ఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమాహారతి
కల్హేర్(నారాయణఖేడ్): పంటల సాగులో రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలని నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమాహారతి సూచించారు. కల్హేర్‌లో మంగళవారం జరిగిన ‘రైతు నేస్తం’100వ ఎపిసోడ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయిల్‌పామ్, ఇతర పంటలు సాగు చేసి లాభాలు పొందాలని కోరారు. ఆయిల్‌పాం రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఏఓ శ్రీదేవి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పండరీ, ఆత్మ చైర్మన్ వినోద్‌పాటిల్, ఏడీఏ నూతన్‌కుమార్, తహసీల్దార్ శివశ్రీనివాస్, ఎంపీడీఓ హరినందన్‌రావు, ఏఓ వెంకటేశం, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహరెడ్డి పాల్గొన్నారు.
ఝరాసంగం(జహీరాబాద్): నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భూములు కోల్పోతున్న ప్రతీ రైతుకు ఎకరానికి 120 గజాల స్థలం కేటాయించాలన్నారు. వ్యవసాయ భూములపై ఆధారపడ్డ కుటుంబాలకు పునరావాసం, పునరుద్ధరణ ప్రయోజనాలు కల్పించాలన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే కూలీలు, రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలయ్య, గోపాల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.


