
ప్రభుత్వంపై దుష్ప్రచారం
చిన్నశంకరంపేట(మెదక్): బీఆర్‌ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లాకు వెళ్తూ మంగళవారం నార్సింగి మండలం జప్తిశివనూర్‌లోని మాజీమంత్రి షబ్బీర్‌అలీ గెస్ట్‌హౌస్‌లో ఆగిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలతో కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతున్నాయన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కవడంతోనే బీఆర్‌ఎస్‌కు ఎక్కడా డిపాజిట్‌లు కూడా రాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్నది నిజం కాకపోతే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మంత్రి వెంట మాజీమంత్రి షబ్బీర్‌అలీ, కామారెడ్డి, బిక్కనూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క ధ్వజం