
అథ్లెటిక్స్‌తో ఉజ్వల భవిష్యత్
సిద్దిపేటజోన్: అథ్లెటిక్స్‌తో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ సంఘం జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభించారు. అండర్ 8,10,12, 14,16,18,20 ఓపెన్ విభాగాల్లో బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 320మంది క్రీడాకారులు హాజరయ్యారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీడా సమాఖ్య చైర్మన్ సాయిరాం, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు.