
రూ. 5 లక్షలు సరిపోతాయా?
పటాన్‌చెరు టౌన్: మండలంలోని పెద్దకంజర్ల గ్రామంలో సోమవారం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) బృందం పర్యటించింది. సభ్యులు సృజన్, సయ్యద్ అలీ నేతృత్వంలోని బృందం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, జాబ్ కార్డులు.. తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలో ఎన్ని రోజులు పని ఇచ్చారనేది రాసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు 44 దరఖాస్తులకు ఆమోదం వచ్చిందని ఎంపీడీఓ యాదగిరి వారికి వివరించారు. వారిలో 16 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని హౌసింగ్ ఏఈ నందిని తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు సరిపోతాయా.? అని బృందం సభ్యుడు సృజన్ ప్రశ్నించారు. సరిపోవని, లబ్ధిదారులకు సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ ద్వారా రూ. లక్ష రుణం అందేలా చూస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వరకు ఖర్చు వస్తుందని లబ్ధిదారులు తెలిపారని అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర బృందం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించింది. కార్యక్రమలో పంచాయితీరాజ్ ఏఈ సంపత్, ఏపీఎం శ్రీనివాస్, ఏపీఓ సంతోష్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై
కేంద్ర బృందం ఆరా
పెద్దకంజర్లలో పర్యటన
గ్రామస్తులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం