువులో మృతదేహమై కనిపించాడు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం... మృతదేహం ములుగు మండల కేంద్రానికి చెందిన తిగుళ్ల నెహ్రూ(35)గా గుర్తించారు. ములుగు ఐకేపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పని చేసే నెహ్రూ సోమవారం ఉదయం రోజువారీగా కార్యాలయానికి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గాగిళ్లాపూర్‌ చెరువులో మృతదేహం ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ములుగు పోలీసులు నెహ్రూ మృతదేహంగా గుర్తించారు. ఇదిలా ఉంటే కాళ్లు చేతులు కట్టి, నడుముకి బండరాయి కట్టి ఉండటంతో ఎక్కడో హత్య చేసి తీసుకువచ్చి పడేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా మృతుడి బంధువులు స్టేషన్‌ ఎదుట నిరసన చేశారు.

ఆలయంలో చోరీ

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని సాయిబాబ ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు హుండీ తాళం పగలగొట్టి అందులో నుంచి సుమారు రూ.20వేలు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఎస్‌ఐ లింగం చోరీ జరిగిన చోట క్లూస్‌ టీం ద్వారా ఆధారాలు సేకరించారు.

పేకాట స్థావరంపై దాడి

దుబ్బాకరూరల్‌: పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ కీర్తి రాజు వివరాల ప్రకారం... బుధవారం రాత్రి గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.36,280 నగదు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

పిల్లర్‌ గుంతలోపడి  వృద్ధుడు మృతి 
1
1/1

పిల్లర్‌ గుంతలోపడి వృద్ధుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement