అధికారులకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులకు సహకరించాలి

Jul 30 2026 7:30 AM | Updated on Jul 30 2026 7:30 AM

అధికారులకు సహకరించాలి ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఎస్‌ఐఆర్‌ను విజయవంతం చేయాలి

మెదక్‌ ఆర్డీవో రమాదేవి

రామాయంపేట(మెదక్‌): వ్యవసాయ భూ ముల రీ సర్వే కోసం గ్రామానికి వచ్చే అధికారులు, సిబ్బందికి సహకరించాలని మెదక్‌ ఆర్డీవో రమాదేవి సూచించారు. శివ్వాయపల్లిలో మంగళవారం భూ సర్వే గ్రామసభ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రీ సర్వే కార్యక్రమానికి గ్రామస్థులు సహకరించాలన్నారు. సర్వే అధికారులు గ్రామంలో వ్యవసాయ భూములను పూర్తి స్థాయిలో రీ సర్వే చేస్తారని, ఏళ్ల తరబడి భూసంబంధిత గొడవలు ఈ సర్వేతో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సర్వే విభాగం ఏడీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌): సిర్గాపూర్‌ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్‌ తిరుపతయ్య మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో 8 సీట్లు, బైపీసీలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌

వెల్దుర్తి(తూప్రాన్‌): సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను పార్టీలకతీతంగా విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రం వెల్దుర్తిలో నిర్వహించిన మండల ప్రభాస్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హుడైన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా బూత్‌స్థాయి అధికారుల వద్ద కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఓటరు నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు వంటి అంశాలను బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశం, సర్పంచ్‌లు ఆదర్శ్‌, మల్లేశంగౌడ్‌, నాయకులు శేఖర్‌గౌడ్‌, నవీన్‌, బాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement