
అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
మునిపల్లి(అందోల్): ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండల పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మక్త క్యాసారానికి వెళ్లి రోడ్డంతా గుంతల మయంగా ఉండటంతో నిదానంగా వస్తుంది. ఈ క్రమంలో పెద్దలోడి గ్రామ శివారులోకి రాగానే స్టీరింగ్ రాడ్ విరిగిపోయి బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న సైడ్ కాల్వలోకి వెళ్లి ఆగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో కాలేజీ, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. బస్సు డ్రైవర్ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. గుంతలమయంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రయాణికులు ఆరోపించారు.

అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు