
నిఘా నీడలో సంగారెడ్డి
పట్టణంలో 500 సీసీ కెమెరాల ఏర్పాటు!
సంగారెడ్డి టౌన్: పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. నేరాలు సైతం పెరుగుతున్నాయి. పట్టణంలో సుమారు 1.80 లక్షల జనాభా, 38 వార్డులలో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, నేరాలు, హత్యలు జరుగుతుండటంతో వాటిని అరికట్టడానికి పట్టణవ్యాప్తంగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కేసులలో పోలీస్‌శాఖకు అంతుచిక్కని విధంగా ఆధారాలు లేకుండా జరిగిన సంఘటనలు ఉన్నాయి. దీంతో నేరస్తులను ఆరా తీసేందుకు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, పోతిరెడ్డిపల్లి, బైపాస్, చౌరస్తాలలో సైతం ఏర్పాటు చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా కేంద్రం సీసీ కెమెరాల నిఘాలో ఉండనుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారు, రోడ్డు ప్రమాదాలపై సీసీ కెమెరాల్లో చూసిన వెంటనే వారిపై చర్యలు తీసుకోనున్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూ. 8 కోట్లతో సీసీ కెమెరాలు బిగించేందుకు పోలీస్‌శాఖ ఏర్పాటు చేస్తోంది. సీసీ కెమెరాల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
నేరాలను అరికట్టడానికే..
జిల్లా కేంద్రంలో నేరాలను అరికట్టడానికి పట్టణవ్యాప్తంగా సీసీ 500 కెమెరాలను ఏర్పా టు చేయనున్నాం. ఎస్పీ కార్యాలయంలో క మాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం పోలీసుల పర్యవేక్షణ తో పాటు నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది.
– సత్తయ్య, సంగారెడ్డి డీఎస్పీ

నిఘా నీడలో సంగారెడ్డి