
సీజనల్‌పై అప్రమత్తం
మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సీజనల్, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటి జ్వర సర్వేను ముమ్మరం చేసింది. జ్వర పీడితులు, ఇతర వ్యాధిగ్రస్తుల గుర్తింపు చేపట్టింది. రోగి పరిస్థితికి అనుగుణంగా స్థానికంగా ఇంట్లో లేదా సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించే చర్యలు తీసుకొంటుంది. మంత్రి జిల్లాలో ముందు జాగ్రత్తగా వైద్యశాఖ అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించి ఇంటింటి సర్వేను స్పీడప్ చేశారు.
– నారాయణఖేడ్
జిల్లాలో 30 పీహెచ్‌సీలు, 246 సబ్‌సెంటర్లు, 19 బస్తీ దవాఖానాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందుతున్నాయి. జిల్లాలో 4.60 లక్షల నివాసాల్లోని 16 లక్షల జనాభాకు ఈ వైద్యశాలల పరిధిలో 48 మంది పీహెచ్‌సీ వైద్యులు, 400 మంది ఏఎన్‌ఎంలు, 156 మంది హెల్త్ సూపర్‌వైజర్లు చికిత్స చేస్తుండగా, 908 మంది ఆశ కార్యకర్తలు సహకారాలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా డోర్‌టు డోర్ సర్వేను వైద్యశాఖ అధికారులు చేపట్టారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు ఈ సర్వే కొనసాగనుంది.
తక్షణం స్పందించాలి
ఏ గ్రామం, తండాలో వైద్య పరంగా సమస్యలు వచ్చినా తక్షణం స్పందించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. హైరిస్క్ జోన్లలో ప్రివెంటీవ్ మేజర్స్‌పై దృష్టి పెట్టాలని, వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటే గర్భిణులను తరలించాలని సూ చించింది. ఆస్పత్రుల్లో సానిటేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, పరిశుభ్రత లోపిస్తే చర్యలు ఉంటాయని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను అప్రమత్తం చేసి అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, యాంటీ లార్వాల్ ఆపరేషన్స్, ఫాగింగ్, ఇండోర్ స్ప్రేయింగ్ విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా తాగు నీటి నమూనాలు పరీక్షించాలని, ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున.. ఓపీ కౌంటర్లు పెంచే చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రుల్లోనే అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు అందించాలని, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్న ఆదేశాలను అమలు చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెండీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో అందుకనుగుణంగా చర్య లు తీసుకుంటున్నారు. 102 వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డెంగీ, మలేరియా కార్డెన్ కిట్స్ పీహెచ్‌సీలో 500, సబ్‌సెంటర్లలో 100 చొప్పున సిద్ధంగా ఉంచారు. ఓఆర్‌ఎస్, డయేరియా, కోల్డ్, యాంటీ బయోటిక్, ప్యారసిటమాల్ తదితర మందులు సిద్ధం చేశారు. పాముకాటుకు సంబంధించి యాంటీ స్నేక్ వీనం, కుక్కకాటు మందులను పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉంచారు.
అధికారుల ముందస్తు జాగ్రత్తలు
జోరుగా డోర్‌టు డోర్ సర్వే
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా
ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం వ్యవహరించి రోగులను దోచుకోకుండా చూడాలని సూచి ంచారు. ఈ మేరకు అధికారులు తనిఖీలకు సిద్ధమవుతున్నారు.