
బైండోవర్ ఉల్లంఘన.. జరిమానా
అక్కన్నపేట(హుస్నాబాద్): బైండోవర్‌ను ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎకై ్సజ్ సీఐ పవన్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ బింగి శారద, చంద్రమౌళి గతంలో తహసీల్దార్ అనంతరెడ్డి ఎదుట బైండోవర్ అయ్యారు. కాగా ఇటీవల గుడుంబా తయారీదారులకు బెల్లం, పటికలు సరఫరా చేస్తూ పట్టుబడి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో తహసీల్దార్ రూ.50వేల జరిమానా విధించారు. ఎస్‌ఐ దామోదర్, రూప తదితరులు ఉన్నారు.
అథ్లెటిక్స్‌లో కృతికి
మూడో స్థానం
తొగుట(దుబ్బాక): జిల్లా స్థాయి అథ్లెటిక్ ్స పోటీల్లో మండలంలోని వెంకట్రావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని తగరం కృతి మూడవ స్థానంలో నిలిచింది. మంగళవారం సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్ సబ్ జూనియర్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో కృతికి జ్ఞాపిక, బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, పీఈటీ కనకయ్యలను హెచ్‌ఎం నయీమా కౌసర్ అభినందించారు.
వ్యక్తి ఆత్మహత్య
సంగారెడ్డి క్రైమ్: ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ వివరాల ప్రకారం... పట్టణంలోని భవానీనగర్‌కు చెందిన దేవరశెట్టి నవీన్‌కుమార్ (35) వృత్తి రీత్యా సీసీ కెమెరాల పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికెళ్లి చూడగా దూలానికి చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నవోదయకు
గడువు పొడిగింపు
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. గడువు తేదీ మంగళవారంతో ముగిసిందని, విద్యార్థుల ప్రయోజనం కోసం గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్ చోరీ
నర్సాపూర్: రెండు ట్రాన్స్‌ఫార్మర్లలో 20లీటర్ల ఆయిల్‌ను దొంగలు చోరీ చేశారు. ఎస్‌ఐ లింగం కథనం ప్రకారం... నర్సాపూర్ – తూప్రాన్ మార్గంలో హెచ్‌పీ గ్యాస్ గోదాం సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్, నారాయణపూర్ చౌరస్తా వద్ద గల ట్రాన్స్‌ఫార్మర్‌లను కింది భాగంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి కట్ చేసి వాటిలో ఉండే ఆయిల్‌ను చోరీ చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

బైండోవర్ ఉల్లంఘన.. జరిమానా

బైండోవర్ ఉల్లంఘన.. జరిమానా