జైల్‌ భరోకు తరలిరండి | - | Sakshi
Sakshi News home page

జైల్‌ భరోకు తరలిరండి

Jul 30 2026 7:30 AM | Updated on Jul 30 2026 7:30 AM

జైల్‌ భరోకు తరలిరండి

నర్సాపూర్‌: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఆగస్టు 10న చేపట్టిన జైల్‌ భరో కార్యక్రమానికి అందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు కోరారు. ఆయన పలువురు నాయకులతో కలిసి మంగళవారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ప్రజలు, కార్మికులు, రైతుల వ్యతిరేక విధానాలను గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. ఆయన వెంట ఆయా సంఘాల నాయకులు అన్నపూర్ణ, సురేశ్‌,శివ,చందర్‌,నాగభూషణం,రెడ్యానాయక్‌, ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement