Telangana News: ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. క్షేమంగా తల్లీబిడ్డలు!
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. క్షేమంగా తల్లీబిడ్డలు!

Aug 27 2023 4:18 AM | Updated on Aug 27 2023 10:56 AM

- - Sakshi

మెదక్‌: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సుఖ ప్రసవం జరిగిన సంఘటన జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. డిపో మేనేజర్‌ నారాయణ వివరాలు. పొట్‌పల్లి గ్రామానికి చెందిన హాజీ పాషా భార్య జరీనా బేగంకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం కోసం బీదర్‌ ఆసుపత్రికి వెళ్లడానికి శుక్రవారం రాత్రి సహాయకులతో కలిసి జహీరాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది.

బస్సు పట్టణం దాటగానే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. బస్సు డ్రైవర్‌ ఆనందం, కండక్టర్‌ కరుణాకర్‌ మార్గమధ్యలో ఉన్న మిర్జాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి బస్సును తరలించారు. నర్స్‌ సుధారాణిని బస్సు వద్దకు తీసుకుని వచ్చేలోపు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement